కంగనా 'ఎమర్జెన్సీ' ఫైనల్ రిజల్ట్ ఏమిటి?
కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' చిత్రం విడుదలై వివాదాస్పదంగా మారింది. సిక్కు సంఘాల నిరసనలు, బ్యాన్ డిమాండ్ల మధ్య, చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది.

కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ (Emergency)’. అనేక వివాదాల అనంతరం ఎట్టకేలకు జనవరి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై కంగనా చాలా ఆశలు పెట్టుకుంది. అయితే రిజల్ట్ మాత్రం సానుకూలంగా లేదు. మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ ని తెచ్చకుంది.
అయితే ఈ సినిమా విడుదలతో మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎమర్జెన్సీపై వివిధ వర్గాలు తమ అభిప్రాయాలను గట్టిగా వ్యక్తం చేస్తుండటంతో, కంగనా ఈ చిత్రంతో కొత్త చరిత్ర సృష్టించడమే కాకుండా అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు.సినిమా ప్రకటించినప్పటి నుంచే “ఎమర్జెన్సీ” అనేక వివాదాలకు కేరాఫ్‌గా మారింది. కంగనా ఈ సినిమాను తెరకెక్కించే క్రమంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు.
సినిమా పూర్తయిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. అదే టైమ్ లో కంగన చేసిన కొన్ని కాంట్రవర్శియల్ కామెంట్స్ వల్ల సెన్సార్ బోర్డ్ నుంచి అప్రూవల్ రాలేదు. ఈ విషయంపై బిజెపి ప్రభుత్వంపైనా విమర్శలు చేసింది కంగనా. తనే నిర్మాత కూడా కావడంతో ఇప్పటికే అనేక అప్పుల భారం మోస్తున్నానని కూడా గతంలో చెప్పింది. అప్పులు తీర్చడం కోసం తన ఇల్లు కూడా అమ్ముకున్నా అనీ చెప్పింది. ఫైనల్ గా అన్ని అడ్డంకులు దాటుకుని గత శుక్రవారం విడుదలైందీ మూవీ.
సినిమా విడుదల తర్వాత పంజాబ్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పలు సిక్కు సంఘాలు థియేటర్ల ముందు నిరసనకు దిగాయి. అమృత్‌సర్‌లోని థియేటర్ల వద్ద ఎస్జీపీసీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సిక్కు సంఘాల నేతలు ఈ చిత్రంపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. థియేటర్ల వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పంజాబ్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది.సిక్కు సంఘాల నేతలు కంగనాపై విమర్శలు గుప్పించారు.
ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇలాంటి వివాదాస్పద చిత్రాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.ఇందిరా గాంధీ జీవితకథను కమర్షియల్ హంగుల కోసం వక్రీకరించారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పంజాబ్‌లో నిరసనలు కొనసాగుతున్నప్పటికీ, మిగతా రాష్ట్రాల్లో సినిమా విడుదల పట్ల ఎటువంటి సమస్యలు లేవు. పంజాబ్‌లో మాత్రం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళనగా మారింది.
Kangana Ranaut bollywood film Emergency
ఇవన్నీ ఎలా ఉన్నా ఈ చిత్రం కమర్షియల్ గా అనుకున్నంత గొప్పగా పర్ఫార్మ్ చేయటంలేదు. అయితే మౌత్ టాక్ వల్ల ఆది వారం రోజు 4 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక సినిమా పికప్ అవుతుందనుకున్న టైమ్ లో సోమవారం పూర్తిగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కేవలం 1 కోటి 4లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో నాలుగు రోజులకు కలిపి కేవలం 11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా కోసం కంగనా 60కోట్ల వరకూ బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్ కు ఈ కలెక్షన్స్ కు ఉన్న తేడా చూస్తే.. కంగనా ఖాతాలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ పడినట్టైంది.
కంగనతో పాటు ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా ఛౌదరి, మిలింద్ సోమన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఏమాటకామాటే.. ఇందిరగా కంగనా ఎప్పట్లానే అద్భతమైన నటన చూపించింది. ఇందిరను గుర్తుకు తేవడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు.
అలాగే ”ఎమర్జెన్సీ” కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, భారత రాజకీయ చరిత్రలో మరో కోణాన్ని చూపించే ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నం కంగనాకు ప్రశంసలతో పాటు విమర్శలను కూడా తీసుకువచ్చింది. ఈ చిత్రం చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో చర్చలకు కేంద్రంగా నిలిచేలా ఉన్నాయి.