వారంలో నాలుగు గంటలు సంతోషంగా.. శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులపై ఈ విధంగా క్లారిటీ ?
చాలా కాలంగా కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. శ్రీజ సోషల్ మీడియాలో కూడా కళ్యాణ్ దేవ్ గురించి ప్రస్తావన లేదు.

చాలా కాలంగా కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. శ్రీజ సోషల్ మీడియాలో కూడా కళ్యాణ్ దేవ్ గురించి ప్రస్తావన లేదు. కళ్యాణ్ దేవ్ కూడా తన ముద్దుల కుమార్తె గురించి పోస్ట్ లు పెడుతున్నాడు కానీ.. శ్రీజతో ఉన్న ఎలాంటి ఫొటోస్ షేర్ చేయడం లేదు.
దీనితో వీరిద్దరూ విడిపోయారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇలా కళ్యాణ్ దేవ్ తరచుగా సోషల్ మీడియాలో చేస్తున్న ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా శ్రీజ, కళ్యాణ్ దేవ్ కలసి కనిపించడం లేదు.
అలాగని విడిపోయిన విషయాన్ని కూడా కంఫర్మ్ చేయడం లేదు. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రతి వారం నాలుగు గంటల పాటు తన కుమార్తె తో సంతోషంగా ఉంటున్నట్లు కళ్యాణ్ దేవ్ పోస్ట్ చేశాడు. తన కుమార్తె నవిష్కతో హ్యాపీగా ఆడుకుంటున్న దృశ్యాలని కళ్యాణ్ దేవ్ పోస్ట్ చేశారు.
దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఒక తండ్రి తన కుమార్తెతో గడిపేది వారానికి నాలుగు గంటలు మాత్రమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు విడిపోతే పిల్లలు ఎవరి వద్ద గడపాలి అనే ప్రశ్న వస్తుంది.అలాంటి పరిస్థితుల్లో కోర్టు తల్లివద్ద ఎంత సమయం ఉండాలి.. తండ్రి వద్ద ఎంత సమయం ఉండాలి అనేది నిర్ణయిస్తుంది.
అందులో భాగంగానే కళ్యాణ్ దేవ్ తన కుమార్తెతో వారానికి నాలుగు గంటలు ఉంటున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ సినిమాల పరంగా కూడా యాక్టివ్ గా లేడు. ఇటీవల తన బర్త్ డే సెలెబ్రేషన్స్ ని కూడా కళ్యాణ్ దేవ్ కుమార్తె నవిష్కతో జరుపుకున్నాడు.
శ్రీజకి ఇద్దరు కుమార్తెలు సంతానం. మొదటి భర్త ద్వారా ఒక కుమార్తె కాగా.. కళ్యాణ్ దేవ్ ద్వారా రెండవ కుమార్తె జన్మించారు. ఆ మధ్యన శ్రీజ కళ్యాణ్ దేవ్ తో విభేదాల కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో రాంచరణ్ తన సోదరికి ఎంతో అండగా నిలబడి ఆమెని ప్రశాంతత కోసం వెకేషన్స్ కి కూడా తీసుకువెళ్లాడు.