MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 5 లక్షల డ్రెస్ లో అద్భుతం చేసిన అతిలోక సుందరి, స్టార్ హీరోయిన్ వింటేజ్ లుక్ పై సెబ్రెటీల కామెంట్స్?

5 లక్షల డ్రెస్ లో అద్భుతం చేసిన అతిలోక సుందరి, స్టార్ హీరోయిన్ వింటేజ్ లుక్ పై సెబ్రెటీల కామెంట్స్?

5 లక్షలు విలువ చేసే డ్రెస్ లో అదరగొట్టింది జూనియర్ అతిలోక సుందరి. వింటేజ్ అవతారంలో అద్భుతం చేసిన హీరోయిన్ ను చూసి.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 28 2025, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫ్యాషన్ ప్రపంచంలో అద్భుతాలు
Image Credit : Asianet News

ఫ్యాషన్ ప్రపంచంలో అద్భుతాలు

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. ముఖ్యంగా హీరోయిన్లు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ లో కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ.. జూనియర్ అతిలోక సందరి జాన్వీ కపూర్ 5 లక్షల విలువైనర డ్రెస్ తో అద్భుతం చేసింది. జాన్వీ కపూర్ ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ కొత్త ట్రెండ్స్ సృష్టిస్తుంటుంది. తాజాగో మరోసారి ఆమె ఒక వింటేజ్ డ్రెస్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. పరిస్థితికి తగ్గట్టుగా ఫ్యాషన్ ను మర్చుతూ వస్తుంది జాన్వీ కపూర్.. 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' సినిమా ప్రమోషన్స్‌లో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన జాన్వీ, అంతే సులభంగా వింటేజ్, బోల్డ్ లుక్ లోకి మారిపోగలదు. రీసెంట్ గా జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్ లో బ్రాండ్ వింటేజ్ డ్రెస్‌లో మెరిసింది జాన్వీ కపూర్.. ఈవెంట్ కు తగ్గట్టు రెడీ అవుతూ ఉంటుంది.

25
ప్రింటెడ్ మినీ డ్రెస్‌లో జాన్వీ కపూర్
Image Credit : Instagram

ప్రింటెడ్ మినీ డ్రెస్‌లో జాన్వీ కపూర్

ఇక తాజాగా పసుపు రంగు ప్రింటెడ్ మినీ డ్రెస్‌లో జాన్వీ కపూర్ అదరగొట్టింది. చాలా కాలం నాటి పాత ఫ్యాషన్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ కు కనువిందు చేసింది. జాన్వీ కపూర్ ధరించిన ఈ ప్రత్యేక డ్రెస్, రాబర్టో కవాలి 2003 స్ప్రింగ్ రెడీ-టు-వేర్ (RTW) కలెక్షన్‌లోని వింటేజ్ చైనోసరీ చియోంగ్‌సామ్ సిల్క్. ఎల్లె కలెర్ మినీ డ్రెస్ పై పక్షులు, పూల డిజైన్లను కలిగి ఉంది. క్యాప్ స్లీవ్స్, మాండరిన్ కాలర్, ముందు భాగంలో కట్ అవుట్ డిజైన్, ఫ్లేర్డ్ స్కర్ట్ దీని ప్రత్యేకతలు. జాన్వీ కపూర్‌కు స్టైలిస్ట్ సాన్యా కపూర్ ఈ డ్రెస్‌ను ఎంపిక చేశారు. తక్కువ మేకప్, పింక్ లిప్స్, సున్నితంగా లైన్ చేసిన కళ్ళు, మృదువైన బుగ్గలు, వదిలేసిన అలల జుట్టుతో జాన్వీ కపూర్ మరింత అందంగా కనిపించారు.

Related Articles

Related image1
బాక్సాఫీస్ దగ్గర రష్మిక మందన్న రచ్చ, 100 కోట్ల చేరువలో థామా సినిమా కలెక్షన్స్
Related image2
బాలయ్య కోసం రెమ్యునరేషన్ తగ్గించిన నయనతార, ఎన్ని కోట్లు తీసుకోనుందంటే ?
35
5 లక్షల డ్రెస్ లో అతిలోక సుందరి
Image Credit : Instagram

5 లక్షల డ్రెస్ లో అతిలోక సుందరి

జాన్వీ కపూర్ ధరించిన ఈ చారిత్రాత్మక వింటేజ్ డ్రెస్ ధర సుమారు 3.89 లక్షల రూపాయలు నుండి సుమారు 7.06 లక్షల రూపాయలు వరకు ఉండొచ్చని అంచనా. యూకేకి చెందిన ఒక వెబ్‌సైట్ ఈ డ్రెస్ ధరను 5,39,646.30 రూపాయలుగా పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. అబ్బా! ఒక డ్రెస్‌కు ఇంత ధరా అని ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకూ నెట్టింట రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.

45
యెల్లో బార్బీ అంటూ కామెంట్స్
Image Credit : Instagram

యెల్లో బార్బీ అంటూ కామెంట్స్

జాన్వీ కపూర్ వింటేజ్ ఫ్యాషన్ మూమెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే రకరకాల కామెంట్లతో బాక్స్ నిండిపోయింది. జాన్వీతో నటిచిన సహనటులు, అభిమానుల నుండి చాలా ప్రశంసలు, కామెంట్లు వచ్చాయి. హీరో వరుణ్ ధావన్ "బెస్ట్" అని కామెంట్ చేయగా.. అనుషా దండేకర్ "స్టన్నింగ్" అని కామెంట్ చేసింది. సబా ఖాన్ పటౌడీ హార్ట్ ఎమోజీలను పెట్టారు. మరో వైపు అభిమానులు కూడా రకరకాల కామెంట్స్ రాస్తున్నారు. ఒక అభిమాని, “అభినందనలు….. మీ పని పట్ల చాలా గర్వంగా ఉంది. శ్రీదేవి మేడమ్ ఖచ్చితంగా మీ గురించి గర్వపడతారు” అని రాశారు. మరికొందరు ఆమెను "యెల్లో బార్బీ" అని పిలిచారు. కొంతమంది ఫ్యాషన్ ప్రియులు జాన్వీ కపూర్ ను మెచ్చుకుంటూ, "లవ్ యూ జాన్వీ కానీ మీరు చైనీస్ డ్రెస్‌లో ఉన్నారు. అసలు డ్రెస్‌ను చియోంగ్‌సామ్ అంటారు" అని కామెంట్ చేశారు.

55
జాన్వీ కపూర్ సినిమాల అప్ డేట్స్
Image Credit : Instagram

జాన్వీ కపూర్ సినిమాల అప్ డేట్స్

జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే, ఈ ఏడాది శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో 'సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి' చిత్రంలో రోహిత్ సరాఫ్, వరుణ్ ధావన్, సాన్యా మల్హోత్రాతో కలిసి నటించారు.ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వాలతో 'హోమ్‌బౌండ్', సిద్ధార్థ్ మల్హోత్రాతో 'పరమ్ సుందరి' సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ నటించారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో 'పెద్ది' సినిమాల్ నటిస్తోంది జాన్వీ.. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జాన్వీ కపూర్
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: స్టార్‌ హీరోయిన్‌కి సెట్‌లోనే నో చెప్పిన శోభన్‌ బాబు.. హీరోయిన్ల విషయంలో ఇంత స్టిక్ట్ గానా?
Recommended image2
చిరంజీవి సినిమాతో టాప్ లోకి దూసుకెళ్లిన క్రేజీ హీరోయిన్.. నెక్స్ట్ ఛాన్స్ ఆమెదే, టాప్ 6 నటీమణులు వీళ్ళే
Recommended image3
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
Related Stories
Recommended image1
బాక్సాఫీస్ దగ్గర రష్మిక మందన్న రచ్చ, 100 కోట్ల చేరువలో థామా సినిమా కలెక్షన్స్
Recommended image2
బాలయ్య కోసం రెమ్యునరేషన్ తగ్గించిన నయనతార, ఎన్ని కోట్లు తీసుకోనుందంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved