Brahmamudi: అందరి ముందు తలదించుకున్న రాజ్.. నిజం చెప్పి అన్నని ఇరికించిన కళ్యాణ్!
Brahmamudi : స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. తల్లి చేసిన తొందరపాటు పనికి అత్తింట్లో శిక్ష అనుభవిస్తున్న ఒక కూతురి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తప్పంతా నీదే, నువ్వే అంత ఈజీగా వాళ్ళ దగ్గర మోసపోయావు అంటాడు రాహుల్. నువ్వు అన్నది నిజమే పెళ్లి వద్దంటూనే మహిళా సంఘాలని నామీదకి పంపించింది కళావతి అంటాడు రాజ్. అప్పుడు భరించవలసిన అవసరం ఏముంది నీ కోపాన్ని నీ మీద నీ బెడ్ మీద కాకుండా నిన్ను ఇంత మోసం చేసిన కళావతి మీద చూపించు అంటూ డ్రింక్ ఇస్తాడు రాహుల్. ఇదేంట్రా కొత్తగా అంటాడు రాజ్. నీ ఆవేశం రెట్టింపు అవుతుంది తాగు అంటూ బలవంతంగా తాగిస్తాడు రాహుల్. వాళ్ళు నిన్ను మోసం చేశారు ఒక పెద్ద ఫూల్ ని చేశారు అంటూ రెచ్చగొడతాడు.
జరిగిందంతా చూస్తుంటే స్వప్న వెళ్ళిపోవటం కాదు కావ్య నే స్వప్న వెళ్ళిపోయేలాగా చేసి ఉంటుంది అంటూ రెచ్చగొడతాడు రాహుల్. రెచ్చిపోయిన రాజ్ విపరీతంగా తాగుతాడు. నన్నే మోసం చేస్తుందా ఈరోజు నా చేతిలో అయిపోయింది అనుకుంటూ కావ్య రూమ్ వైపు వెళ్తాడు రాజ్. మధ్యలో కళ్యాణ్ కనిపించడంతో ఇదంతా ఏంటి నువ్వు తాగడం ఎప్పటినుంచి మొదలుపెట్టావు అంటాడు. నాకు పెళ్లయింది అందుకే తాగాను.దీనంతటికి కారణం కళావతి అంటాడు రాజ్. నా జీవితంలో నిప్పులు పోసింది అంటూ చిందులు వేస్తాడు రాజ్.
పాపం వదిన చిన్న పిల్ల ఇప్పుడు తనని ఏమీ అనకు అంటాడు కళ్యాణ్. ఆ మాటలకి పగలబడి నవ్వుతాడు రాజ్. ఆ ఫ్యామిలీ ఆర్డినరీ ఫ్యామిలీ కాదు ప్రపంచాన్నే అమ్మేస్తారు అంటూ కళ్యాణ్ ఎంత చెప్తున్నా వినకుండా కళ్యాణ్ రూమ్ వైపు వెళ్తాడు రాజ్. అన్నయ్య కావ్యని భార్యగా యాక్సెప్ట్ చేశాడా అందుకే ఆ రూమ్ లోకి వెళ్తున్నాడా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. రూమ్ కి వెళ్లి డోర్ ఓపెన్ చేయమంటూ గొడవ చేస్తాడు. బయట గొళ్ళెం పెట్టి ఉండడాన్ని గమనించి బయట గడియ పెట్టుకుని లోపల దాక్కున్నావా నేను వదలను అంటూ డోర్ ని ఓపెన్ చేస్తాడు.
ఎందుకు వచ్చారు అంటూ కోపంగా అడుగుతుంది కావ్య. నువ్వు నా జీవితంలో నిప్పులు పోసావు కదా అందుకే నేను నీ జీవితంలో నిప్పులు పోస్తాను అంటాడు రాజ్. మర్యాదగా వెళ్లండి అంటుంది కావ్య. అరుస్తావేంటి ఇది నా ఇల్లు వెళ్తే నువ్వే వెళ్ళాలి అంటాడు రాజ్. అయితే లెగండి నేనే వెళ్తాను కావ్య. ఎక్కడికి వెళ్ళేది తప్పించుకుందాం అనుకుంటున్నావా అంటూ లోపలికి వచ్చి గడియ పెట్టేస్తాడు రాజ్. ఏం చేస్తున్నారు అంటూ కంగారుపడుతుంది కావ్య. దయచేసి వెళ్ళిపోండి మీ అమ్మగారు చూస్తే గొడవలు అయిపోతాయి అంటుంది.
మా అమ్మ పేరు ఎత్తే అర్హత లేదు నీకు. నీ వల్ల తను చాలా బాధపడింది అందుకే నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను అంటూ మాట్లాడుతూనే మత్తులోకి వెళ్ళిపోతాడు రాజ్. అతన్ని మెల్లగా పడుకోబెట్టి మనం ఎంత వద్దనుకుంటున్నా ఇలా దగ్గర ఇవ్వటం నాకు ఏమీ నచ్చలేదు అనుకుంటుంది కావ్య. మత్తులో ఉన్నా కూడా నిన్ను క్షమించను నీ మోసాన్ని బయటపడతాను అనుకుంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు రాజ్. మరోవైపు వీళ్ళ కాపురం ఎప్పుడు కుదుటపడుతుందో అని భర్త తో అంటుంది చిట్టి. ఇంకేంటి ప్రాబ్లం ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది కదా అంటుంది రుద్రాణి. లేదు మనసు ఒప్పుకోలేదన్నాడు అంటుంది చిట్టి.
ఏంటో ఈ కాలం పిల్లలు శోభనం గురించిన అభిప్రాయాలు బయటకి చెప్పేస్తున్నారు. అమ్మాయిని బలవంతంగా గదిలోకి పంపిస్తే ఎక్కడ అవమానిస్తాడో అని మేము కూడా పంపించలేదు అంటాడు సీతారామయ్య. అక్కడికి వచ్చిన అపర్ణతో శోభనం జరగలేదంట అని చెప్తుంది రుద్రాణి. పెళ్లి వాడిష్ట ప్రకారం జరిగితే వాడు మాత్రం ఎందుకు కాదంటాడు అంటుంది అపర్ణ. మరోవైపు మెలకువ వచ్చి చూసిన రాజ్ నేను కళావతి రూమ్లో ఉండటం ఏంటి ఆ కళావతి గాని నన్ను ఎత్తుకు వచ్చిందా అంటూ కన్ఫ్యూజ్ అవుతాడు. రాత్రి బాగా తాగేసాను తర్వాత ఏం జరిగింది అంటూ ఆలోచనలో పడతాడు.
చెప్పులు తీసుకొని గది బయటికి వస్తున్న రాజ్ ని చూసి కుటుంబ సభ్యులందరూ చూసి షాక్ అవుతారు. రాజ్ కూడా అందర్నీ చూసి తల ఒంచుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అపర్ణ ఆపి తలదించుకునే పని ఏమైనా చేసావా అని అడుగుతుంది. నో, నో అంటూ కంగారుగా చెప్తాడు రాజ్. ఈ శ్రీకృష్ణ లీలలు ఏమిటి అని మనవడిని కొంటెగా అడుగుతుంది చిట్టి.నీ గదిని అంత అందంగా అలంకరిస్తే శోభనమే వద్దు అన్నవాడివి తెల్లారేసరికి ఈ గది నుంచి బయటకు వస్తున్నావేంటి, నీకు ఇదేం కర్మ పెట్టింది దివ్యమైన గది ఉండగా అంటుంది చిట్టి.
వీళ్ళందరూ శోభనం అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి అని కంగారు పడతాడు రాజ్.నీకు ఆ అమ్మాయి మీద అంత మనసు ఉంటే నీకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరున్నారు.చక్కగా అలంకరించిన నీ గది ఉండగా ఈ స్టోర్ రూమ్ లో అంటూ సీతారామయ్య ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా తాతయ్య మీరు అనుకుంటున్నట్లు అక్కడ ఏమి జరగలేదు అంటాడు రాజ్. తరువాయి భాగంలో అసలు ఈ కళావతి గదిలోకి నేను ఎప్పుడు వెళ్లానో,ఎందుకు వెళ్లానో నాకే తెలియదు అంటాడు రాజ్.నాకు తెలుసు అన్నయ్య రాత్రి బాగా తాగేసి వదిన గారికి వెళ్ళాడు అదేంటి అంటే నా పెళ్ళాం నా ఇష్టం అన్నాడు అంటూ నిజాన్ని చెప్పాడు కళ్యాణ్.