- Home
- Entertainment
- Ashu Reddy:బోల్డ్ నెస్ లో హద్దులు దాటేస్తున్న జూనియర్ సమంత... ఆషురెడ్డి అందాల దాడికి సోషల్ మీడియా షేక్
Ashu Reddy:బోల్డ్ నెస్ లో హద్దులు దాటేస్తున్న జూనియర్ సమంత... ఆషురెడ్డి అందాల దాడికి సోషల్ మీడియా షేక్
జూనియర్ సమంత(Junior Samantha)గా పాపులారిటీ తెచ్చుకున్న ఆషురెడ్డి బిగ్ బాస్ షోతో మరింత ఫేమస్ అయ్యారు. ఆ షో తర్వాత ఆమె బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. అనేక కామెడీ షోల్లో ఆమె కనిపించి సందడి చేస్తున్నారు. దీంతో టెలివిజన్ ఆడియన్స్ లో ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

ఇక ఆషు (Ashu Reddy)సోషల్ మీడియా ఫోటో షూట్స్ సంచలనం రేపుతున్నాయి. బ్రేక్ లేకుండా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ నెటిజెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అసలు అందాల ప్రదర్శనలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
ఆషు తీరుకు గ్లామర్ ఆరాధకులు ఫిదా అవుతున్నారు.సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ఇంస్టాగ్రామ్ లో మనల్ని అనుసరించే వారి సంఖ్యను బట్టి బ్రాండ్ వాల్యూ ఉంటుంది.
పలు సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నాయి. స్టార్ హీరోయిన్స్ కూడా ఈ సైడ్ బిజినెస్ కి అలవాటు పడ్డారు. ఆషు లాంటి చిన్నా చితకా బుల్లితెర భామలకు ఇది పెద్ద అవకాశమన్న మాట.
అందుకే మొహమాటం లేకుండా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. అలాగే ఆషు చర్యలు కూడా చాలా బోల్డ్ అని చెప్పాలి. ఈ మధ్య ఓ షోలో యాంకర్ అరియానా నడుముపై ముద్దు పెట్టింది. ఈ ఇద్దరి తెగింపుకు జనాలు షాక్ అయ్యారు. కొందరైతే తిట్టిపోశారు. కామెంట్స్ పట్టించుకోకుండా పాపులారిటీకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఓ బోల్డ్ వీడియో చేసింది. ఊహించినట్లే వర్మ అస్సలు సిగ్గుపడకుండా ఆషు బాడీపై పచ్చి కామెంట్స్ చేశారు. ఆ వీడియో అనుకున్నంత ఫేమస్ కాకపోవడం ఆమె బ్యాడ్ లక్.
పవన్ (Pawan Kalyan)కి నాలుగులో భార్యను అవుతా అంటూ ఆషు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యింది. అయితే నేను అలా అనలేదు, వక్రీకరించారని మరలా రివర్స్ గేర్ వేసింది. ఈ వివాదంలో కూడా ఆషు వ్యవహారంపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. పాపులారిటీ కోసం ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం సరి కాదంటున్నారు.
అలాగే ప్రాంక్ వీడియో అంటూ తల్లి చేతిలో తన్నులు తిండి. ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ తల్లికి షాక్ ఇచ్చింది. సదరు వీడియోలో ఆషు తల్లి ఆమెను కొడుతుంది. ఇలాంటి చెత్త ట్రిక్స్ లో ఆషు ఫేమస్ కావాలని కోరుకోవడం విచారకరం.
ఎన్ని చేస్తున్నా ఆషుకు ఆశించిన పాపులారిటీ ఇమేజ్ రావడం లేదు. ఆమె బిగ్ బాస్ జర్నీ కూడా సవ్యంగా సాగలేదు. చాలా తక్కువ రోజులకే ఇంటి బాట పట్టారు. బుల్లితెరపై కనీసం స్టార్ హోదా తెచ్చుకుందామనుకుంటున్న ఆమె ఆశలు తీరడం లేదు.