Kajal Aggarwal : కాజల్ నుంచి అదొక్కటి మిస్ అయ్యింది.. స్టార్ హీరోయిన్ ప్రయత్నం కూడా దానికోసమే!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆమె క్రేజ్ కు తగ్గ సినిమాలు చేస్తున్నారు. అయితే కాజల్ నుంచి అదొక్కటి మిస్ అవుతుండటం అభిమానులకు, ఆడియెన్స్ వెలితిగా మారింది.
తెలుగు ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనవరం లేదు. చందమామ నుంచి మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ ఇండస్ట్రీలో నిర్విరామంగా కొనసాగుతోంది.
పెళ్లై, కొడుకు పుట్టినా కెరీర్ లో కొనసాగుతూనే ఉన్నారు. వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. చివరిగా కాజల్ బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ చిత్రంలో నటించింది. నెక్ట్స్ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తో రాబోతోంది.
అయితే, కాజల్ పెళ్లి తర్వాత, ముఖ్యంగా తల్లిగా ప్రమోషన్ పొందిన తర్వాత ఆమె ముఖంలో చాలా ఛేంజ్ వచ్చిన విషయం తెలిసిందే. దాంతో రూపసౌందర్యం కాస్తా తగ్గింది. దాని నుంచి మళ్లీ రికవరీ అయ్యేందుకు, వింటేజ్ లుక్ కోసం తగిన ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇక గతంలో కాజల్ ఫొటోషూట్లతో తాజా లుక్ ను పోల్చితే కాజల్ ఫేస్ లో చాలా ఛేంజ్ వచ్చిందంటున్నారు. మళ్లీ వింటేజ్ లుక్ లోకి మారిపోతుందని అంటున్నారు. దీంతో చందమామ తన మునుపటి అందంతో ఫ్యాన్స్ కు కనిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు లేటెస్ట్ ఫొటోస్ చూస్తే అర్థమవుతోంది.
కాజల్ ప్రస్తుతం ఫిట్ నెస్ పరంగా ఎప్పుడూ ఫిట్ గా కనిపించేందుకు వర్కౌట్స్ చేస్తున్నారు. మరోవైపు తన అందం విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తున్నారు. ఓవైపు ఫ్యామిలీ... మరోవైపు కెరీర్ ను కొనసాగిస్తూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.
లేటెస్ట్ లుక్ లో కాజల్ చాలా అందంగా కనిపించారు. క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేశారు. టైట్ అవుట్ ఫిట్ లో అట్రాక్టివ్ స్ర్టక్చర్ తో ఆకట్టుకున్నారు.దీంతో పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే... ‘ఇండియన్ 2’, ‘సత్యభామ’, ‘ఉమ’ అనే చిత్రంలో నటిస్తోంది.