- Home
- Entertainment
- Karthika Deepam: శౌర్యను ఇంటికి తీసుకెళ్లిన సౌందర్య, హిమ.. శోభ చెంప పగలగొట్టిన జ్వాల!
Karthika Deepam: శౌర్యను ఇంటికి తీసుకెళ్లిన సౌందర్య, హిమ.. శోభ చెంప పగలగొట్టిన జ్వాల!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 11 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ లో హిమ(hima) ఇంట్లోకి రమ్మని చెప్పి సౌర్యని ఎంత బ్రతిమలాడినా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు హిమ ఎమోషనల్ అవుతూ ఇంట్లోకి వెళ్ళి కార్తీక్,దీప ల ఫోటో ముందు నిల్చోని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య(soundarya),ఆనంద్ రావ్ లు ఏమి జరిగింది అని అడుగుతున్నా హిమ ఏం చెప్పకుండా కుమిలిపోతూ ఉంటుంది.
అప్పుడు హిమ, సౌందర్యను హత్తుకుని సౌర్య(sourya)ఎంత చెప్పినా రాను అంటుంది నానమ్మ ఎంత చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు అని అనడంతో వెంటనే సౌందర్య,ఆనంద్ రావ్ లు ధైర్యం చెప్పడానికి ప్రయత్నించగా అప్పుడు హిమ లేదు తాతయ్య ఇంటి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది అనడంతో వాళ్లు బాధపడుతూ ఉంటారు. మరొకవైపు శోభ(shobha) జ్వాలా దగ్గరికి వెళ్ళి జ్వాలాను వెంటకారంగా మాట్లాడుతుంది.
అప్పుడు శోభ, సౌర్య అని పిలుస్తూ నీకు తెలియని ఒక విషయం చెబుతాను అని అంటుంది. నువ్వు సౌర్య(sourya)అన్న విషయం హిమకు బ్లడ్ క్యాంపు లో తెలిసింది అనడంతో జ్వాల షాక్ అవుతుంది. అప్పుడు జ్వాలా అయిపోయిందా అని అనగా వెంటనే శోభ లేదు ఇంకొక విషయం ఉంది అని చెబుతూ నువ్వు మీ డాక్టర్ సాబ్ ని ప్రేమిస్తున్నావు అని తెలుసుకున్న హిమ(hima) నిన్ను డాక్టర్ సాబ్ నుంచి దూరం చేయాలి అని తనకు కాన్సర్ ఉంది అని చెప్పి, రెండు నెలలు మాత్రమే బతుకుతాను అని చెప్పి అందరిని నమ్మించి డాక్టర్ సాబ్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించింది అని అంటుంది శోభ.
దాంతో సౌర్య(sourya) మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు శోభ, జ్వాలా ని మరింత రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉండగా అప్పుడు జ్వాలా కోపంతో శోభ చెంప చెల్లు మనిపిస్తుంది. నా ప్రేమ, నా కోపం నా పగ నా ఇష్టం నువ్వు ఇలాంటి సలహాలు ఇవ్వకు అని శోభ(shobha)కు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జ్వాల. మరొకవైపు హిమ భోజనం చేయకుండా తినకుండా ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడు పదే పదే సౌర్య(sourya) గురించి తలచుకొని బాధపడుతూ సౌర్య దగ్గరికి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతుంది. మరొకవైపు సౌర్య, శోభ అన్న మాటలు తలచుకుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జ్వరం రావడంతో పడకుంటుంది జ్వాలా. మరొకవైపు శోభ(shobha), సౌర్య కొట్టిన చెంప దెబ్బను తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు సౌర్య జ్వరంతో పడుకుని ఉండగా ఇంద్రమ్మ సేవలు చేస్తూ ఉంటుంది.
అప్పుడు ఇంద్రమ్మ(Indramma)దంపతులు సౌర్య పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇంతలొనే హిమ అక్కడికి వచ్చి సౌర్య పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హిమ అంబులెన్స్ కీ కాల్ చేస్తుంది. ఆ తరువాత జ్వాలా కళ్ళు తెరిచి చూసేసరికి సౌందర్య (soundarya)ఇంట్లో ఉండటం చూసి ఆశ్చర్య పోతుంది. నిద్ర లేచిన సౌజన్య అసలు తనకి ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది.