షూటింగ్ లోనే కొట్లాడుకున్న ప్రియాంక చోప్రా- కరీనా కపూర్..? గొడవలపై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.
బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. కరీనా కపూర్ మధ్య గొడవలు ఉన్నాయా.. వీరిద్దరి మధ్ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందా..? ఇద్దరు కలిసి పబ్లిక్ గానే ఫైటింగ్ చేసుకున్నారా..? తాజాగా క్లారిటీ ఇచ్చిన కరీనా ఏమన్నారు..?
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలిగారు ప్రియాంక చోప్రా.. కరీనా కపూర్. ఈ ఇద్దరు హీరోయిన్లు ఎవరూ తక్కువ కాకుండా స్టార్ డమ్ ను అనుభవించారు. ఇప్పటికీ ఇద్దరు లైమ్ లైట్ లోనే ఉన్నారు. ప్రియాంక హాలీవుడ్ లో హడావిడి చేస్తుంటే.. కరీనా కపూర్ బాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటుంది.
ఈక్రమంలో ఈ ఇద్దరు తారలకు సబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి నుంచి ఈ ఇద్దరు హీరోయిన్లు మధ్య సక్యత లేదు.. అంతే కాదు ఇద్దరి మధ్య గట్టిగా గొడవలు కూడా అయ్యేవంట.. కరీనా, ప్రియాంక.. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇది బాలీవుడ్ మాట. ఇద్దరికి ఎప్పుడూ పడేది కాదంటారు బీటౌన్ జనాలు. ఇద్దరు కలిశారంటే ముఖాలు మాడ్చుకుని ఉండేవారట.
ఇక వృత్తి పరంగా వీరిమధ్య ఉండాల్సిన పోటీ.. పర్సనల్ గా మారి. శత్రుత్వం పెరిగిందంటారు.. సినీ జనాలు. అంతే కాదు అప్పట్లో ఈ ముద్దుగుమ్మలు కలిసి ఐత్రాజ్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా నిర్మాణ సమయంలో వీరిద్దరూ సెట్‌లో కిందపడి మరీ స్ట్రీట్ ఫైట్ చేసుకున్నారని.. ఎవరు ఆపినా ఆగకుండా కొట్టుకున్నారని అప్పట్లో ఓ న్యూస్ బాగా వినపడింది. ఆ తర్వాత కూడా వీరిమధ్య అడపాదడపా గొడవలు జరిగాయని చెబుతుంటారు.
అయితే ఈవిషయంలో మొత్తానికి మ్యాటర్ తెలియకపోయినా.. కొంతలో కొంత వీరిగురించి బయట ప్రపంచానికి తెలుసు.. అయితే ఈ విషయంపై ఎట్టకేలకు .. అది కూడా ఇన్నాళ్లకు స్పందించింది కరీనా కపూర్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడింది. అంతే కాదు క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది కరీనా కపూర్.
కరీనా మాట్లాడుతూ.. ప్రియాంక, నేనూ కొట్లాడుకున్నామన్న మాటల్లో నిజం లేదు. అది అవాస్తవం.. అబద్దపు ప్రచారం మాత్రమే. మా ఇద్దరికీ ఎప్పుడూ గొడవ జరగలేదు. అప్పట్లో వృత్తిపరంగా మా మధ్య గట్టి పోటీ ఉండేది. ఇద్దరం నువ్వానేనా అనేలా నటించేవాళ్లం. తగ్గట్టే మాకు మంచి పాత్రలు దొరికాయి. మా పోటీని చూసి, మాపై కొందరు లేనిపోనివి సృష్టించి రాసేవారు అని అన్నారు.
అంతే కాదు ఇప్పటికీ అవే నిజమని చాలా మంది నమ్ముతున్నారు. కాని వాళ్లు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. అందులో ఏమాత్రం నిజం లేదు.. మా మధ్య శత్రుత్వం కూడా లేదు అంటూ తన మనసులోమాట బయట పెట్టింది కరీనా. ఇంకా మాట్లాడుతూ సినిమా అంటేనే వైకుంఠపాళీ. ప్రతిసారీ ఇక్కడ గెలవలేం. ఒక్కోసారి ఘోరమైన ఓటములు ఎదురవుతాయి అని చెప్పుకొచ్చింది.