- Home
- Entertainment
- Karthika Deepam: శౌర్య కోసం పోలీసులను రంగంలోకి దించిన సౌందర్య.. ఎంట్రీ ఇచ్చిన విలన్ క్యారెక్టర్!
Karthika Deepam: శౌర్య కోసం పోలీసులను రంగంలోకి దించిన సౌందర్య.. ఎంట్రీ ఇచ్చిన విలన్ క్యారెక్టర్!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సౌర్య (Sourya) సౌందర్య కు ఫోన్ చేసి నానమ్మ నేను సౌర్యను అని చెబుతుంది. దాంతో సౌందర్య (Soundarya) ఎక్కడున్నావే చెప్పమంటూ ఆనందపడుతుంది. కానీ సౌర్య ఫోన్ కట్ చేసి స్విచ్ఆఫ్ చేస్తుంది. ఇక సౌందర్య ఈ విషయాన్ని హిమకి పంచుకుంటుంది.
కానీ హిమ (Hima) స్టన్ అవుతుంది. ఇక సౌందర్య (Soundarya) ఈ విషయాన్ని స్వప్నకు చెబుతుంది. దాంతో సప్న నా కొడుకును నాకు వదిలేసి నీ మనవరాలిని వెతికే ప్రయత్నం చేయండి అని అంటుంది. ఇక హిమ సౌర్య ఫోన్ వెనుక స్వప్న అత్త కుట్ర ఏమైనా ఉందా అని ఆలోచిస్తుంది. సౌర్య రేపటి నుంచి వెతుకుతారో లేదో చూడాలి అనుకుంటుంది.
తర్వాత సౌందర్య (Soundarya) ఈ విషయం గురించి పోలీసులతో మాట్లాడుతూ ఉండగా సౌర్య అది గమనించి అక్కడికి వెళుతుంది. ఇక సౌందర్య ఎవరు నువ్వు నన్ను ఫాలో చేయమని ఎవరైనా నీకు డబ్బు ఇస్తున్నారా? అని అడుగుతుంది. ఆ మాటతో సౌర్య (Sourya) ఎం చెప్పాలో అర్థం కాకుండా ఉంటుంది.
మరోవైపు ఇంద్రుడు (Indrudu), చంద్రమ్మ లు ఇంటి లెక్కల విషయంలో గొడవలు పడుతూ ఉంటారు. ఈలోగా అక్కడకు హిమ వెళుతుంది. మా ఇద్దరికీ టిఫిన్ పెట్టు ఆకలి వేస్తుంది అని సౌర్య చంద్రమ్మ తో అంటుంది. మరోవైపు నిరూపమ్ హిమ (Hima) తనకు క్షమాపణలు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తాడు.
ఈలోగా అక్కడకు స్వప్న (Swapna) వచ్చి ఏమి ఆలోచిస్తున్నావు అర్థమవుతుందా నీకు అంత మంది ముందు నిన్ను రిజెక్ట్ చేసింది. దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. అది కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా ఉండాలి అని స్వప్న నిరూపమ్ (Nirupam) కు నానా రకాలుగా ధైర్యం చెబుతుంది.
ఇక తరువాయి భాగంలో హిమ (Hima), సౌర్య లు కారులో వెళుతూ ఉంటారు. ఈలోపు ఎదురుగా ఒక కారులో నుంచి ఒక ఆమె దిగి హిమను చెంప మీద గట్టిగా కొడుతుంది. దానితో సౌర్య (Sourya) ఆమెను రెండుసార్లు చెంప మీద గట్టిగా ఇస్తుంది. దాంతో ఆమె నేనెవరో ఏంటో త్వరలోనే చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.