- Home
- Entertainment
- Kajal Aggarwal: త్వరలో తల్లి కాబోతున్న కాజల్.. నిండు గర్భంతో ఎలా మురిసిపోతోందో, స్టన్నింగ్ ఫోటోస్
Kajal Aggarwal: త్వరలో తల్లి కాబోతున్న కాజల్.. నిండు గర్భంతో ఎలా మురిసిపోతోందో, స్టన్నింగ్ ఫోటోస్
కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే.

కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే.
కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత.
కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గర్భవతి. కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. కాజల్ కూడా టెంపరరీగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇదిలా ఉండగా ఇటీవల కాజల్ తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేసినప్పుడు కొందరు నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్, ట్రోలింగ్ ఎదుర్కొంది. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో మార్పులు సహజమే. కానీ కాజల్ బేబీ బంప్ తో ఉండడంపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటూ వారికి కాజల్ తనదైన శైలిలో గట్టిగా బదులిచ్చింది. బాడీ షేమింగ్ చేసే కొందరు మూర్ఖులు కోసమే ఇది అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది.
తాజాగా కాజల్ అగర్వాల్ నిండు గర్భంతో ఉన్న తన ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా కనిపిస్తోంది. రెడ్ కాజల్ అగర్వాల్ తానబేబి బంప్ తో ఫోజులు ఇచ్చింది.
ఇప్పటి నుంచే కాజల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ మురిసిపోతోంది. ఈ ఫోటోలకు కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కామెంట్ చేస్తూ.. అఫీషియల్ గా నాకు మరో బిడ్డ రాబోతోంది అని పేర్కొంది. కాజల్ మాత్రం తల్లి అయ్యేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నా. నాలో ఉన్న భయాల్ని వదిలేస్తున్నా అని పేర్కొంది.