కూరలో కరివేపాకులా మిగిలిపోయిన కాజల్.. అనుకున్నది ఒకటి, అయ్యిందొక్కటి!
కాజల్ అగర్వాల్.. మ్యారేజ్, కొడుక్కి జన్మనిచ్చాక దాదాపు రెండేళ్ల గ్యాప్‌తో ఇటీవల `భగవంత్ కేసరి`లో నటించింది. ఆమెది బలమైన పాత్ర అని అన్నారు. కానీ.. వాస్తవంగా జరిగింది వేరే.
టాలీవుడ్ చందమామగా పాపులర్ అయ్యింది కాజల్(Kajal Aggarwal). ఆమె తెలుగులో హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అందరు టాప్ స్టార్స్ తో కలిసి నటించింది. సీనియర్ హీరోల్లో చిరంజీవి సరసన మెరిసింది. వెంకటేష్, నాగార్జునలతో మాత్రం ఇంకా చేయలేదు.
నాగార్జునతో `ది ఘోస్ట్` చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ ఆ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆదిలోనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఇటీవల బాలయ్యతోనూ `భగవంత్ కేసరి`(Bhagavanth Kesari)లో నటించి, ఇద్దరు సీనియర్లని కవర్ చేసింది. కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ మూవీ `భగవంత్ కేసరి` కావడం విశేషం. ఇందులో ఆమె పాత్ర జస్ట్ హీరోయిన్ లా, డ్యూయెట్లకే పరిమితం కాదు, ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని టీమ్ చెబుతూ వచ్చింది.
కానీ తీరా చూస్తే ఆమె పాత్ర నిడివి తక్కువే. ప్రాధాన్యత కూడా తక్కువే. సినిమాలో సైకలాజిస్ట్ గా కాచీగా కనిపించింది కాజల్. శ్రీలీలని బాలయ్య.. ఆమె వద్ద జాయిన్ చేస్తాడు. ఈ పేరుతో ఆమె బాలయ్యతో పులిహోర కలుపుతుంది. గట్టిగా కొడితే నాలుగు ఐదు సీన్లలో కాజల్ కనిపిస్తుంది. మొత్తం నిడివి అర్థగంటకు మించి ఉండదు.
సినిమా బ్లాక్ బస్టర్ అంటూ టీమ్ ఊదరగొడుతుంది. కానీ వాస్తవ కలెక్షన్లు మాత్రం చాలా దూరంలో ఉన్నాయట. అయితే సినిమాకి సంబంధించి బాలయ్య, శ్రీలీల(Sreeleela), దర్శకుడు అనిల్ రావిపూడిల హడావుడినే ఎక్కువగా ఉంటుంది. బాలయ్య, శ్రీలీల బాండింగ్ మీదనే సినిమా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే శ్రీలీల పాత్రనే ఎక్కువగా ఉంటుంది.
దీంతో శ్రీలీల, బాలయ్యల ముందు కాజల్ తేలిపోయింది. పైగా ఆమె పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేకపోవడంతో ఆమె గురించిన ప్రస్తావనే లేదు. ఆమెని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో కాజల్ పాత్రకి సంబంధించి మొదట టీమ్ చెప్పింది ఒకటి, ఇప్పుడు వాస్తవంగా జరిగేది మరోటి. ఈ విషయంలో కాజల్ కూడా అసంతృప్తిగానే ఉందని టాక్. పాపం కాజల్ కూరలో కరివేపాకులానే మిగిలిపోయిందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తుండం గమనార్హం.
కాజల్ కూడా ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్, రెండు గ్రూప్ ఇంటర్వ్యూలిచ్చింది. సాధారణంగా గతంలో ఆమె చాలా వరకు ప్రమోషన్స్ లో యాక్టివ్‌గా ఉండేది, కానీ ఇప్పుడు అంతగా కనిపించలేదు. పైగా తనకు కుమారుడు, ఫ్యామిలీ ఉండటం కూడా ఆమె ప్రమోషన్స్ లో యాక్టివ్‌గా లేకపోవడానికి ఓ కారణంగా చెప్పొచ్చు.
మరి మున్ముందు ఇలాంటి సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం తెలుగులో `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు `ఇండియన్ 2`లో ఉందని అంటున్నారు, కానీ ఇంకా క్లారిటీ లేదు. అయితే కాజల్ మాత్రం ఇకపై బలమైన పాత్రలుండే చిత్రాలకు ప్రయారిటీ ఇస్తుందని సమాచారం.