- Home
- Entertainment
- బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోన్న కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోన్న కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది కే ర్యాంప్ మూవీ. రిలీజై పదిరోజులు అవుతున్న తగ్గేదే లేదంటోంది. ఈసినిమా కలెక్షన్స్ సంగతేంటి. ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కాబోతోందో తెలుసా?

చిన్న సినిమా పెద్ద విజయం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా మూవీ కే ర్యాంప్. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది మూవీ. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న కిరణ్ అబ్బవరం.. ఈసారి కూడా అదే కాన్సెప్ట్ తో హిట్ కొట్టాడు. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కే ర్యాంప్ మూవీ.. దీపావళి సీజన్ ను బాగా వాడేసుకుంది. అంతే కాదు యూత్ లో కిరణ్ కు, ఈ సినిమాకు ఉన్న క్రేజ్.. మౌత్ పబ్లిసిటీ ఈసినిమా వసూళ్లకు కారణం అయ్యింది.
ప్రయోగాలు చేస్తోన్న కిరణ్ అబ్బవరం
యాక్షన్, కామెడీ, ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాను జైన్స్ నాని అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కించారు. మొదటి సినిమా అయినా..అతని దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించగా, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వీరి నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది సినిమాకు హోమ్లీ లుక్ ను అందించింది. హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
కే ర్యాప్ కలెక్షన్స్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, “కే ర్యాంప్” సినిమా సుమారు 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది మొత్తం థియేట్రికల్ బిజినెస్ 8.15 కోట్ల వరకు జరిగిందని సమాచారం. లాభాల్లోకి రావాలంటే కనీసం 9 కోట్ల షేర్ సుమారు రూ. 18 కోట్ల గ్రాస్ అవసరం. ఇక ఈసినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే. కే ర్యాంప్ మొదటి రోజు 2.1 కోట్ల నెట్, 2.8–4.5 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు 2.85 కోట్లు, మూడో రోజు 2.35 కోట్లు, నాలుగో రోజు 1.85 కోట్లు, ఐదో రోజు 1.3 కోట్లు, ఆరవ రోజు 1 కోటి, ఏడవ రోజు 88 లక్షలు వసూలు చేసింది. దీంతో తొలి వారం ఇండియా వైడ్ గ్రాస్ 11.68 కోట్లు చేరింది.
వీకెండ్ లో దూసుకుపోయిన కే ర్యాంప్
ఇక కే ర్యాంప్ సినిమాకు వీకెండ్ బాగా కలిసి వచ్చింది. ఎనిమిదో రోజు 3.32 కోట్లు, తొమ్మిదో రోజు 3.5 కోట్లు వసూలు చేసింది సినిమా. మొత్తం తొమ్మిది రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ 19.5 కోట్లు, వరల్డ్‌వైడ్‌గా 23 కోట్లు చేరినట్లు సమాచారం. ఇక 10వ రోజు వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కొంత తగ్గినా, ఆ రోజు గ్రాస్ సుమారు 1 కోటి రూపాయల వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కల ప్రకారం 10 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ 20–20.5 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్ 25 కోట్లు దాటే అవకాశముందని అంచనా.
మరోవైపు, నిర్మాతల లెక్కల ప్రకారం “కే ర్యాంప్” కేవలం మూడు రోజుల్లోనే 17.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించిందని, ఏడు రోజుల్లోనే 28 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించిందని నిర్మాతలు వెల్లడించారు. మొత్తానికి, కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమా.. ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.
కే ర్యాంప్ ఓటీటీ రిలీజ్
ఇక ఈమూవీని ఓటీటీలో చూడాలని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే కే ర్యాంప్ మూవీ ఓటీటీ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నాలుగు వారాల తరువాతే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేసే అవకాశం ఉంది. అయితే ఈసినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈసినిమాను ఆహా వారు కొనుగోలు చేసినట్టు సమాచారం. నవంబర్ మూడో వారంలో ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.