- Home
- Entertainment
- కత్తిలాంటి అందాలతో కాజోల్ చురకత్తులాంటి పోజులు.. వామ్మో చీరలో ఘాటు రేపుతున్న సీరియర్ హీరోయిన్
కత్తిలాంటి అందాలతో కాజోల్ చురకత్తులాంటి పోజులు.. వామ్మో చీరలో ఘాటు రేపుతున్న సీరియర్ హీరోయిన్
ముదురు హీరోయిన్ ఘాటు అందాలతో రచ్చ చేస్తుంది. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన కాజోల్ చీర అందాల్లో కైపెక్కిస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.

`దిల్ వాలే దుల్హానియా లేజాయింగే` చిత్రంతో ఇండియన్ సినిమాని ఊపేసింది కాజోల్(Kajol). లవ్ స్టోరీలకు కేరాఫ్‌గా నిలిచి, కుర్రకారుని ఉర్రూతలూగించింది. లవర్ అంటే ఇలానే ఉండాలేమో అనేంతగా తన ప్రభావాన్ని చూపించింది కాజోల్. ఇందులో సిమ్రాన్‌సింగ్ పాత్రలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ బాలీవుడ్‌లో ప్రేమ కథల్లో ఓ క్లాసిక్‌గా నిలిచిపోతుందీ మూవీ. షారూఖ్ తో కలిసి కాలోజ్ పండించిన కెమిస్ట్రీ, రొమాన్స్ ఎవర్ గ్రీన్ గానే చెప్పాలి.
కాజోల్ మూడు దశాబ్దాల సినీ కెరీర్‌లో కేవలం ముప్పైకి పైగా చిత్రాల్లోనే నటించింది. అందులోనూ హీరోయిన్‌గా చేసినవి ఇరవైకి పైగానే ఉంటాయి. చాలా రోజులుగా ఆమె కీలక పాత్రలతోనే నటిస్తూ వస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆమె మెయిన్ ఫీమేల్ లీడ్‌గా సినిమాలు తగ్గించింది.
చాలా వరకు భర్త అజయ్ దేవగన్‌తో, లేదంటే ఇతర సినిమాల్లో బలమైన పాత్రల్లోనే నటిస్తూ వస్తుంది. గ్లామర్‌కిదూరంగా ఉంటూ వస్తుంది. కానీ తన ఇంపాక్ట్ చూపించే పాత్రలు, సినిమాలే చేస్తుంది. ఇటీవల `సలామ్ వెంకీ` చిత్రంతో మెరిసింది. ఈచిత్రానికి విశేష ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఇదిలా ఉంటే లేటు వయసులోనే ఘాటు రేపే అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది కాజోల్. తాజాగా ఈ బ్యూటీ చీరలో మెరిసింది. బరువైన అందాలతో ఇంటర్నెట్‌ని బ్రేక్ చేసే ఈ భామ ఇప్పుడు చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి హోయలు పోయింది. రెడ్ కలర్ శారీలో ఆమె కనువిందు చేసింది. స్లీవ్ లెస్‌లో హాట్ అందాలను, కొంగు జరిపి నడుము అందాలను ఆవిష్కరించింది.
దీంతో ప్రస్తుతం కాజోల్ లేటెస్ట్ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె ఓ పోస్ట్ పెట్టింది. `ఒక వ్యక్తి మిమ్మల్ని ఎలా ప్రేమించాలని మీరు కోరుకుంటున్నారో కొన్ని బట్టల విషయంలో మీరు కూడా అలానే ప్రేమలో పడతారు. అది అన్ కండీషనల్‌గా ఉంటుంది` అని పేర్కొంది.
కాజోల్ చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తుంది. ఆమె బలమైన పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది. ఇటీవల `సలార్ వెంకీ`లో మదర్‌గా మెప్పించింది. ఇప్పుడు `లస్ట్ స్టోరీస్ 2`(నెట్ ఫ్లిక్స్ కోసం),తోపాటు మరో హిందీ మూవీలో నటిస్తుంది. అలాగే `ది గుడ్ వైఫ్` అనే వెబ్‌సిరీస్ కూడా చేస్తుంది కాజోల్.