MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Lenin Villain: నువ్వు విలన్ కాదు, యాంటీ హీరో.. 'లెనిన్' పాత్ర వెనుక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ చెప్పిన ప్రమోద్

Lenin Villain: నువ్వు విలన్ కాదు, యాంటీ హీరో.. 'లెనిన్' పాత్ర వెనుక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ చెప్పిన ప్రమోద్

Lenin Villain: అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాటు, ఇందులో నటించిన కన్నడ నటుడు ప్రమోద్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 15 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్‌ హిట్‌గా లెనిన్‌ మూవీ
Image Credit : Pramod Instagram

సూపర్‌ హిట్‌గా లెనిన్‌ మూవీ

టాలీవుడ్‌లో అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రంతో కన్నడ నటుడు ప్రమోద్ కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాలో 'వసంత్' అనే కీలక పాత్రలో కనిపించిన ప్రమోద్ నటనకు ప్రేక్షకులు, సినీ ప్రియుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇప్పటి వరకు విలన్ పాత్ర చేయలేదు
Image Credit : Pramod Instagram

ఇప్పటి వరకు విలన్ పాత్ర చేయలేదు

సినిమా విజయం సాధించిన ఆనందంలో ప్రమోద్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. 'లెనిన్' సినిమాలో తన పాత్ర ఎలా వచ్చిందో ఆసక్తికరంగా వివరించారు. దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు కథ చెప్పిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ.. 'వసంత్ పాత్ర కథ వినగానే నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. ఆ పాత్రలోని లోతు, దాని ప్రయాణం, కథలో దాని ప్రాముఖ్యత నన్ను చాలా ఆకర్షించాయి. ఈ పాత్ర నేనే చేయాలని మనసులో నిర్ణయించుకున్నా, కానీ ఇప్పటివరకు విలన్‌గా చేయలేదని దర్శకుడికి చెప్పాను' అని ప్రమోద్ తెలిపారు.
35
నా కథలో నువ్వు యాంటీ హీరో
Image Credit : Pramod Instagram

నా కథలో నువ్వు యాంటీ హీరో

దానికి దర్శకుడు స్పందిస్తూ, 'ఇది విలన్ పాత్ర కాదు బ్రదర్... నా కథలో నువ్వు యాంటీ హీరో' అని చెప్పిన క్షణంలోనే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం మొదలైంది. అక్కడి నుంచే 'వసంత్' పాత్ర ప్రయాణం మొదలైంది అని ప్రమోద్ తన అనుభవాన్ని పంచుకున్నారు. 'ఈ రోజు తెలుగు ప్రేక్షకులు నా పాత్రకు ఇస్తున్న ప్రేమ, ప్రశంసలు చూసి నా మనసు నిండిపోయింది. నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కిషోర్ అబ్బూరు, నాగార్జున గారు, అఖిల్ అన్న, అన్నపూర్ణ స్టూడియోస్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని కృతజ్ఞతలు తెలిపారు.
45
తెలుగు ఆడియెన్స్ నుంచి ప్రమోద్‌కి మంచి ప్రశంసలు
Image Credit : Pramod Instagram

తెలుగు ఆడియెన్స్ నుంచి ప్రమోద్‌కి మంచి ప్రశంసలు

'లెనిన్' సినిమాలో అఖిల్ అక్కినేని హీరోగా నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటులు శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావ్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రతి ఒక్కరి నటనకు మంచి స్పందన వస్తోంది. మొత్తానికి, 'లెనిన్' సినిమా విజయంతో పాటు ప్రమోద్ పోషించిన వసంత్ పాత్ర కూడా సినీ ప్రియుల మనసు గెలుచుకుంది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన నటనకు కొత్త గుర్తింపును తెచ్చిపెట్టింది.

55
లెనిన్‌ కలెక్షన్లు
Image Credit : Asianet News

లెనిన్‌ కలెక్షన్లు

జులై 10న విడుదలైన `లెనిన్‌` మూవీ వసూళ్ల పరంగానూ సత్తా చాటుతోంది. ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు రూ.70కోట్లు సాధించినట్టు టీమ్‌ తెలిపింది. కానీ రూ.45కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్‌ సైట్లు చెబుతున్నాయి. మొత్తంగా మాత్రం `లెనిన్‌` హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Indra 2 Update: ఈసారి దేశం గర్వపడేలా మూవీ.. చిరంజీవికి క్షమాపణలు చెప్పిన స్టార్‌ రైటర్‌
Recommended image2
Janaki Love Story: ఫోటోతో మొదలైన ప్రేమ.. సినిమాను మించిన లెజెండరీ సింగర్‌ జానకి లవ్‌ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved