- Home
- Entertainment
- భర్తకి కాజల్ ఘాటు ముద్దు.. చీకట్లో చందమామ ఇచ్చిన ట్రీట్‌కి సర్‌ప్రైజ్‌లో గౌతమ్ కిచ్లు
భర్తకి కాజల్ ఘాటు ముద్దు.. చీకట్లో చందమామ ఇచ్చిన ట్రీట్‌కి సర్‌ప్రైజ్‌లో గౌతమ్ కిచ్లు
అందాల చందమామ కాజల్ ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. తన కుమారుడితో ఆడుకుంటూ మాతృత్వాన్ని ఆస్వాధిస్తుంది. పూర్తిగా కుటుంబానికే పరిమితమై ఆనంద క్షణాలను ఆస్వాదిస్తుంది కాజల్.

కాజల్ తాజాగా తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి డేట్‌కి వెళ్లింది. అయితే ఈ సందర్భంగా తన భర్తతో దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఊపేస్తుంది. ఇందులో ఈ భామ గౌతమ్‌కి ఘాటుగా ఓ ముద్దువ్విడం విశేషం. డిన్నర్ చేసిన వీరిద్దరు చీకటిగా ఉన్న డైనింగ్ టేబుల్ వద్దే సడెన్‌గా కాజల్ ఇచ్చిన ట్రీట్‌కి గౌతమ్ సర్‌ప్రైజ్‌కి గురయ్యాడు.
భర్త బుగ్గపై ఎంతో ప్రేమతో ముద్దు పెట్టింది కాజల్. దానికి ఆయన ఆనందంలో మునిగి తేలడం విశేషం. భార్య భర్తల మధ్య ఇవన్నీ కామన్, కానీ ఇలాంటి ప్రత్యేకమైన ప్లేస్‌లో, చాలా స్పెషల్‌గా, సడెన్‌గా వచ్చే ఇలాంటి సర్‌ప్రైజ్‌లు నిజంగానే థ్రిల్ కి గురి చేస్తాయి. గౌతమ్ కిచ్లు అలాంటి థ్రిల్‌నే పొందారు. వీరిద్దరు ఇలా తమ మధ్య ఉన్న ప్రేమని చాటుకోవడం విశేషం.
ఈ ఫోటోని కాజల్ తన ఇన్స్ స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కాజల్, తన సిస్టర్ నిషా అగర్వాల్ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ కి వెళ్లారు. అంతకుముందే సిస్టర్‌తో డిన్నర్ డేట్ అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది కాజల్.ఇప్పుడు మరోసారి నిషా ఫ్యామిలీతోపాటు తన భర్తతో దిగిన పిక్ ని కూడా పంచుకుని ఫ్యాన్స్ ని కూడా సర్‌ప్రైజ్ చేశారు.
ఇక కాజల్ ఇచ్చిన ముద్దుని చూసి నెటిజన్ల వాహ్ అంటున్నారు. గౌతమ్ అదృష్టవంతుడు అని, లైఫ్‌లో గుర్తిండిపోయే సందర్భం ఇది అని, కాజల్ చాలా రొమాంటిక్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, వారి జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. జోడీ బాగుందని, ఎప్పుడూ ఇంతటి ప్రేమతోనే ఉండాలని కోరుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
కాజల్ ప్రస్తుతం పూర్తి ఫ్యామిలీకే పరిమితమైన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం ఆమె తన కుమారుడు నీల్ కిచ్లుకి జన్మనిచ్చింది. దీంతో కుమారుడే సర్వస్వంగా బతికేస్తుంది. ఆ ఆనంద క్షణాలను అనుభవిస్తుంది. ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.
మరోవైపు ఆమె రీఎంట్రీకి కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఆ మధ్య వరుసగా ఫోటో షూట్లు నిర్వహించింది. ఇందులో ఆమె హాట్ పోజులివ్వడం విశేషం. డెలివరీ అయిన నెల రోజులకే ఘాటు పోజులివ్వడంతో నెటిజన్లే కాదు అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇదంతా ఆమె రీఎంట్రీ కోసమే అని తెలుస్తుంది.
కాజల్ చివరగా `ఆచార్య`లో నటించింది. కానీ తీరా ఆమె పాత్రని విడుదల టైమ్‌లో లేపేశారు. అలా కాజల్ చివరి మూవీని మిస్ అయ్యారు అభిమానులు. దీంతో తమిళంలో నటించిన `హే సినామికా`నే ఆమె చివరగా నటించిన చిత్రంగా నిలిచింది. `ఆచార్య` వివాదం గురించి తెలిసిందే. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. `ఆచార్య` శాటిలైట్ రైట్స్ విషయంలో ఇబ్బంది తలెత్తింది.
ముందుగా కాజల్ పాత్ర ఉందనే కోణంలో సదరు టీవీ ఛానెల్ శాటిలైట్ ఛానెల్ దాదాపు ఏడున్నర కోట్లకు రైట్స్ కొనుగోలు చేసిందట. తీరా ఇప్పుడు ఆమె పాత్ర లేకపోవడంతో వాళ్లు ప్రసారం చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో కాజల్ సీన్లతోపాటు మరికొన్ని సన్నివేశాలను జోడించి టీవీలో ప్రసారం చేయబోతున్నారట.