MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `Kalki2898ad 30 రోజుల కలెక్షన్లు.. ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది? టోటల్‌ లెక్కలు..

`Kalki2898ad 30 రోజుల కలెక్షన్లు.. ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది? టోటల్‌ లెక్కలు..

 ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ` చిత్రం విడుదలైన నెల రోజులు దాటినా ఇంకా థియేటర్లలో సత్తా చాటుతూనే ఉంది. మరి ఈ నెల రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 28 2024, 12:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రభాస్‌ హీరోగా నటించిన `కల్కి2898 ఏడీ` సినిమా గత నెలలో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన సినిమా కలెక్షన్ల దుమ్మురేపుతుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. సరికొత్త రికార్డుల దిశగా వెళ్తుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు అయ్యింది. మరి 30 రోజుల్లో `కల్కి` ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

`కల్కి 2898 ఏడీ` ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా రూ.1015కోట్లు వసూలు చేసింది. ఇందులో ఇండియాలో ఈ సినిమా రూ. 742 కోట్లు(గ్రాస్‌) రాబట్టగా, ఓవర్సీస్‌లో రూ.272కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఇందులో ఏపీ, తెలంగాణలో 273 కోట్లు, కర్నాటకలో 70కోట్లు, తమిళనాడులో 45కోట్లు, కేరళాలో 30కోట్లు వసూలుచేసింది. ఇక నార్త్ లో మాత్రం దుమ్మురేపింది. అక్కడ ఈ మూవీ 322కోట్లు రాబట్టడం విశేషం. 

34

అయితే 1100 మార్క్ చేరిందనే మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. ఈ వారమే కాదు, ఆగస్ట్ 15 వరకు `కల్కి` నడుస్తూనే ఉంది. మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ 372కోట్లు అయ్యిందట. ఈ లెక్కన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌ దాటి లాభాల్లో వెళ్తుందీ మూవీ. 
 

44

ప్రభాస్‌ హీరోగా, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, విజయ్‌ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌, బ్రహ్మానందం, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమాకి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీస్‌ నిర్మించింది. ఈ మూవీ నుంచి రెండో పార్ట్ రాబోతుంది. మహభారతం ఎలిమెంట్లకి సైన్స్ ఫిక్షన్‌ జోడించి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విజువల్‌ ఎఫెక్ట్స్, యాక్షన్‌, మహాభారతం ఎలిమెంట్లు సినిమా విజయానికి కారణమయ్యాయని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
నాగ్ అశ్విన్
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Patriotic Films: నిజ జీవిత హీరోల కథలతో వచ్చిన 5 సినిమాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిస్ అవ్వకండి
Recommended image3
Kamakshi Bhaskarla: ఇప్పటికీ కారు లేదు, బైక్‌ మీదనే తిరుగుతున్న హీరోయిన్‌.. క్రేజీ ఫిలాసఫీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved