- Home
- Entertainment
- Kangana Ranaut Photos : ‘లాక్ అప్’ రియాలిటీ షోతో కంగనా రనౌత్ హవా.. ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ లుక్స్
Kangana Ranaut Photos : ‘లాక్ అప్’ రియాలిటీ షోతో కంగనా రనౌత్ హవా.. ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ లుక్స్
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘లాక్ అప్’ నిన్న ప్రారంభమైంది. ఈ షో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆసక్తికరంగా లాక్ అప్ షోను రన్ చేస్తోంది కంగనా..

సోలో హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతుంది కంగనా రనౌత్(Kangana Ranauth).. ఇక డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోనూ తన సత్తా చూపించేందుకు సిద్ధమైంది. కంగనా హోస్ట్ గా ఓ సరికొత్త రియాలిటీ షో ప్రసారం కానున్న విషయం తెలిసిందే.
‘లాక్ అప్’ (Lock Upp) పేరుతో స్ట్రీమ్ కానున్న ఈ షో ట్రైలర్ ఫిబ్రవరి 16న విడుదలైంది. ఈ లాక్ అప్ రియాలిటీ షో ట్రైలర్ ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో అడ్వెంచర్, మసాలా కంటెంట్ తో కూడిన లాక్ అప్ షో ప్రోమో అంచనాలు పెంచేసింది.
ఇక కంటెస్టెంట్స్ చేతులకు బేడీలతో.. జైలు గదుల్లో ఉన్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎవరైనా కానీ... అన్నపానీయాలు, స్నానాదికాలు అక్కడే. ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. ఈ షో బిగ్ బాస్ కి మించిన కాంట్రవర్సీ, ఫైట్, రొమాన్స్ తో కూడి ఉంటుందని. డిజిటల్ కంటెంట్ నేపథ్యంలో పరిమితులు కూడా చాలా తక్కువ ఉంటాయి.
నిర్మాత ఏక్తా కపూర్ తో చేతులు కలిపిన కంగనా లాక్ అప్ (Lock Upp) రియాలిటీ షోని హోస్ట్ గా నడుపుతున్నారు. ఈ షో పూర్తి కంటెస్టెంట్లతో ఫిబ్రవరి 27న ప్రారంభమైంది. లాక్ అప్ షో నిన్నటి నుంచే ఏ ఎల్ టి బాలాజీ, ఎం ఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ అవుతోంది.
ఈ లాక్ అప్ రియాలిటీ షో ఏఎల్టీ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ లో ప్రతి రోజు రాత్రి 10:30న ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నట్టు కంగనా తన ఇన్ స్టాలో పేర్కొంది. ఈ మేరకు ట్రెండీ వేర్ కంగనా లెటేస్ట్ ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ షో టైమింగ్స్ ను గుర్తు చేస్తోంది. ఇక ఈ షో 24/7 స్ట్రీమ్ కానుండటం మరింత ఆసక్తిగా ఉంది.
ఇక కంగనా ప్రస్తుతం ‘ధాకడ్’ పేరుతో తెరకెక్కుతున్న ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. అలాగే ‘తేజాస్’ అనే మరో మూవీలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. మరోవైపు నిర్మాతగా కూడా మారిన కంగనా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖ్ ప్రధాన పాత్రలో ‘టికు వెడ్స్ షేరు’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలనే పూర్తయ్యి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.