MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Bimbisara Review: బింబిసార మూవీ ప్రీమియర్ టాక్... కళ్యాణ్ రామ్ కి హిట్టు పడ్డట్లే!

Bimbisara Review: బింబిసార మూవీ ప్రీమియర్ టాక్... కళ్యాణ్ రామ్ కి హిట్టు పడ్డట్లే!

ఓ సాలిడ్ కమ్ బ్యాక్ కోసం కళ్యాణ్ రామ్ చాలా కాలంగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో తన మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ తో ఫాంటసీ నేపథ్యంలో బింబిసార చిత్రం చేశారు. క్యాథెరిన్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన బింబిసార ప్రీమియర్ టాక్ ఎలా ఉందో చూద్దాం...

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 05 2022, 08:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రెండు భిన్న కాలాలకు  సంబంధించిన కథగా బింబిసార తెరకెక్కింది. అగర్తల రాజ్యాధిపతి అయిన బింబిసారుడు వీరోచిత గాథను నేటి బ్యాక్ డ్రాప్ తో ముడిపెట్టి తెరకెక్కించారు. అలనాటి బింబిసారుడుకి ఈనాటి పరిస్థితులతో, వ్యక్తులతో సంబంధం ఏమిటీ? అతడు ఈ కాలానికి మరలా ఎందుకు వచ్చాడు.? ఆయన నేపథ్యం ఏమిటీ?  అనేదే బింబిసార కథగా చెప్పుకోవచ్చు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కళ్యాణ్ రామ్(Kalyan Ram) హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2015లో విడుదలైన పటాస్ మూవీ తర్వాత క్లీన్ హిట్ పడలేదు. హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలాప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొత్త దర్శకుడు వశిష్ట్ కి కళ్యాణ్ రామ్ అవకాశం ఇచ్చాడు. కథపై నమ్మకం ఉంచి సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. 
 

37

బింబిసార ప్రీమియర్స్ (Bimbisara Review)ప్రదర్శన యూఎస్ లో ముగియగా టాక్ బయటికి వచ్చింది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమా పట్ల పాజిటివ్ గా స్పందించడం విశేషం. దర్శకుడు వశిష్ట్ కథను ఎంగేజింగ్ గా నడపడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఓ బలమైన కథకు రాసుకున్న సన్నివేశాలు, పాత్రలు, కథనం బాగుంది అంటున్నారు. 

47

రెండు భిన్నమైన షేడ్స్ లో కళ్యాణ్ రామ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. బింబిసారుడిగా, ఈ తరం మోడరన్ గెటప్ లో కళ్యాణ్ రామ్ వేరియేషన్స్ తో ఆకట్టుకున్నారనేది ప్రేక్షకుల అభిప్రాయం. గతంలో ఎన్నడూ చేయని పాత్రలో కళ్యాణ్ రామ్ సరికొత్తగా వెండితెరపై కనిపించాడట. 
 

57

కీరవాణి సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బీజీఎమ్ చాలా బాగుందన్న మాట వినిపిస్తుంది. సీనియర్ సంగీత దర్శకుడిగా బింబిసారను అద్భుతంగా తీర్చిదిద్దంలో ఆయన తనవంతు కృషి చేశారు అంటున్నారు. నిర్మాణంలో కాంప్రమైజ్ కాకుండా కళ్యాణ్ రామ్ నిర్మించాడని, తెరపై ఆ గ్రాండియర్ కనిపిస్తుంది అంటున్నారు. 
 

67


మరి ఇలాంటి పీరియాడిక్ యాక్షన్ చిత్రాలకు విఎఫ్ఎక్స్ చాలా ముఖ్యం. ఈ విషయంలో మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొందరు పర్లేదు అంటుంటే, మరొకొందరు ఏమాత్రం ఆకట్టుకోలేదు అంటున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వర్క్ పట్ల ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 

77

ఇక నేడు విడుదలైన రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం పట్ల కూడా ప్రేక్షకులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరి బింబిసార, సీతారామం కమర్షియల్ గా ఏమాత్రం విజయం అందుకుంటాయి అనేది వీకెండ్ ముగిస్తే కానీ తెలియదు. ప్రస్తుతానికి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved