MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `కల్కి2898ఏడీ` నుంచి ఓ గుడ్‌ న్యూస్‌, మరో బ్యాడ్‌ న్యూస్‌.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

`కల్కి2898ఏడీ` నుంచి ఓ గుడ్‌ న్యూస్‌, మరో బ్యాడ్‌ న్యూస్‌.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` కోసం ఇండియా మొత్తం వెయిట్‌ చేస్తుంది. కానీ రిలీజ్‌ విషయంలో క్లారిటీ లేదు. ఇప్పుడు ఓ కొత్త డేట్‌ తెరపైకి వచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 11 2024, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ప్రభాస్‌ నుంచి ఇప్పుడు `కల్కి 2898 ఏడీ` సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం విశేషం. భారీ కాస్టింగ్‌ కూడా ఇందులో ఉంది. ఇలా అన్ని రకాలుగా ఈ మూవీ పెద్ద సినిమాగా నిలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనేది మాత్రం చాలా కాలంగా వెంటాడుతున్న ప్రశ్న. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టీమ్‌ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కనీసం అప్‌డేట్‌లు కూడా ఇవ్వడం లేదు. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఇదిలా ఉంటే ఓ గుడ్‌ న్యూస్‌ షేర్‌ చేసుకున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.సినిమా షూటింగ్‌ పూర్తయిందనే వార్తని వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా ప్యాకప్‌ అంటూ పేర్కొన్నాడు. ఇందులో ఓ ఫన్నీ డైలాగ్‌లను షేర్‌ చేసుకున్నారు. 

36

ప్రభాస్‌ కటౌట్‌కి బ్యాక్‌ గ్రౌండ్‌లో జాకెట్‌పై నాగ్‌ అశ్విన్‌ ఫోటో, కల్కిలో ప్రభాస్‌ లుక్‌ని పెట్టి.. `ప్యాక్ అప్‌.. నైస్‌ బట్‌ వన్‌ లాస్ట్ టేక్` అని నాగ్‌ అశ్విన్‌ అంటున్నట్టుగా ఓ డైలాగ్‌ ఉంటే, కింద   `నాయాల్ది కత్తి అందుకో జానకి` అని కోపంతో ప్రభాస్‌ చెబుతున్నట్టుగా ఉన్న ఫోటోని షేర్‌ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌  అవుతుంది. 
 

46

ఇదిలా ఉంటే `కల్కి2898ఏడీ` ఎక్కువ రోజులు షూటింగ్‌ జరుపుకున్న సినిమాగా నిలిచింది. ఈ విషయంలో `బాహుబలి`ని మించిపోవడం విశేషం. `బాహుబలి` కోసం రాజమౌళి 896రోజులు తీసుకున్నాడు. కానీ `కల్కి2898ఏడీ`కోసం నాగ్‌ అశ్విన్‌ ఏకంగా 991రోజులు తీసుకున్నారు. ఆల్మోస్ట్ వంద రోజులు ఎక్కువ చిత్రీకరణ జరుపుకుంది. 

56

ఇక ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ లేదు. మే 9ని టీమ్‌ ప్రకటించింది. కానీ వాయిదా పడుతుందంటూ ప్రచారం మొదలైంది. షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్‌ డిలే కారణంగా సినిమాని వాయిదా వేస్తున్నారట. మరి కొత్త డేట్‌ ఎప్పుడు అనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కొత్త డేట్‌ వినిపిస్తుంది. మే 30న రాబోతుందనే వార్తలు ఆ మధ్య వచ్చాయి.కానీ ఆ డేట్‌ కి కూడా కష్టమే అట. దీంతో జూన్‌కి వెళ్తున్నట్టు టాక్‌. జూన్ 20 రిలీజ్‌ డేట్‌ అనుకుంటున్నట్టు లేటెస్ట్ న్యూస్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

66

నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు దీపికా పదుకొనె, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కమల్‌ హాసన్‌ది గెస్ట్ రోల్‌ అని తెలుస్తుంది. వీరితోపాటు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రాజమౌళి, వర్మ వంటి వారు కూడా కనిపిస్తారట. వైజయంతి మూవీస్‌ దీన్ని సుమారు 500కోట్లతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని భారీ స్థాయిలో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ్ అశ్విన్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jacqueline Fernandez: సుఖేష్ కేసులో జాక్వెలిన్‌కు బిగ్ షాక్.. ఛార్జ్‌షీట్ దాఖలుకు కోర్టు ఆదేశం
Recommended image2
Rashmika Mandanna: భర్తని కనిపించకుండా దాచేసిన రష్మిక..ఈ సారి జపాన్ వెరీ స్పెషల్ అంటూ పోస్ట్
Recommended image3
Nagarjuna: 15 ఏళ్ల ప్రేమ.. నాగార్జున వల్ల 54 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్ ఎవరో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved