- Home
- Entertainment
- 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ‘కాంతార’.. రెండ్రోజుల్లో తెలుగు, హిందీలో ఇంత కలెక్ట్ చేసిందా?
100 కోట్ల క్లబ్ లోకి చేరిన ‘కాంతార’.. రెండ్రోజుల్లో తెలుగు, హిందీలో ఇంత కలెక్ట్ చేసిందా?
బ్లాక్ బాస్టర్ గా నిలిచిన కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara) థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిందీ చిత్రం.

ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన `కేజీఎఫ్` మొదలు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు సత్తా చాటుతున్నాయి. ‘చార్లీ777’,‘విక్రాంత్ రోణా’ వంటి చిత్రాలు ఆ వరుసలోనే నిలిచాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘కాంతార’ వచ్చి చేరింది. రిషబ్ శెట్టి (Shetty) దర్శకత్వం వహించడంతో పాటు రూపొందించారు. సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటించింది. కిషోర్ డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ గా అలరించారు.
బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో బాక్సాఫీస్ వద్ద ‘కాంతార’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘కాంతార’ ఆదివారంతోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ కన్నడ చిత్రం ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం రికార్డు అనే చెప్పాలి.
ఈ రోజుతో కాంతార రిలీజ్ అయి 17 రోజులు అవుతోంది. ఇతర భాషల్లో రెండు రోజులుగా దుమ్ములేపుతోంది. అదిరిపోయే రెస్పాన్స్ తో పాటు కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వీక్ వైజ్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి వారం - రూ.40.5 కోట్లు, రెండో వారం వారం - రూ. 53.4 కోట్లు వసూళ్లు చేసింది.
ఇక తెలుగులో15వ రోజు రూ. 6.6 కోట్లు, 16వ రోజు రూ.16.9 కోట్లు, రూ.17వ రోజు రూ.22.8 కోట్లు వసూల్ చేసింది. ఇక తెలుగు వెర్షలోనూ ‘కాంతారా’ కేవలం రెండు రోజుల్లోనే రూ.11.5 కోట్లు వసూల్ చేసిందని అధికారికంగా ప్రకటించారు. హిందీలోనూ రూ.8.07 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 140.2 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
సెప్టెంబర్ 30న ఈ చిత్రం కేవలం కన్నడలోనే రిలీజ్ అయ్యింది. అక్కడ బ్లాక్ బాస్టర్ చిత్రంగా ఆడియెన్స్ ను మెప్పించింది. అడవి బిడ్డల కట్టుబొట్టు, జీవనశైలిలో కండ్లకు కట్టినట్టు చూపించడంతో చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో గీతా ఆర్ట్స్ అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ‘కాంతార’ను తెలుగులో రిలీజ్ చేశారు.
కన్నడలో రిలీజ్ అయిన 15 రోజుల తర్వాత ‘కాంతార’ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెస్పాన్స్ పరంగా అక్కడి కంటే ఎక్కువగా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తుండటం విశేషం. ఈ క్రమంలో తొలిరోజు కలెక్షన్లు కన్నడ కంటే తెలుగులోనే ఎక్కువగా వచ్చాయి. మరో వైపు హిందీ వెర్షన్ కూడా అక్టోబర్ 15నే విడుదలై అక్కడా బ్రహ్మండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. చిత్రాన్ని ప్రేక్షకుల ఆదరిస్తుండటంతో చూస్తూ ‘కాంతార’ లాంగ్ రన్ లో మరింత కలెక్ట్ చేసేలా కనిపిస్తోంది.