‘కల్కి’టీమ్ కి కొత్త భయం.? , అవన్నీ ట్రిమ్ చేసి మరీ ఓటిటిలో...?
ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ చిత్రం “కల్కి 2898 ఎడి”.ఈ సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది.
Kalki 2898 AD
మెల్లిమెల్లిగా ప్రభాస్ (Prabhas) నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభావం భాక్సాఫీస్ దగ్గర తగ్గుతోంది. రావాల్సిన మేరకు కలెక్షన్స్ కొల్లగొట్టేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ రెండింట్లో ఆగస్ట్ 23 నుంచి కల్కిని డిజిటల్ ప్రీమియర్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించినట్లు ఓ పోస్టర్ సోషల్ మీడియాలో కనపడుతూ తెగ వైరల్ అవుతోంది.అయితే సంస్ద నుంచి అఫీషియల్ ప్రకటన రాలేదు.
Kalki 2898 AD
అది ప్రక్కన పెడితే... ఈ సినిమా ఓటిటి విషయమై ‘కల్కి’టీమ్ కి కొత్త భయం పట్టుకుందని అంటున్నారు. మీడియాలో చెప్పుకునేదానిప్రకారం రీసెంట్ గా భారతీయడు 2 చిత్రం ఓటిటి రిలీజ్ కు దారుణమైన రెస్పాన్స్ రావటమే కాకుండా ఆ సినిమాలో మైనస్ లు, లూప్ హోల్స్ పట్టుకుని రచ్చ రచ్చ చేస్తున్నారు సోషల్ మీడియా జనం. అందుకు కారణం థియేటర్ లో సినిమా చూసేటప్పుడు ఓ ప్లోలో వెళ్లిపోతుంది. వెనక్కి వెళ్లి ఫలానా సీన్ చూడటానికి ఉండదు. కావాలంటే మళ్లీ టిక్కెట్ కొనుక్కుని వచ్చి చూడాల్సిందే.
kalki 2898
అదే ఓటిటి కు వచ్చేటప్పుడు ఫలానా ఫ్రేమ్ కావాలన్నా ఆపి మరీ చూసుకోవచ్చు. ముందుకు, వెనక్కి ఒకటికి పది సార్లు కదుపుతూ సినిమాని చూడచ్చు. దాంతో ఎక్కడైనా చిన్న మిస్టేక్ దొరికినా అది పెద్దదిగా కనపడుతోంది. సినిమాని పోస్ట్ మార్టం చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. యాంటి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో రీచ్ కోసం కూడా ఈ వీడియోలు షేర్ చేస్తూంటారు. దాంతో సినిమా రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ జరగటం కామన్ అయ్యిపోయింది.
Prabhas Kalki
ఇవన్నీ బాగా క్లోజ్ గా గమనిస్తున్న కల్కి టీమ్ ..ఓటిటి వెర్షన్ లో మార్పులు చేయాలనుకుంటోంది. ఆరు నిముషాలు ట్రిమ్ చేసిన వెర్షన్ ని రెడీ చేసారట. ఎక్కడైనా బోర్ కొట్టిన చోట సినిమాని పరుగెట్టించటం , విసుగ్గా అనిపించే సీన్స్ ని లెంగ్త్ తగ్గించటం వంటివి చేసారట. అలా మూడు గంటల సినిమాకు కొంత కోత పెట్టారని చెప్పుకుంటున్నారు. అయితే అందులో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది.
భైరవ పాత్రలో చేసిన పెర్ఫార్మెన్స్, అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ అదరకొట్టే నటన, అంతకు మించి నాగ్ అశ్విన్ మేకింగ్ విజన్ కి ఆడియన్స్ నీరాజనాలు పడుతున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. కల్కి’లో కమల్ హాసన్ విలన్‌గా కనిపించారు. సుప్రీం యాస్కిన్ పాత్రను ఆయన (Kamal Haasan) పోషించారు. ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నట్లు తెలిపారు. ‘ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు స్వీయసందేహం వచ్చింది. నేను దీన్ని చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైన పాత్ర. అందుకే దీనికి సంతకం చేయడానికి ఏడాది ఆలోచించా’ అని చెప్పారు.