- Home
- Entertainment
- Kajal Aggarwal: మొదటిసారి ప్రపంచానికి తన బిడ్డను పరిచయం చేసిన కాజల్.. చందమామలా ఎంత అందంగా ఉన్నాడో!
Kajal Aggarwal: మొదటిసారి ప్రపంచానికి తన బిడ్డను పరిచయం చేసిన కాజల్.. చందమామలా ఎంత అందంగా ఉన్నాడో!
కాజల్ అగర్వాల్ తన కొడుకుని ప్రపంచానికి పరిచయం చేసింది. కాజల్ బిడ్డను చూసిన అభిమానులు చాలా థ్రిల్ ఫీలవుతున్నారు. చందమామ కాజల్ కి పుట్టిన ఈ పిల్లాడు అచ్చు అమ్మ పోలికలతో బుల్లి చందమామలా ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. కాజల్ కొడుకు ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Kajal Aggarwal
కాజల్(Kajal Aggarwal)-కిచ్లు జీవితాల్లోకి మరో కొత్త వ్యక్తి వచ్చారు. కాజల్, గౌతమ్ కిచ్లు ఇప్పుడు ముగ్గురయ్యారు.కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19 మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.నిన్నటి నుండి ఈ వార్త మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు గౌతమ్ కిచ్లు ఫ్యామిలీలో ఆనంద క్షణాలు నెలకొన్నాయని కామెంట్ చేస్తున్నారు.
Kajal Aggarwal
స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్.. 2020 అక్టోబర్‌లో గౌతమ్ కిచ్లు(Gautham Kitchlu) ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా ఆంక్షల నేపథ్యంలో అక్టోబర్ 30న అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో కాజల్, గౌతమ్ కిచ్లు ఒక్కటయ్యారు.
Kajal Aggarwal
వృత్తిరీత్యా గౌతమ్ కిచ్లు ముంబయికి చెందిన వ్యాపారవేత్త. సొంతగా ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ నడుపుతున్నారు. గౌతమ్ తో కాజల్ కి చాలా కాలంగా పరిచయం ఉంది. ఆయన కాజల్ ఫ్యామిలీ ఫ్రెండ్. కొన్నేళ్లుగా రహస్యంగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. తాజాగా అమ్మానాన్నలు గా మారారు.
ఇక పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాలు చేస్తున్నారు. `ఆచార్య`, `మోసగాళ్లు` చిత్రాల్లో నటించింది. కానీ ఈ ఏడాది ప్రారంభంలోనే కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని గౌతమ్ కిచ్లు ప్రకటించారు.కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, ఈ ఏడాది తమ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని, తమకి ఈ ఇయర్ చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. అంటే అప్పటికే కాజల్ ఐదు నెలల గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్టకేలకు మగబిడ్డకి జన్మనివ్వడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బ్లెస్సింగ్స్ ని అందిస్తున్నారు.
ఇక కాజల్ నటిస్తున్న `ఆచార్య`(Acharya) చిత్రం ఈనెల 29న విడుదల కాబోతుండటం విశేషం. చిరంజీవి (Chiranjeevi) హీరోగా, రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ ఈ మూవీలో చిరంజీవికి జంటగా నటిస్తున్నారు. ఆచార్య మూవీలో కాజల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. లైఫ్ లో సెటిల్ కావాలని డిసైడైన కాజల్ కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదు.
Kajal Aggarwal
కాగా శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు 2 వివాదాల కారణంగా విడుదలకు నోచుకోవడం లేదు. ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటించారు. అలాగే కాజల్ నటించిన ఉమా అనే హిందీ చిత్రంతో పాటు రెండు తమిళ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. తల్లిగా కొన్నాళ్లు పూర్తిగా సినిమాలకు కాజల్ దూరం కానుంది.