- Home
- Entertainment
- నలుగురు సీనియర్ స్టార్ హీరోల వల్ల హీరోయిన్ కెరీర్ నాశనం, ఎవరికీ లేని ట్రాక్ రికార్డ్ ఉంది కానీ
నలుగురు సీనియర్ స్టార్ హీరోల వల్ల హీరోయిన్ కెరీర్ నాశనం, ఎవరికీ లేని ట్రాక్ రికార్డ్ ఉంది కానీ
చాలా మంది హీరోయిన్లకు కెరీర్ లో హిట్లు తక్కువ ఫ్లాపులు ఎక్కువ ఉంటాయి. గ్లామర్, క్రేజ్ తో నెట్టుకొస్తుంటారు. హీరోయిన్ గ్లామర్ కి యువతలో క్రేజ్ ఉంటే కొంతకాలం హీరోయిన్ గా కొనసాగొచ్చు. వారి గ్లామర్ కి సక్సెస్ తోడైతే దశాబ్దంపైగా హీరోయిన్ గా రాణించే ఛాన్స్ ఉంటుంది.

kajal aggarwal
చాలా మంది హీరోయిన్లకు కెరీర్ లో హిట్లు తక్కువ ఫ్లాపులు ఎక్కువ ఉంటాయి. గ్లామర్, క్రేజ్ తో నెట్టుకొస్తుంటారు. హీరోయిన్ గ్లామర్ కి యువతలో క్రేజ్ ఉంటే కొంతకాలం హీరోయిన్ గా కొనసాగొచ్చు. వారి గ్లామర్ కి సక్సెస్ తోడైతే దశాబ్దంపైగా హీరోయిన్ గా రాణించే ఛాన్స్ ఉంటుంది. గత రెండు దశాబ్దాలలో గ్లామర్ ప్లస్ సక్సెస్ ఎక్కువగా ఉన్న ఏకైక హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని చెప్పొచ్చు.
Kajal Agarwal
కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య ఇలా స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆమె నటించిన చిత్రాల్లో సగానికిపైగా హిట్లు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి రికార్డ్ మరో హీరోయిన్ కి లేదు.
అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కెరీర్ సందిగ్ధంలో పడింది. పెళ్ళైనప్పటి నుంచి కాజల్ కి ఊహించని పరిస్థితి ఏర్పడింది. ఏవిషయంలోనూ ఆమెకి కలసి రావడం లేదు. సరైన అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు కాజల్ ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి అనే డైలమాలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నాలుగు సీనియర్ హీరోలు పరోక్షంగా కాజల్ కి ఈ పరిస్థితి కారణం అయ్యారు.
ముందుగా కాజల్ కి మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ చిత్రంలో ఆమె పాత్రని తొలగించారు. అది కాజల్ కెరీర్ కి మైనస్ అనే చెప్పొచ్చు. ఆ తర్వాత కాజల్ కి నాగార్జున ఘోస్ట్ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. షూటింగ్ సరైన టైంకి ప్రారంభం కాకపోవడంతో ప్రెగ్నన్సీ కారణంగా ఆ చిత్రం నుంచి ఆమె తప్పుకుంది.
ఆ తర్వాత బాలయ్య భగవంత్ కేసరి చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఇందులో కాజల్ ఆంటీ తరహా పాత్రలో నటించారు. ఈ చిత్రం సక్సెస్ అయింది కానీ క్రెడిట్ మొత్తం శ్రీలీలకి వెళ్ళింది. ఇక చివరగా శంకర్ ఇండియన్ 2 పై కాజల్ బోలెడు అసలు పెట్టుకుంది. చివరి నిమిషంలో ఆమె పాత్రని తొలగించారు. ఇండియన్ 3లో ఆమె రోల్ పవర్ ఫుల్ గా ఉంటుంది అని చెబుతున్నారు. ఇండియన్ 2 ఫ్లాప్ కావడంతో ఇండియన్ 3పై ఎవరికీ ఎలాంటి ఆసక్తి లేదు. ఈ విధంగా సీనియర్ హీరోల కారణంగా కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ డైలమాలో పడింది.