కల్కి 2898 AD: IMDb టాప్‌లో ప్రభాస్ సినిమా
కల్కి 2898 AD, ప్రభాస్ నటించిన ఈ సినిమా IMDb యొక్క 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించి, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాను అధిగమించింది.
Kamal Hassan, Prabhas, Kalki 2898 AD
“కల్కి 2898 ఎడి” మరో సారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మార్కెట్ రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపించాడు. కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టాడు. జూన్ 27న విడుదలైన కల్కి.. 50 రోజులు థియేట్రికల్ రన్ కొనసాగింది. ఇండియా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో కల్కి చేరిపోయింది. భారత్‌లో గ్రాస్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీని కల్కి 2898 ఏడీ దాటేసింది. జవాన్ లైఫ్‌టైమ్ రికార్డ్‌ను కల్కి 40 రోజలు కలెక్షన్లతో దాటేసింది. ఇప్పుడీ సినమా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.
మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగియనుండటం వల్ల ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 25 మధ్య రిలీజైన సినిమాల్లో ఐఎండీబీ రేటింగ్ ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది. వరల్డ్ వైడ్‌గా ఉన్న 250 మిలియన్లకు పైగా తమ సైట్ ని చూసిన వారి వ్యూస్ ఆధారంగా ఈ లిస్ట్‌ను రెడీ చేసినట్లు సదరు సంస్థ తెలిపింది.
ఈ జాబితాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Prabhas Kalki 2898 AD) అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు లిస్ట్ రిలీజ్ చేసింది. అవి
1. ప్రభాస్ కల్కి 2898 ఏడీ
2. శ్రద్ధా కపూర్ స్త్రీ 2
3. విజయ్ సేతుపతి మహరాజ్
4. అజయ్ దేవగణ్ షైతాన్
5. హృతిక్ రోషన్ ఫైటర్
6. మలయాళ చిత్రం మంజుమ్మల్ బాయ్స్
7. కార్తీక్ ఆర్యన్ భూల్ భూలయ్య 3
8. కిల్
9. అజయ్ దేవగణ్ సింగమ్ అగైన్
10. లాపతా లేడీస్
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ “కల్కి 2898 ఎడి” ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్, KGF 2, RRR తర్వాత భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా కల్కి సత్తా చాటింది. ఇప్పటి వరకు భారత్‌లో నాలుగో స్థానంలో ఉన్న షారుఖ్ జవాన్ చిత్రాన్ని ఈ చిత్రం అధిగమించింది.
Kalki 2898 AD
కల్కి 2898 AD హిందూ పురాణాలను ప్రధాన అంశంగా తీసుకుని దానికి సాంకేతికత జోడించి సైన్స్ ఫిక్షన్ రూపంలో డైరెక్టర్ తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్,అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి బలమైన తారాగణం ఉంది. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రత్యేక పాత్రలలో కనిపించారు.