MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Kajal Aggarwal: క్యారవాన్‌లోకి దూసుకొచ్చిన ఫ్యాన్, షర్ట్ విప్పి మరీ.. కాజల్ చెప్పిన షాకింగ్ స్టోరీ

Kajal Aggarwal: క్యారవాన్‌లోకి దూసుకొచ్చిన ఫ్యాన్, షర్ట్ విప్పి మరీ.. కాజల్ చెప్పిన షాకింగ్ స్టోరీ

షూటింగ్ సెట్లలో నటీనటుల భద్రత ఎంత ముఖ్యమో కాజల్ అగర్వాల్ చెప్పిన ఓ సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తన క్యారవాన్‌లో ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 25 2026, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Kajal Aggarwal
Image Credit : instagram

Kajal Aggarwal

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన కాజల్ అగర్వాల్, తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. షూటింగ్ సెట్‌లో జరిగిన ఈ సంఘటన గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సెకండ్ ఇన్నింగ్స్‌
Image Credit : others

సెకండ్ ఇన్నింగ్స్‌

పెళ్లి, బాబు పుట్టడంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న కాజల్, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న ఆమె, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ భయంకరమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ పాత సంఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని ఆమె చెప్పారు.

Related Articles

Related image1
Tollywood: చిరంజీవి, కృష్ణంరాజు, నాగార్జున కుటుంబాల బలమైన బ్యాగ్రౌండ్ తుస్సుమందా.. ఈ 5 ఎందుకు ఫ్లాప్ అంటే
Related image2
Akhil: తెలిసీతెలియక బురదలో కాలేశా, రంగస్థలం నా మైండ్ సెట్ మార్చింది.. తన మూవీపై తానే సెటైర్లు వేసిన అఖిల్
37
లోపలికి వచ్చేశాడు
Image Credit : others

లోపలికి వచ్చేశాడు

షూటింగ్ స్పాట్ అనేది నటీనటులకు రెండో ఇల్లు లాంటిది. అందులోనూ క్యారవాన్ వాళ్ల పర్సనల్ స్పేస్. కానీ, అలాంటి చోటే కాజల్‌కు భద్రత కరువైంది. ఆ సంఘటనను వివరిస్తూ, ' షూటింగ్ బ్రేక్‌లో నా క్యారవాన్‌లో రెస్ట్ తీసుకుంటున్నా. ఫస్ట్ టేక్ అవ్వగానే, ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఒకతను ఎలాంటి పర్మిషన్ లేకుండా, కనీసం డోర్ కూడా కొట్టకుండా లోపలికి వచ్చేశాడు. నేను ఒంటరిగా ఉండటం చూసి, తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు' అని కాజల్ చెప్పారు.

47
ఛాతీపై ఉన్న టాటూని చూపించాడు
Image Credit : others

ఛాతీపై ఉన్న టాటూని చూపించాడు

ఆ వ్యక్తి అంతటితో ఆగలేదు. కాజల్ ముందే తన షర్ట్ విప్పి, ఛాతీపై ఉన్న టాటూని చూపించాడు. ఆ టాటూ మరెవరిదో కాదు, కాజల్ అగర్వాల్ పేరు! 'అతని పనికి నేను ఒక్క క్షణం షాక్‌లో ఉండిపోయాను. ఏం చేయాలో తెలియక నా కాళ్లు, చేతులు వణకడం మొదలయ్యాయి. అభిమాని పేరుతో ఇలా ప్రవర్తించడాన్ని అస్సలు అంగీకరించలేం' అని కాజల్ ఆ భయానక క్షణాలను పంచుకున్నారు.
57
అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు..
Image Credit : instagram

అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు..

అభిమానులంటే ఎంతో గౌరవం ఉన్న కాజల్, ఈ సంఘటనను చాలా మెచ్యూర్‌గా హ్యాండిల్ చేశారు. 'నా పేరు టాటూ వేయించుకోవడం సంతోషమే. కానీ, ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు, తన అనుమతి లేకుండా గదిలోకి రావడం క్రిమినల్ చర్య. నేను అతడిని సున్నితంగా హెచ్చరించి పంపించాను. ప్రతి ఒక్కరికీ ప్రైవసీ (Privacy) అని ఒకటి ఉంటుంది, దాన్ని గౌరవించాలి' అని ఆమె గట్టిగా చెప్పారు.
67
కాజల్ కెరీర్ గ్రాఫ్
Image Credit : Asianet News

కాజల్ కెరీర్ గ్రాఫ్

ఈ చేదు అనుభవాలున్నా, కాజల్ కెరీర్ గ్రాఫ్ మాత్రం పైపైకే వెళ్తోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాలో అద్భుతంగా నటించారు. ఇప్పుడు మళ్లీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణకు జోడీగా ఓ కొత్త సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు, భారీ అంచనాలున్న బాలీవుడ్ చిత్రం 'రామాయణ'లో, రాకింగ్ స్టార్ యశ్‌కు జోడీగా మండోదరి పాత్రలో కాజల్ నటించనుందన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
77
నటీమణుల భద్రత
Image Credit : instagram

నటీమణుల భద్రత

మొత్తం మీద, షూటింగ్ సెట్లలో నటీమణుల భద్రతపై కాజల్ గొంతు విప్పడం, ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ పెద్ద చర్చకు దారితీసింది. సినీ తారలకు కూడా సాధారణ మనుషుల్లాగే ప్రైవసీ, భద్రత అవసరం అని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Related Stories
Recommended image1
Tollywood: చిరంజీవి, కృష్ణంరాజు, నాగార్జున కుటుంబాల బలమైన బ్యాగ్రౌండ్ తుస్సుమందా.. ఈ 5 ఎందుకు ఫ్లాప్ అంటే
Recommended image2
Akhil: తెలిసీతెలియక బురదలో కాలేశా, రంగస్థలం నా మైండ్ సెట్ మార్చింది.. తన మూవీపై తానే సెటైర్లు వేసిన అఖిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved