నన్ను పెళ్లి చేసుకుంటారా..? కాజల్ కు షాకిచ్చిన అభిమాని, ఆమె సమాధానం ఏంటంటే..?
సోషల్ మీడియా చిట్ చాట్ లో ఫ్యాన్స్ తో .. సరదాగాముచ్చటించింది హీరోయిన్ కాజల్. ఈసందర్భంగా ఆమెకు వింత వింత ప్రశ్నలు ఎదరవ్వగా.. వాటికి ఏమాత్రం బెదరకుండా సమాధానం చెప్పింది సీనియర్ బ్యూటీ.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కాజల్ అగర్వాల్. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా మెరిసింది బ్యూటీ. హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా కూడా.. ఏమాత్రం ఫిట్ నెస్ కోల్పోకుండా.. మెయింటేన్ చేస్తుంది కాజల్. ప్రస్తుతం వరుసగా సినిమాలు లైన్ అప్ చేస్తోంది.
గౌతమ్ కిచ్లుతో పెళ్ళి తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి.. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందికాజల్. రీ ఎంట్రీలో కూడా మంచిమంచి అవకాశాలు సాధిస్తోంది. టాలీవుడ్ లోబాలయ్య సరసన నటించలేదన్న చిన్న వెలితిని ప్రస్తుతం పూర్తి చేసుకుంటుంది బ్యూటీ. బాలకృష్ణ జోడీగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న భగవంత్ కేసరీలో నటిస్తోంది.
ఇక తాజగా కాజల్ తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చిట్ చాల్ చేసింది.. ఫ్యాన్స్ అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పింది బ్యూటీ. ఈక్రమంలోనే తను ఫేస్ చేసిన మానసిక సమస్య గురించి కూడా వెల్లడించింది కాజల్. ఈక్రమంలో తన పర్సనల్ విషయాలు కూడా వెల్లడించింది.
ఈక్రమంలో కాజల్ కు ఓ అభిమాని ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చాడు. నన్ను పెళ్ళి చేసుకుంటారా అని అడిగేశాడు. వెంటనే కాజల్ సమాధానం ఇస్తూ.. రెండున్నార ఏళ్ల క్రితమే ఆ అదృష్టం మరొకరిని వరించింది అని సింపుల్ గా సమాధానం ఇచ్చింది కాజల్. ప్రస్తుతం కాజల్ ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వెల్లడించింది కాజల్ అగర్వాల్. అల్లు అర్జున్ గురించి చెప్పండంటూ ఓ అభిమాని ప్రశ్నించగా.. నాకు తెలిసిన మంచి వ్యక్తులలో బన్నీ కూడా ఒకరని బన్నీ ఎనర్జీని ఎంతగానో ఇష్టపడానని కాజల్ చెప్పుకొచ్చారు. అందుకే ఎవరైనా సరే బన్నీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారన్నారు.
ప్రస్తుతం ఇండియన్2 మూవీ షూట్ లో పాల్గొంటున్నానని ఈ సినిమాలోని నా రోల్ విషయంలో సంతృప్తితో ఉన్నానని కాజల్ పేర్కొన్నారు. నిన్న రాత్రే లస్ట్ స్టోరీస్2 చూశానని ఆమె చెప్పుకొచ్చారు. లస్ట్ స్టోరీస్2 లో తమన్నా అద్భుతంగా యాక్ట్ చేసిందని తమన్నా నన్ను భయపెట్టిందని కాజల్ పేర్కొన్నారు.