- Home
- Entertainment
- Brahmamudi: కావ్యను అనుమానిస్తున్న కనకం దంపతులు.. అందరిముందు కోడలి నిర్వాకం బయటపెట్టిన చిట్టి!
Brahmamudi: కావ్యను అనుమానిస్తున్న కనకం దంపతులు.. అందరిముందు కోడలి నిర్వాకం బయటపెట్టిన చిట్టి!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అత్తింట్లో సమస్యలని తెలివిగా పరిష్కరించుకుంటున్న ఒక కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో బిర్యానీ తింటున్న స్వప్నని చూసి ఆశ్చర్య పోతుంది ధాన్యలక్ష్మి. ఏమైంది నీకు ఇంతలా ఎందుకు తింటున్నావు? ఎప్పుడూ డైటింగ్ అంటూ సలాడ్లు తింటావు కదా అంటుంది. ఆకలేస్తుంది ఆపుకోలేకపోయాను అందుకే తింటున్నాను అంటుంది స్వప్న. అందుకే డైటింగ్ ల పేరుతో కడుపు మాడ్చుకోవడం ఎందుకు.. కావ్యని అడిగితే కమ్మగా వండి పెడుతుంది కదా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఇక్కడ కూడా కావ్య గోలేనా అంటూ చికాకు పడిపోతుంది స్వప్న.
అయినా ఇప్పుడు అదంతా అనవసరం, నాకు పొట్ట పెంచుకోవటం ముఖ్యం అని చెప్పి బిర్యానీ గుట్ట మొత్తం తినేస్తుంది స్వప్న. మరోవైపు కూతురు కోసం ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణమూర్తి. అప్పుడే అక్కడికి వచ్చిన కనకం తో కావ్య మనకి నిజం చెప్పడం లేదేమో అనిపిస్తుంది. వాళ్ళ పరువుని సైతం పక్కన పెట్టి ఆ పెద్దాయన ఎందుకు కావ్యని మన ఇంటికి పంపిస్తారు అని కూతురు మీద అనుమాన పడతాడు కృష్ణమూర్తి. నువ్వు అంటుంటే నాకు కూడా అనుమానంగా ఉంది అని చెప్పి కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది కనకం.
నిన్న అంత గొడవ జరిగింది కదా ఇంట్లో కావ్య ఏమైనా ఇబ్బంది పడుతుందా అని అడుగుతుంది కనకం. అలాంటిదేమీ లేదు ఆ సంగతి మా వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. అయినా అలాంటిదే ఏమైనా జరిగితే చూసుకోవటానికి నేనున్నాను కదా అని ధైర్యం చెప్తాడు కళ్యాణ్. ఆ మాటలకి సంతోషిస్తారు కృష్ణమూర్తి దంపతులు. కూతురిని అనుమానించినందుకు పశ్చాత్తాప పడతారు. మరోవైపు భర్త బాత్రూంలో ఉండడం గమనించిన కావ్య రాజ్ వేసిన డిజైన్స్ చూడాలనుకుంటుంది.
కానీ ఆ డిజైన్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి చూసేలోపు రాజ్ బాత్రూం నుంచి బయటికి వచ్చి ఆమె దగ్గర ఆ పేపర్స్ లాక్కుంటాడు. మీ కళాత్మకతని నన్ను కూడా చూడనివ్వండి అంటుంది కావ్య. ఆమెతో మాట్లాడకుండా ఆమెని చేయి పట్టుకొని రూమ్ బయట పెట్టి తలుపు వేసేస్తాడు రాజ్. ఓ.. బట్టలు మార్చుకున్నాక తలుపు తీస్తారా కళాపతి అంటూ భర్తని ఆటపట్టిస్తుంది కావ్య. మరోవైపు పొద్దున్నే వాంతులు చేసుకుంటూ ఉంటుంది స్వప్న.
అనవసరంగా బిర్యానీ తిన్నాను, కడుపు పెద్దదవడం పక్కన పడితే ఈ వాంతులు చేసుకోలేక చచ్చిపోతున్నాను అని చికాకు పడిపోతుంది స్వప్న. స్వప్న వాంతులు చేసుకోవటం చూసి ఆమెని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళమని రుద్రాణికి చెప్తుంది చిట్టి. కొడుకుతో కోడల్ని పంపించేసి చేతులు దులుపుకోకు నువ్వు కూడా వెళ్ళు అని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తుంది. అనవసరంగా ఇరుక్కున్నాను అనుకుంటుంది స్వప్న. త్వరగా రెడీ అవ్వు హాస్పిటల్ కి వెళ్దాం అని రాహుల్ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న.
తను వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ హాస్పిటల్ కి తీసుకువెళ్లి స్వప్నకి అబార్షన్ చేయించేద్దామా అంటాడు రాహుల్. అలా చేస్తే కావ్య పసికట్టేసి అందరి ముందు బయట పెట్టేస్తుంది. అందుకే మంచి టైం కోసం వెయిట్ చేద్దాం అని రుద్రాణి చెప్పటంతో ఊరుకుంటాడు రాహుల్. మరోవైపు కిందకు వచ్చిన కొడుకుతో రెడీ అవ్వు ఆఫీస్ కి వెళ్దాం అంటాడు సుభాష్. సరే అని తన గదికి వెళ్లేసరికి అక్కడ తన బట్టలు కనబడవు. అప్పుడే తన బట్టలు ఐరన్ చేస్తున్న కావ్యని చూసి నా బట్టలు ఐరన్ చేయమని ఎవరు చెప్పారని కోపంగా అడుగుతాడు రాజ్.
నాకు ఒకరు చెప్పాలా కళాపతి అంటుంది కావ్య. నన్ను అలా పిలవకు అని రాజ్ అనటంతో మళ్లీ వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది. నాతో నీకు వాదన ఏంటి నేను నీ భర్తని అంటాడు రాజ్. ఆ మాటలకి ఆనందపడిపోతుంది కావ్య. ఈరోజు శ్రావణ శుక్రవారం పూట నా భర్త అని ఒప్పుకున్నారు అలాగే మౌనవ్రతం వీడి నాతో మాట్లాడారు అని చెప్పి ఆనందంగా కిందికి వస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళని కూడా నాతో మాట్లాడేలాగా చేయాలి అనుకొని ధాన్యలక్ష్మి ని కాకా పడుతుంది.
మీరు నాకు సపోర్ట్ చేయండి చిన్న అత్తయ్య. ఇంట్లో వాళ్ళందరినీ నాతో మాట్లాడేలాగా చేస్తాను అంటుంది. అందుకు ఒప్పుకుంటుంది ధాన్యలక్ష్మి. మీ వేలు కట్ అయింది అని చెప్పి కట్టు కట్టుకోండి అని చెప్పడంతో ధాన్య లక్ష్మీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వంట చేస్తున్న కావ్య ని చూసి ధాన్యలక్ష్మి మీద కేకలు వేస్తుంది అపర్ణ.
వంట నిన్ను చేయమని చెప్పాను కదా అంటే కట్ అయిన వేలుని చూపిస్తుంది ధాన్యలక్ష్మి. అంతా నా కర్మ అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషిస్తారు ధాన్యలక్ష్మి, కావ్య. తరువాయి భాగంలో డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి గంట కొడుతుంది కావ్య. ఒక్కొక్క పదార్థం దగ్గర పేరు రాసి పెడుతుంది. అలా రాయటం ఎందుకు నోటితో చెప్పొచ్చు కదా మౌనవ్రతమా అంటాడు సుభాష్. కాదు అత్త వ్రతం అని చెప్పి అపర్ణ పెట్టిన కండిషన్ గురించి చెప్తుంది చిట్టి.