MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha-Kajal: వెంకి పెళ్లి సుబ్బి చావుకు... కాజల్ తల్లైతే సమంతకు వచ్చిన ఇబ్బందేంటీ...! 

Samantha-Kajal: వెంకి పెళ్లి సుబ్బి చావుకు... కాజల్ తల్లైతే సమంతకు వచ్చిన ఇబ్బందేంటీ...! 

మన పక్కింటోడు మంచి ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటే... ఖాళీగా ఉన్న మనకు వాచిపోతుంది. అయినోడు కానోడు వాడితో మనల్ని పోల్చుతూ కాల్చుకుతింటారు. ఎవడికో ఏదో జరిగితే ఒక్కోసారి ఆ సెగ మనకు తగులుతుంది. 

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 21 2022, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Samantha Kagal Aggarwal

Samantha-Kagal Aggarwal

ఇదే పరిస్థితి ప్రస్తుతం సమంత(Samantha)కు ఎదురవుతుంది. తన తోటి హీరోయిన్ కాజల్ తల్లి కావడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం సమంతకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. కాజల్ ఆనందం సమంత సమస్యలు తెచ్చిపెడుతుంది. సమంత సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలకు గురవుతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27


విషయంలోకి వెళితే 2020 అక్టోబర్ లో వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ (Kagal Aggarwal)ఏప్రిల్ 19న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ కి అబ్బాయి పుట్టగా నీల్ కిచ్లు అని నామకరణం కూడా చేసింది. ఈనేపథ్యంలో కాజల్ సంసారిక జీవితం, ఫ్యామిలీ ప్లానింగ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

37
Kajal Aggarwal

Kajal Aggarwal


కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకున్న కాజల్ ఏడాదిన్నర కాలంలో చక్కగా ఓ బిడ్డను కన్నది. స్టార్ హీరోయినై కూడా కుటుంబ విలువలు, సంప్రదాయాలకు విలువనిచ్చి త్వరగా తల్లి అయ్యారు. భర్త కిచ్లుకు వారి కుటుంబ సభ్యులకు కాజల్ ఇస్తున్న గౌరవం చూస్తుంటే ఆమెపై మరింత అభిమానం పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. 

47

ఈ క్రమంలో వాళ్ళు సమంతను తిట్టిపోస్తున్నారు. కాజల్ ని చూసి ఆమె నేర్చుకోవాలని చురకలు వేస్తున్నారు. 2017లో నాగ చైతన్య(Naga Chaitanya)ను వివాహం చేసుకున్న సమంత సినిమాలే జీవితంగా బ్రతికారు. పెళ్లి తర్వాత కూడా ఆమె బిజీ లైఫ్ గడిపారు.పిల్లల కనాలనే ప్రయత్నం చేయలేదని నెటిజెన్స్ ఆరోపణలు చేస్తున్నారు.

57


నాలుగేళ్ళ వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకొని నాగ చైతన్యతో విడిపోయారు. సమంత కూడా కుటుంబానికి విలువనిచ్చి తల్లైతే ఆమె జీవితం బాగుండేది. నాగ చైతన్యతో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమె పేరెత్తకుండా పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు. 

67


నాగ చైతన్యతో విడాకులు మేటర్ సద్దుమణుగుతున్న సమయంలో కాజల్ వలన నెటిజెన్స్ గుర్తు చేసుకుంటున్నారు. సమంతను ఉద్దేశిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు కాజల్ తల్లై సమంతకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. 

77

అయితే ఇలాంటి విమర్శలు ఇప్పటికే అనేకం ఫేస్ చేసిన సమంత పట్టించుకోవడం మానేశారు. కేవలం కెరీర్ పై దృష్టి పెట్టి దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె మకాం ముంబైకి మార్చారు. అక్కడ ఖరీదైన ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. సమంత తెలుగులో నటించిన యశోద, శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. అలాగే ఓ తమిళ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Peddi Controversy: రామ్ చరణ్ మాటలకు క్రికెటర్ బుమ్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడా? అసలేం జరిగింది?
Recommended image3
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved