MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Samantha: సమంతను భయపెట్టిన డైరెక్టర్ ఎవరు? స్టార్ హీరోతో కనీసం మాట్లాడలేదా?

Samantha: సమంతను భయపెట్టిన డైరెక్టర్ ఎవరు? స్టార్ హీరోతో కనీసం మాట్లాడలేదా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒంటి చేతితో సినిమా నడింపించగలదు. మా ఇంటి బంగారంతో ప్రూవ్ చేసింది కూడా.. అలాంటిది.. ఓ సినిమా షూటింగ్ లో చాలా ఇబ్బంది పడిందా? డైరెక్టర్ ని చూసి భయపడిందా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 06 2026, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సమంత రుతు ప్రభు
Image Credit : others

సమంత రుతు ప్రభు

టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు అనగానే మందుగా వినిపించే పేరు సమంత. మూడేళ్ల గ్యాప్ తర్వాత.. ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా ఉమెన్ ఓరియంటెడ్ మూవీ అయినప్పటికీ.. ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమా మొత్తం సమంత తన భుజాలపై మోసింది. చీర కట్టుకొని ఆమె చేసిన యాక్షన్ సీన్స్ కి థియేటర్ లో విజిల్స్ పడ్డాయి. దాదాపు 90 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రాజమౌళి ఈగ
Image Credit : our own

రాజమౌళి ఈగ

అయితే.. తన సినిమా కెరీర్ మొదట్లో సమంత ఓ మూవీ డైరెక్టర్ బాగా భయపడిందట. ఈ విషయాన్ని.. మరో నటుడు బయటపెట్టడం విశేషం. సమంత కెరీర్ లో ‘ఈగ’ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్టో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె కెరీర్ మొదలుపెట్టిన చాలా తక్కువ సమయంలోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా మొత్తం ఈగ, సమంత చుట్టూనే తిరుగుతుంది. అయితే.. ఈ మూవీ సమయంలో.. సమంత చాలా భయపడేది అని.. ఆ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కిచ్చా సుదీప్ చెప్పారు. ఆయన ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేయడం విశేషం.

Related Articles

Related image1
Slowest Train:మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు, ఈ రైలు ఎక్కడానికి క్యూలు కడుతున్న జనం, ఎక్కడో తెలుసా?
Related image2
Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు
33
సమంతపై కిచ్చా సుదీప్ కామెంట్స్..
Image Credit : our own

సమంతపై కిచ్చా సుదీప్ కామెంట్స్..

‘ సమంత అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. కానీ ఆ సమయంలో చాలా భయపడేది. ఒకేసారి తనకు పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చింది. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నానని చాలా భయం భయంగా ఉండేది. ఆమె కెరీర్ లో ఈ సినిమా చాలా పెద్ద ప్లస్ అయ్యింది. అప్పుడు ఆమె ఇండస్ట్రీకి చాలా కొత్త. కానీ, చాలా మంచి అమ్మాయి. చాలా కష్టపడుతుంది. సినిమా షూటింగ్ మొత్తంలో సమంత తో నేను పెద్దగా మాట్లాడింది లేదు. హలో, హాయ్ తప్ప పెద్దగా మాట్లాడలేదు. నా ఫోకస్ మొత్తం డైలాగ్ మీదే ఉండేది. నాకు తెలుగు, తమిళం రెండూ రాదు. కాబట్టి.. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. కానీ..సమంత చాలా స్ట్రాంగ్. ఈగ మూవీ తర్వాత.. రెండు, మూడుసార్లు సమంతను కలిశాను. కానీ.. అప్పుడు కూడా హాయ్ హలో తప్ప.. పెద్దగా మాట్లాడింది లేదు’ అని కిచ్చా సుదీప్ చెప్పారు.

ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం సినిమాల నుంచి విరామం తీసుకుంది. ఆమె ప్రస్తుతం తల్లికాబోతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత.. సమంత రాజ్ నిడుమోరుని పెళ్లి చేసుకున్నారు. మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ సమయంలో తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ లో సమంత బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని సమాచారం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Related Stories
Recommended image1
Slowest Train:మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు, ఈ రైలు ఎక్కడానికి క్యూలు కడుతున్న జనం, ఎక్కడో తెలుసా?
Recommended image2
Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved