MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Chiranjeevi Song: చిరు కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ ఇచ్చిన సిరివెన్నెల..అర్థం తెలుసుకుంటే జీవితాన్ని గెలిచినట్లే

Chiranjeevi Song: చిరు కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ ఇచ్చిన సిరివెన్నెల..అర్థం తెలుసుకుంటే జీవితాన్ని గెలిచినట్లే

చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ సాంగ్స్ రుద్రవీణ చిత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా సిరివెన్నెల రాసిన 'నమ్మకు నమ్మకు' అనే సాంగ్ ఎంతలా ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సాంగ్ లిరిక్స్, వాటి అర్థాలని ఈ కథనంలో తెలుసుకుందాం.

4 Min read
Author : Tirumala Dornala
Published : Jul 23 2026, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి రుద్రవీణ మూవీ
Image Credit : Asianet News

చిరంజీవి రుద్రవీణ మూవీ

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో మాస్ చిత్రాల్లో నటించారు. అదే విధంగా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేశారు. నటన పరంగా చిరంజీవి కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో రుద్రవీణ కూడా ఉంటుంది. కమర్షియల్ గా ఈ చిత్రం సక్సెస్ సాధించలేదు కానీ అనేక జాతీయ అవార్డులు కొల్లగొట్టింది. చిరంజీవి నటనకు ప్రశంసలు దక్కాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి కెరీర్ లో మోస్ట్ పాపులర్ సాంగ్
Image Credit : our own

చిరంజీవి కెరీర్ లో మోస్ట్ పాపులర్ సాంగ్

ఈ చిత్రంలో సంగీతం ఒక అద్భుతం అనే చెప్పాలి. సిరివెన్నెల సీతారామశాస్త్రి సింగిల్ కార్డులో అన్ని పాటలు రాశారు.

ఈ మూవీలో నమ్మకు నమ్మకు ఈ రేయిని అనే సాంగ్ మోస్ట్ పాపులర్. ఇళయరాజా సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం, సీతారామశాస్త్రి సాహిత్యం అన్నీ అద్భుతంగా కుదిరాయి. వీళ్ళ ముగ్గురి ప్రతిభ ఏంటో ఈ సాంగ్ లో తెలుస్తుంది. ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ పాటలో ఎంతో లోతైన మీనింగ్ కూడా ఉంది. ఒక రకంగా ఇది జీవిత పరమార్థాన్ని తెలియజేసే మోటివేషనల్ సాంగ్.

Related Articles

Related image1
Chiranjeevi: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇండస్ట్రీలో ఉండగా ఏ ధైర్యంతో వచ్చానంటే.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్
Related image2
Mahesh Babu Flops: కృష్ణ, నమ్రతకి కూడా ఇష్టం లేదు.. మహేష్ బాబు కెరీర్ లో రాడ్డు లాంటి 5 సినిమాలు
35
తెలుగు లిరిక్స్ ఇవే
Image Credit : x/sirivennela seetharama sastry

తెలుగు లిరిక్స్ ఇవే

సాకీ : 

సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి యెచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు సీకటి 

నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి 

పొద్దుపొడుపే లేని సీకటే ఉండిపోనీ మన మధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ రాయే రాయే రామసిలక సద్దుకుపోయే సీకటేనకా

పల్లవి :

నమ్మకు నమ్మకు ఈ రేయిని

కమ్ముకు వచ్చిన ఈ మాయని

నమ్మకు నమ్మకు ఈ రేయిని

కమ్ముకు వచ్చిన ఈ మాయని

కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి

నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి

కలలే వలగా విసిరే చీకట్లను

నమ్మకు నమ్మకు ఈ రేయిని

కమ్ముకు వచ్చిన ఈ మాయని

వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు

రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ

నమ్మకు నమ్మకు

అరే.. నమ్మకు నమ్మకు

నువ్వూ... నమ్మకు నమ్మకు ఈ రేయిని

కమ్ముకు వచ్చిన ఈ మాయని

చరణం 1 :

ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో

ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో

పుడమిని చూడని కన్ను.. నడపదు ముందుకు నిన్ను

నిరసన చూపకు నువ్వు ఏనాటికీ

పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ

పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ

ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు అది

నమ్మకు నమ్మకు

అరే.. నమ్మకు నమ్మకు

అహా... నమ్మకు నమ్మకు ఈ రేయిని

కమ్ముకు వచ్చిన ఈ మాయని

చరణం 2 :

శీతాకాలంలో ఏ కోయిలైనా.. రాగం తీసేనా ఏకాకిలా

శీతాకాలంలో ఏ కోయిలైనా.. రాగం తీసేనా ఏకాకిలా

మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక

ఎవ్వరికీ చెందని గానం సాగించునా

పదుగురి సౌఖ్యం పండే.. దినమే పండుగ కాదా

పదుగురి సౌఖ్యం పండే.. దినమే పండుగ కాదా

ఆనాడు వాసంత గీతాలు పలుకును కద

మ గసమ గసమ దమద నిదని మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ

నమ్మకు నమ్మకు

అరె నమ్మకు నమ్మకు

అహా నమ్మకు నమ్మకు ఈ రేయిని

అహ కమ్ముకు వచ్చిన ఈ మాయని

కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి

నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ తోసి

కలలే వలగా విసిరే చీకట్లను

నమ్మకు నమ్మకు ఈ రేయిని

అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని.

45
ఈ పాటలోని అసలైన అర్థం ఇదే
Image Credit : Instagram

ఈ పాటలోని అసలైన అర్థం ఇదే

నమ్మకు నమ్మకు ఈ రేయిని.. కమ్ముకు వచ్చిన ఈ మాయని

ఈ చీకటిని, ఈ మోహాన్ని, ఈ అబద్ధపు ఆకర్షణలను నమ్మవద్దు.

మన జీవితంలో డబ్బు, అధికారం, వ్యసనాలు లాంటివి చల్లని రాత్రి లాగా మొదట్లో హాయిగా అనిపిస్తాయి. ఇవన్నీ మొదట సుఖంగా అనిపించినా చివరికి నాశనానికే దారితీస్తాయి.

కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి

ఇక్కడ "మత్తు" అంటే కేవలం ఆల్కహాల్ కాదు.

ఏదైనా ఒక దానిపై విచక్షణ కోల్పోయే స్థితి. వ్యసనం, డబ్బు, కోపం లాంటి విషయాల మత్తులో విచక్షణ కోల్పోతే ఆ తర్వాత జరిగేది వినాశనమే.

కలలే వలగా విసిరే చీకట్లను

ఇది అద్భుతమైన ఉపమానం. చేపను పట్టుకోవడానికి గాలం వేస్తారు.

అలాగే... చీకటి లాంటి మాయ మనిషిని పట్టుకోవడానికి కలలను వలగా వేస్తుంది.

అంటే...ఇంకొంచెం డబ్బు, ఇంకొంచెం ఆల్కహాల్ అంటూ చివరికి వాటికే బానిసని చేస్తుంది.

వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు

చంద్రుని వెలుతురు పూర్తిగా స్పష్టంగా ఉండదు.అందులో అన్నీ ఒకేలా కనిపిస్తాయి. అదేవిధంగా...అజ్ఞానంలో ఉన్నప్పుడు...మంచి-చెడు రెండూ ఒకటే అనిపిస్తాయి. అదే జీవితం అనుకుంటే మునిగిపోయినట్లే.

రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ

సూర్యుడు ఉదయిస్తే...ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. అన్నీ తేడాలు బయటపడతాయి. అలాగే...మనిషిలో జ్ఞానం అనే వెలుగు వెలిగినప్పుడు నిజం, అబద్దం.. ధర్మం, అధర్మం అన్నీ స్పష్టంగా బయటపడతాయి.

ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో

ఎంత పెద్ద భవనం అయినా...పునాది మాత్రం నేలపైనే ఉంటుంది. మనిషి ఎంత గొప్పవాడైనా...తన మూలాలను మర్చిపోకూడదు.

పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను

నడుస్తున్నప్పుడు నేల చూడకపోతే పడిపోతాం.

అలాగే...జీవితంలో వాస్తవాలను చూడకుండా...కేవలం కలల్లో జీవిస్తే...ముందుకు వెళ్లలేం.

నిరసన చూపకు నువ్వు ఏనాటికీ

ప్రపంచాన్ని, మనుషులను, జీవితాన్ని ద్వేషించవద్దు.

సమస్యలు వచ్చినా...వాటిని మార్చడానికి ప్రయత్నించాలి. దూరంగా పారిపోవద్దు.

పక్కవారి గుండెలనిండా చిక్కనైన వేదన నిండ... ఏ హాయి రాదోయి నీ వైపు

ఇది మొత్తం పాటలో అత్యంత గొప్ప సందేశం.

నీ ఆనందం...ఇతరుల కన్నీళ్ల మీద నిలబడితే అది ఆనందమే కాదు. ఒక రోజున నువ్వు అనుకునే హాయి సంతోషం అన్నీ నీకు దూరం అవుతాయి.

మరువకు అది

ఎప్పుడూ గుర్తుంచుకో.

శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా

కోయిల వసంతంలో పాడుతుంది. చలికాలంలో కాదు. అంటే... ప్రతి పనికీ ఒక సమయం ఉంటుంది. సమయం రాకముందే ఫలితం కోరుకోవద్దు.

మురిసే పువ్వులు లేక... విరిసే నవ్వులు లేక... ఎవ్వరికీ చెందని గానం సాగించునా

పూలు లేవు, నవ్వులు లేవు, ఆనందం లేదు...అలాంటి చోట సంగీతం కూడా పుట్టదు.

కళకు అర్థం...మనుషుల ఆనందంలోనే ఉంటుంది.

పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా

ఈ ఒక్క లైన్ రుద్రవీణ సినిమా మొత్తం సందేశాన్ని చెబుతుంది.

మనం ఒక్కరే సంతోషంగా ఉంటే...అది పండుగ కాదు. మన చుట్టూ ఉన్నవాళ్లు...

సమాజం, గ్రామం, దేశం, అందరూ సుఖంగా ఉన్న రోజే అసలైన పండుగ.

ఆనాడు వాసంత గీతాలు పలుకును కద

ప్రతి ఇంట్లో సంతోషం ఉంటే...ప్రతి హృదయంలో ప్రేమ ఉంటే...అప్పుడే నిజమైన వసంతం వస్తుంది.

55
అందుకే చిరస్థాయిగా నిలిచిపోయింది
Image Credit : Asianet News

అందుకే చిరస్థాయిగా నిలిచిపోయింది

ఇంతటి డీప్ మీనింగ్ తో సిరివెన్నెల ఈ పాటని రాశారు. ఒకే పాటలో జీవిత పరమార్థాన్ని, రుద్రవీణ చిత్రం థీమ్ ని తెలియజేసేలా రాశారు. దీనితో బాలు గాత్రం, ఇళయరాజా సంగీతం తోడు కావడంతో చిరస్థాయిగా నిలిచిపోయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image2
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image3
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Related Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇండస్ట్రీలో ఉండగా ఏ ధైర్యంతో వచ్చానంటే.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Mahesh Babu Flops: కృష్ణ, నమ్రతకి కూడా ఇష్టం లేదు.. మహేష్ బాబు కెరీర్ లో రాడ్డు లాంటి 5 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved