- Home
- Entertainment
- Brahmamudi: కావ్య చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న తల్లిదండ్రులు.. హై డ్రామా క్రియేట్ చేసిన రుద్రాణి?
Brahmamudi: కావ్య చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న తల్లిదండ్రులు.. హై డ్రామా క్రియేట్ చేసిన రుద్రాణి?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకొని టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. మోడలింగ్ మీద మోజుతో తెలియకుండానే ఊబిలో కాలు పెడుతున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో భర్తని తనతో పాటు ఇంట్లోకి రమ్మంటుంది కావ్య. ఆఫీస్ లో మీటింగ్ ఉంది కుదరదు అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. డ్రాప్ చేసినందుకు భర్తకి థాంక్స్ చెప్తుంది కావ్య. మరోవైపు దిగులుగా కూర్చున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఏమీ తెలియని దానిలాగా ఏం జరిగింది? ఎందుకలా కూర్చున్నావు నిన్ను ఎవరు బాధపెట్టారు అని అడుగుతుంది రుద్రాణి.
ఇంకెవరు నీ కోడలే.. నన్ను అనురాని మాటలన్నీ అన్నది అని చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది ధాన్యలక్ష్మి. దానికి ఎంత ధైర్యం నిన్నే అంత మాట అంటుంది ఇప్పుడే దాని సంగతి చెప్తాను అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మీరందరూ తీసుకువచ్చి నా నెత్తిమీద అంటగట్టారు కదా అది ఈరోజు చూడండి ఎంత పని చేసిందో మన ధాన్యలక్ష్మి అనరాని మాటలు అని బాధ పెట్టిందంట అని డ్రామా క్రియేట్ చేసి ఓవరాక్షన్ చేస్తుంది రుద్రాణి. తను ఎందుకు అలా ఉంది నువ్వు ఏమన్నావు అని చిట్టి ధాన్యలక్ష్మిని అడుగుతుంది.
మంచి బట్టలు వేసుకో అన్నందుకు నన్ను నానా మాటలు అన్నది అని కన్నీరు పెట్టుకుంటుంది ధాన్యలక్ష్మి. తనకి ఎంత ధైర్యం ధాన్యలక్ష్మి అలా అంటుందా? ఇంటికి రాని దాని పని చెప్తాను అంటుంది రుద్రాణి. అది సరే కానీ ఎప్పుడూ లేనిది నువ్వు ఎందుకు ధాన్యలక్ష్మి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు అని అనుమానంగా అడుగుతుంది అపర్ణ. పెద్దత్తయ్య కి మన మీద అనుమానం వచ్చినట్లుగా ఉంది అంటాడు రాహుల్. స్వప్న ఇంటికి రానీ నేను చేసే డ్రామా కి అందరి అనుమానాలు పటా పంచలు అయిపోతాయి అంటుంది రుద్రాణి.
మరోవైపు అన్నపూర్ణ ట్రీట్మెంట్ కోసం తన చెవి దిద్దులు తీసి ఇచ్చి భర్తని అమ్మి డబ్బు తీసుకు రమ్మంటుంది కనకం. అవి తీసుకొని బయటికి వెళ్లబోతాడు కృష్ణమూర్తి ఇంతలో కావ్య రావడం చూసి ఆనందపడతారు. కూతుర్ని కుశల ప్రశ్నలు వేస్తారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను నా ఆనందాన్ని మీతో పంచుకోవటానికి వచ్చాను. నేను డబ్బులు సంపాదిస్తున్నాను ఆ డబ్బులు మీకు ఇచ్చి పోదామని వచ్చాను తండ్రి చేతిలో డబ్బులు పెట్టబోతోంది కావ్య.
వద్దమ్మా ఈ సంగతి మీ ఇంట్లో తెలిస్తే అందరూ నిన్ను ఆడిపోసుకుంటారు అయినా అది సభ్యత కూడా కాదు అంటాడు కృష్ణమూర్తి. నా సంపాదన కోసం అక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు అయినా నా భర్తకి విషయం చెప్పబోతే నీ సంపాదన నీ ఇష్టం అని చెప్పాడు అని చెప్పి తల్లిదండ్రులని ఒప్పించి ఆ డబ్బు తల్లి చేతిలో పెడుతుంది కావ్య. కావ్య చేసిన పనికి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటారు కనకం దంపతులు.
అన్నపూర్ణ కి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పి గదిలోనే కూర్చుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అని చెప్పి ఆమెని బయటికి తీసుకొచ్చి అందరిలోని కూర్చోబెడుతుంది. కావ్య డబ్బు తీసుకొచ్చింది రేపు నీకు ట్రీట్మెంట్ చేస్తాను అని వదినతో చెప్తాడు కృష్ణమూర్తి. ఎమోషనల్ అవుతుంది అన్నపూర్ణ. మరోవైపు మోడలింగ్ స్టూడియోకి వెళ్లిన స్వప్నకి అక్కడ అందరూ బ్రహ్మరథం పడతారు.
ఈ యాడ్ కొంచెం స్పైసీగా తీయబోతున్నాను మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా అంటాడు డైరెక్టర్. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను మీ చేతిలో పడిన ప్రతి మోడలు ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది నా నేను కూడా అలాగే వెళ్ళాలి అంటుంది స్వప్న. సరే మీరు రెడీ అవ్వండి అని స్వప్నకి చెప్పి బయటికి వచ్చి షూటింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు డైరెక్టర్. ఇంతలో రాహుల్ ఫోన్ చేసి నేను చెప్పింది గుర్తుంది కదా తన యాడ్ చూసి పెద్దవాళ్ళు మొహాలు తిప్పుకునే లాగా ఉండాలి అని చెప్తాడు.
నువ్వు అనుకునే దాని కన్నా ఈ యాడ్ చాలా బోల్డ్ గా వస్తుంది నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు డైరెక్టర్. సీన్ కట్ చేస్తే కావ్య ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటారు. కనకం భోజనాలు వడ్డించబోతుంటే వద్దమ్మా నువ్వు ఎప్పుడు అందరికీ ఒకే పళ్లెంలో భోజనం కలిపి గోరుముద్దలు తినిపిస్తావు కదా ఇప్పుడు కూడా అలాగే తినిపించు అని కావ్య అనటంతో కనకం అలాగే చేస్తుంది.
తరువాయి భాగంలో మీ ఇద్దరి మధ్య తొలిప్రేమ కొడుతుందా అసలు ఏం జరుగుతుందో అని కొడుకుని అడుగుతుంది అపర్ణ. అలాంటిదేమీ లేదు తాటి మనిషిగా తనకు సాయం చేస్తున్నాను అంతేగాని తనని ఎప్పటికీ భారీగా స్వీకరించలేను అంటాడు రాజ్. ఆ మాటలు విన్న కావ్య కన్నీరు పెట్టుకుంటుంది.