Brahmamudi: అవమాన భారంతో అప్పు.. నిజం తెలిసి షాకైన రాహుల్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ టాప్ టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కోడలి బండారం బయటపెట్టాలని చూస్తున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 30 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నేను నీకు చెప్పాను కానీ నువ్వే చెప్పలేదని అబద్ధాలు చెప్తున్నావు అంటూ కావ్య మీద కేకలు వేస్తుంది రుద్రాణి. చూసావా వదినా నీ కోడలు ఎలా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటుందో అంటూ ఆపర్ణకి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు రాజ్ రుద్రాణిని మందలిస్తాడు నువ్వు తనకి చెప్పావు లేదో నాకు తెలియదు కానీ కావ్యకి అబద్దం చెప్పే అలవాటు లేదు అందుకే తను ఎవరికి భయపడదు.
మళ్లీ తనని సపోర్ట్ చేశాను అని గొడవ పెట్టకండి, నేను నిజం చెప్తున్నాను అంతే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. చూసావా వదిన నీ కొడుకు నీ కోడల్ని ఎలా వెనకేసుకొస్తున్నాడో అని అపర్ణని రెచ్చగొడుతుంది రుద్రాణి. మధ్యలో నీకేంటి నొప్పి అని అడుగుతుంది అపర్ణ. నొప్పి నాకు కాదు నీకే, ఇలా ప్రతిసారి తనని వెనకేసుకుంటూ వస్తే ఎప్పుడో ఒకసారి నిండా ముంచేస్తుంది ఆ తర్వాత నీ ఇష్టం అని హెచ్చరిస్తుంది రుద్రాణి.
మరోవైపు చీర కట్టుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది స్వప్న. చీర కట్టుకోవడం ఓకే కానీ ఈ కడుపు మైంటైన్ చేయటమే కష్టంగా ఉంది అంతమంది మధ్యలో జారిపోతుందేమో అని భయంగా ఉంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో రుద్రాణి అక్కడికి వచ్చి ఇంకా రెడీ అవ్వలేదేంటి,అందరూ వచ్చేసే టైం అయింది నీకు ఈ రూమ్ చిన్నగా ఉంటుందని నా రూమ్ అరేంజ్ చేశాను. అక్కడ నిన్ను రెడీ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు అంటుంది.
మీరు బాగానే ఉన్నారు కదా, ఈరోజు ఏంటి నాతో ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అంటుంది స్వప్న. ఈరోజే తెలిసింది సీమంతం చేసుకున్న ఆడపిల్ల ఇంత ఆనందంగా ఉంటుందని, నా వారసుడిని కడుపులో మోస్తున్నావు అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అంటూ తన పొట్టపై చేయి వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ స్వప్న వెనక్కి తగ్గి చీర తీసుకొని రెడీ అయి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఇది పొట్ట మీద కూడా చేయవేనియడం లేదు అంటే నిజంగా దీని దొంగ ప్రెగ్నెన్సీయే కానీ ఎలా రుజువు చేయాలి అనుకుంటుంది రుద్రాణి. అప్పుడు గట్టిగా ఆలోచిస్తే మెడికల్ రిపోర్ట్స్ సంగతి గుర్తు వస్తాయి. మెడికల్ రిపోర్ట్స్ వెతికి వాటిని తను ఫ్రెండ్ డాక్టర్ శ్రీదేవికి పంపిస్తుంది. ఇంతలో బ్లౌజ్ మర్చిపోయిన స్వప్న మళ్లీ వెనక్కి వచ్చేసరికి అక్కడే ఉన్న అత్తగారిని చూసి అనుమాన పడుతుంది.
ఏమీ లేదు రాహుల్ బ్రేస్లెట్ తెమ్మన్నాడు అందుకే వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. మరోవైపు అప్పుని అబ్బాయి అనుకుని ఎవరో పిలుస్తారు. అందుకు కోపకించుకుంటుంది అప్పు. అబ్బాయిలా తయారైతే అందరూ అలాగే అంటారు అమ్మాయిలాగా తయారైతే ఎవరూ ఏమీ అనరు కదా అంటుంది ధాన్యలక్ష్మి. తనకి అలాంటివి సెట్ అవ్వవు అంటాడు కళ్యాణ్.
చీర కట్టుకున్న అనామికని తెగ పొగిడేసావు కదా ఇప్పుడు నేను కట్టుకుంటాను అని మనసులో అనుకొని ఆంటీ చెప్పినట్లు చీర కట్టుకుంటాను అంటుంది. అందరూ షాక్ అవుతారు. మరోవైపు రుద్రాణి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి నీకు స్వప్న రిపోర్ట్స్ పంపించాను అవి చూసి సప్న ప్రెగ్నెన్సీ రిజల్ట్ చెప్పు అంటుంది. కొంచెం టైం పడుతుంది అని చెప్తుంది డాక్టర్. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసిన రుద్రాణి ఈ సీమంతం ఎలా అయినా జరగనివ్వకూడదు అనుకుంటుంది.
మరోవైపు ధాన్యలక్ష్మి చీర ఇస్తే ఆ చీర కట్టుకొని కిందికి వస్తుంది అప్పు. తనని చూసి అందరూ ఆట పట్టిస్తారు. అబ్బాయిల నుంచి నన్ను, మా అక్క ని కాపాడటం కోసం తను మగ పిల్లాడిలాగా పెరిగింది అంటూ చెల్లెల్ని వెనకేసుకొస్తుంది కావ్య. అయినా అప్పు ని ఆట పట్టిస్తాడు కళ్యాణ్. కవి గారు మీకు కామెడీ ఎక్కువైపోతుంది అంటూ కవి గారిని పట్టుకోండి అని భర్తకి చెప్తుంది కావ్య. వాళ్ల నుండి తప్పించుకోవటం కోసం పరిగెడతాడు కళ్యాణ్. అప్పుడే అనామిక వస్తుంది.
చాలా బాగా రెడీ అయ్యావు అని అనామిక కి చెప్పి,అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని అప్పు కి చెప్తాడు కళ్యాణ్. అప్పు అవమానంతో బాధపడుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రెడీ అవుతున్న స్వప్న దగ్గరికి వచ్చి అందరూ కోసం వెయిట్ చేస్తున్నారు త్వరగా రెడీ అవ్వు అని చెప్పి కూతురి మెడలో నగలు వెయ్యబోతుంది కనకం. ఇవి ఎలా పడితే అలా వేయకు 24 క్యారెట్స్ గోల్డ్ అని గొప్పగా చెప్తుంది స్వప్న.
అది చూసిన రాహుల్ చూడు మమ్మీ మన నగలని తను నగలు అని ఎంత గొప్పగా చెప్తుందో అంటాడు. ఇంటి కోడలు అయింది కదా తనకి ఆ హక్కు ఉంది అంటుంది రుద్రాణి. ఏంటి మమ్మీ ఇప్పటికే ప్లాన్ ఫెయిల్ అయిందని బాధలో ఉన్నాను నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటాడు రాహుల్. ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు పోస్ట్ పోన్ అయ్యింది అంతే దానివల్లే నిజం తెలిసింది, తనకి అసలు ప్రెగ్నెన్సీ లేదు అని నిజం చెప్తుంది రుద్రాణి. ఒక్కసారిగా షాక్ అవుతాడు రాహుల్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.