- Home
- Entertainment
- మీకు తెలిసింది గోరంత మాత్రమే, సమస్య కొండంత.. కళ్యాణ్ దేవ్ పరోక్ష వ్యాఖ్యలు శ్రీజ గురించేనా ?
మీకు తెలిసింది గోరంత మాత్రమే, సమస్య కొండంత.. కళ్యాణ్ దేవ్ పరోక్ష వ్యాఖ్యలు శ్రీజ గురించేనా ?
కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం సైలెంట్ మైంటైన్ చేస్తోంది. అంతకు ముందు వరకు కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీతో కలిసిపోతూ కనిపించాడు.

కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ ప్రస్తుతం విడిగా ఉంటున్నారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం సైలెంట్ మైంటైన్ చేస్తోంది. అంతకు ముందు వరకు కళ్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీతో కలిసిపోతూ కనిపించాడు. కొంతకాలంగా అది జరగడం లేదు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ జంటగా కనిపించడం లేదు.
కళ్యాణ్ దేవ్ తరచుగా సోషల్ మీడియాలో చేస్తున్న ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ దేవ్ తన కుమార్తె గురించి మాత్రమే అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తున్నారు.శ్రీజతో వివాహం జరిగాక వీరిద్దరికి ఒక కుమార్తె జన్మించింది. తాను తపిస్తోంది తన కూతురు కోసమే అన్నట్లుగా కళ్యాణ్ దేవ్ పలు సందర్భాల్లో పోస్ట్ లు పెట్టాడు.
శ్రీజ, కళ్యాణ్ దేవ్ గురించి ఎలాంటి వార్తలు వస్తున్నా వారిద్దరి మాత్రం తమ వ్యక్తిగత విషయాలని బయటకి చెప్పడం లేదు. అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టం అని అంటున్నారు. తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ చూస్తుంటే.. తన గురించి, శ్రీజ గురించి బయట జరుగుతున్న ప్రచారంపై సెటైర్ వేసినట్లు అర్థం అవుతోంది.
'కొంతమందిని చూస్తే జాలిపడాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది గోరంత మాత్రమే.. సమస్య గురించి తెలియాల్సింది కొండంత ఉంటుంది. అని పోస్ట్ పెట్టాడు. అంటే తమ వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో బయట వ్యక్తులకు సరైన అవగాహన ఉండదు అని అర్థం వచ్చేలా కళ్యాణ్ దేవ్ ఈ పోస్ట్ పెట్టారు.
గతంలో కళ్యాణ్ దేవ్ నటించే చిత్రాలకు మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు కళ్యాణ్ దేవ్ చిత్రాలకు ఎలాంటి సపోర్ట్ లేదు. అయినా ఇప్పుడు కళ్యాణ్ దేవ్ సినిమాల పరంగా అంత యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు.
ఇదిలా ఉండగా శ్రీజకి మాత్రం మెగా ఫ్యామిలీ అందరి నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఆ మధ్యన శ్రీజ కాస్త డిప్రెషన్ కి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆ టైంలో రాంచరణ్ ప్రత్యేకంగా శ్రీజకి ప్రశాంతత కల్పించేందుకు ఆమెని వెకేషన్ కి తీసుకువెళ్లాడు.