Commitment: తేజస్వి 'కమిట్మెంట్'పై దుమ్మెత్తి పోస్తున్న కరాటే కళ్యాణి.. బూతు సినిమాలో ఆ శ్లోకం
యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మడివాడ నటించిన తాజా చిత్రం 'కమిట్మెంట్'. శృంగారం, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ తేజస్వి మడివాడ నటించిన తాజా చిత్రం 'కమిట్మెంట్'. శృంగారం, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగష్టు 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్స్, ట్రైలర్స్ గమనిస్తే ఎక్కువగా శృంగారానికి సన్నివేశాలు, అసభ్యకరమైన మాటలే కనిపిస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఈ వివాదానికి కారణం అయింది. ట్రైలర్ లో శృంగార సన్నివేశాలు చూపిస్తూ బ్యాగ్రౌండ్ లో భగవద్గీత శ్లోకాన్ని వినిపించారు. ఇది అత్యంత అసభ్యంగా హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉంది.
దీనితో బిజెపి పార్టీ లో కొనసాగుతున్న నటి కరాటే కళ్యాణి రంగంలోకి దిగారు. తేజస్వి కమిట్మెంట్ చిత్రంపై విరుచుకుపడ్డారు. అసభ్యకర సన్నివేశాల్లో ఆ శ్లోకాన్ని ఎలా ఉపయోగిస్తారు అని ఆమె ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని గట్టిగా కరాటే కళ్యాణి వార్నింగ్ ఇచ్చారు.
అంతే కాదు ఆమె ఈ చిత్రంపై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇటీవల ఎక్కువగా తన గ్లామర్ కి పదును పెడుతున్న యంగ్ బ్యూటీ తేజస్వి మడివాడ ఈ చిత్రంలో మరింత బోల్డ్ గా నటించింది.
లిప్ లాక్ సన్నివేశాలు, శృంగార సన్నివేశాల్లో తేజస్వి రెచ్చిపోయి నటించినట్లు ఉంది. అలాగే బూతులతో బోల్డ్ డైలాగులు కూడా చెప్పింది. గతంలో కూడా తేజస్వి బోల్డ్ రోల్స్ చేసింది. కానీ ఈ చిత్రంలో డోస్ పెంచిందనే చెప్పాలి.
తేజస్వి ఇటీవల సోషల్ మీడియాలో బికినిలో సైతం అందాలు ఆరబోయడం చూస్తూనే ఉన్నాం. తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన తేజస్వి నటిగా నెక్స్ట్ లెవల్ కి చేరుకోలేకపోయింది.