MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `మెగాస్టార్` గా కళ్యాణ్‌ రామ్‌.. మొదలైన మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్.. `బింబిసార` దెబ్బకి మైండ్ బ్లాక్

`మెగాస్టార్` గా కళ్యాణ్‌ రామ్‌.. మొదలైన మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్.. `బింబిసార` దెబ్బకి మైండ్ బ్లాక్

నందమూరి, మెగా అభిమానుల మధ్య మరోసారి వార్‌ స్టార్ట్ అయ్యింది. `బింబిసార` కారణంగా ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్‌గా నందమూరి ఫ్యాన్స్ రచ్చ లేపుతున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 05 2022, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి కళ్యాణ్‌ రామ్‌(Kalyan ram) హీరోగా నటించిన `బింబిసార`(Bimbisara) చిత్రం శుక్రవారం(ఆగస్ట్ 5న) విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటుంది. సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత హిట్‌ కొట్టాడు కళ్యాణ్‌ రామ్‌. `బింబిసార` హిట్‌ టాక్‌ వస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్(Nandamuri Fans) సంబరాల్లో మునిగితేలుతున్నారు. చిత్ర బృందం కూడా ఆనందాల్లో మునిగి తేలుతుంది. 
 

26

ఇదిలా ఉంటే నందమూరి ఫ్యాన్స్ ఈ సందర్భంగా రెచ్చిపోతున్నారు. హిట్‌ వచ్చిన ఆనందంలో ఇతర హీరోలను టార్గెట్‌ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అంతేకాదు తమ హీరోని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఏకంగా కళ్యాణ్‌ రామ్‌కి `మెగాస్టార్‌` అనే ట్యాగ్‌ని ఇస్తుండటం విశేషం. `మెగాస్టార్‌కళ్యాణ్‌రామ్‌` (#MegastarKalyanRam) అనే యాష్‌ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. చిరంజీవి(Chiranjeevi) కంటే కళ్యాణ్‌ రామ్‌ బెటర్‌ అంటూ మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తున్నారు అభిమానులు. 

36

చిరంజీవి రీమేక్‌ల హీరో అని, ఆయనకు రీమేక్‌లతో విజయాలు వచ్చి మెగా స్టార్‌ అయ్యారని పోస్ట్‌ లు పెడుతూ వైరల్‌ చేస్తున్నారు. అదే సమయంలో నందమూరి హీరోలు రీమేక్‌లకు దూరమని చెబుతున్నారు. అందుకు నిదర్శనమే `బింబిసార` అంటున్నారు. ఇంకోవైపు `ఆచార్య`(Acharya)కి, `బింబిసార`ని పోలుస్తూ, `ఆచార్య` బెనిఫిట్‌ షోస్‌లు చాలా చోట్ల ఫుల్‌ కాలేదని, కానీ `బింబిసార` ప్రదర్శించిన అన్ని చోట్ల హౌజ్‌ ఫుల్‌ అంటున్నారు. 

46

మరోవైపు నందమూరి హీరోలు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లు కొడుతున్నారట. బాలయ్య(Balakrishna) `అఖండ`తో, ఎన్టీఆర్‌(NTR) `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR)తో, కళ్యాణ్‌ రామ్‌ `బింబిసార`తో వరుస బ్లాక్‌ బస్టర్ హిట్స్ కొట్టారని సంబరాలు చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. 

56

అదే సమయంలో మెగా హీరోలు వరుస ఫ్లాప్‌ సినిమాలు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అందుకు `ఆచార్య` చిత్రాన్ని ప్రధానంగా చూపిస్తున్నారు. పవన్‌, చిరు, రామ్‌చరణ్‌లు ఒకటే బ్యాచ్‌ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. బింబిసార రీమేక్‌ రైట్స్ కోసం చిరంజీవి కళ్యాణ్‌ రామ్‌ని అప్రోచ్‌ అవుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 

66

మరోవైపు ఎంతో సహనంతో ఉంటున్న మెగా ఫ్యాన్స్ సైతం దీటుగా బదులిస్తున్నారు. ఒక్క హిట్‌తోనే మెగాస్టారా?. ఇలాంటివి ఇంకెన్ని కావాలి? అని కామెంట్లు చేస్తున్నారు. ఏడేళ్లకి హిట్‌ వస్తే ఇంత రచ్చా అంటూ నందమూరి ఫ్యాన్స్ కి ఎదురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్‌ పీక్‌కి చేరిందని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Movie: 'రామాయణ'కి 700 కోట్ల OTT ఆఫర్.. మేకర్స్ ఎందుకు వద్దన్నారో తెలుసా?
Recommended image2
Sapthami Gowda: ఇకపై ఇలాంటి పనులు చేసేవారికి చుక్కలే.. కాంతార హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image3
గుడ్‌ న్యూస్‌ చెప్పిన రష్మిక, విజయ్‌.. పెళ్లైన నెలకే ముగ్గురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved