- Home
- Entertainment
- ఆర్జీవీ ఒక పిచ్చివాడు, తెలుగు వాళ్లే పట్టించుకోవడం లేదు.. రాజ్‌కుమార్‌పై కామెంట్స్.. కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కౌంటర్
ఆర్జీవీ ఒక పిచ్చివాడు, తెలుగు వాళ్లే పట్టించుకోవడం లేదు.. రాజ్‌కుమార్‌పై కామెంట్స్.. కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కౌంటర్
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, కానీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్. కన్నడ స్టార్ రాజ్ కుమార్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడ ఫిల్మ్ ఛాంబర్ మతిపోయే కౌంటర్ ఇచ్చింది.

వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఆయన రాజకీయ నాయకులపై, సినిమా సెలబ్రిటీలపై, ముఖ్యంగా బిగ్ స్టార్స్ పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఒకప్పుడు `శివ` లాంటి సినిమాలతో సంచలనాలు సృష్టించిన ఆయన ఇప్పుడు నాసిరకమైన చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. దీనికితోడు వివాదాస్పద కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
ఎన్టీఆర్, చిరు, రజనీ, రాజ్‌కుమార్‌లపై వర్మ కామెంట్
రామ్ గోపాల్ ఇటీవల సౌత్ సినిమా ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 70, 80లో ఎన్టీఆర్, చిరంజీవి, రజనీకాంత్, రాజ్ కుమార్ వంటి హీరోలు అమితాబ్ బచ్చన్ సినిమాలను రీమేక్ చేసి సూపర్ స్టార్లుగా ఎదిగినట్టు కామెంట్ చేశారు.
బిగ్ బీ సినిమాల వల్లే దక్షిణాది చిత్ర పరిశ్రమలు మనుగడ సాధించాయన్నట్టుగా మాట్లాడారు. అమితాబ్ సినిమాలతో స్టార్‌గా ఎదిగిన వారిలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కూడా ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేశారు.
రాజ్ కుమార్‌పై వర్మ కామెంట్స్ వివాదం
ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. వర్మని పిచ్చివాడిగా వర్ణించింది. తెలుగు చిత్ర పరిశ్రమనే ఆయన్ని పట్టించుకోవడం లేదంటూ క్రేజీ కామెంట్ చేసింది.
ఆయన మాటలను పట్టించుకోవద్దని, ఆయనకు రెస్పాండ్ కావద్దని తెలిపింది. దీనిపై కన్నడ ప్రముఖ మేకర్స్ టీసీ వెంకటేష్, గజానంద్ వంటి వారు స్పందిస్తూ, రాజ్ కుమార్ గురించి ఎవరు తక్కువ చేసిన మాట్లాడినా తప్పే అవుతుందన్నారు.
వర్మపై కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కౌంటర్
అమితాబ్ బచ్చన్ నటించిన `అదే కణ్ణు` అనే సినిమా ఒక్కటే రాజ్ కుమార్ రీమేక్ చేశారని, అది తప్ప మరేదీ రీమేక్ చేయలేదని తెలిపారు. రాజ్ కుమార్ లాగా నవలలు ఆధారంగా సినిమాలు తీయకుండా, కమర్షియల్ సినిమాలు తీసిన వర్మ ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని టీసీ వెంకటేష్ తెలిపారు.
వర్మ వివాదాలు సృష్టించాలని ప్రయత్నిస్తుంటారని, ఇప్పుడు రాజ్ కుమార్ విషయంలోనూ అదే చేశాడని, ఆయన్ని పట్టించుకోకుండా ఉండటమే బెటర్ అని తెలిపారు.
ఆర్జీవీ ఒక పిచ్చివాడు
కన్నడ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ, `డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానులు కోట్లలో ఉన్నారు. ఆర్జీవీ పిచ్చివాడు. తెలుగు, హిందీ సినీ పరిశ్రమ వాళ్ళు ఆయన్ని దూరం పెట్టారు.
ఆడవాళ్ళ గురించి చెడుగా మాట్లాడి వివాదాలు సృష్టిస్తాడు. ఆర్జీవీ ఒక వివాదాస్పద వ్యక్తి. ఆయన గురించి మాట్లాడి ఆయన్ని పెద్దవాడిని చేయొద్దు. ఇప్పుడు సినీ పరిశ్రమ ఆయన్ని దూరం పెట్టింది` అని అన్నారు. మొత్తంగా వర్మకి ప్రయారిటీ ఇవ్వొద్దని కన్నడ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించడం విశేషం.