ఎన్టీఆర్ ఆ 6 బ్లాక్ బస్టర్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
స్టార్ హీరోలు అయినా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తుంటారు. తమ దగ్గరకు వచ్చిన కథలను విని ఇవి తమకు సెట్ అవ్వవులే, హిట్ కథ కాదులే అని వదిలేస్తుంటారు. కాన ఆ సినిమాలే తరువాత తరువాత వేరే హీరోలతో చేసి సూపర్ హిట్ అవుతుంటాయి. అలా చాలా మంది హీరోలు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారు. అందులో ఎన్టీఆర్ కూడా ఒకరు.
కథల విషయంలో పర్ఫెక్ట్ గా ఆలోచిస్తాడు తారక్. కాని ఎంత తెలివి ఉన్నవారు అయినా.. ఎదో ఒక టైమ్ లో అంచనాలు తప్పుుతార. ఎన్టీఆర్ కూడా అలానే అంచనాలు తప్పి వదిలేసుకున్న 6 కథలు సూపర్ హిట్ సినిమాలుగా తెరకెక్కాయి. ఇక ఎన్టీఆర్ వద్దనుకుని. వేరే హీరోలు నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆరు సినిమాల గురించి చూద్దాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో చాలా కథలను రిజెక్ట్ చేశారు. అందులో మేజర్ పార్ట్ కథలు ఇతర హీరోలతో సినిమాలుగా రూపొంది బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అందులో ముందుగా చెప్పాలి అంటే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ, ఇలియాన హీరో హీరోయిన్లు నటించిన కిక్ సినిమా గురింరచి చప్పాలి. ఈ కథ ముందు తారక్ దగ్గరకు వెళ్ళింది. కాని ఈ కథ ఆ బాడీ లాంగ్వేజ్ తనకు సెట్ అవ్వదు అనుకున్నాడట. అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
అంతే కాదు సుకుమార్ డైరెక్టర్ గా అల్లు అర్జున్ కు హీరోగా లైఫ్ ఇచ్చిన సినిమా ఆర్య. ఈ మూవీ ఎంత సక్సెస్ అయ్యింతో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న తారక్ కు సుకుమార్ ఈ కథ వినిపించాడట. కానీ ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఆఫర్ బన్నీకి వెళ్లింది. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ నే మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాతే బన్నీ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక తమిళ యంగ్ స్టార్ సిద్ధార్థ్ కు తెలుగులో మంచి లైఫ్ ఇచ్చిన సినిమా బోమ్మరిల్లు.. జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అప్పట్లో. అయితే ఈసినిమా కథతో భాస్కర్ ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళాడట. ఎందుకో ఏమో తారక్ ఈ కథ విని మెచ్చాట కాని డేట్స్ సర్ధుబాటు అవ్వక ఈసినిమాను వదులుకున్నారట తారక్. దాంతో సిద్థార్థ్ తో మూవీ చేసి.. బొమ్మరిల్లునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు భాస్కర్.
నితిన్ హీరోగా తెరకెక్కిన దిల్ సినిమా కథ కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరకే వెళ్ళిందట. ఈ సినిమాతోనే నిర్మాత రాజుకు దిల్ రాజు అనే పేరు స్థిరపడిపోయింది. ఇక సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కథను డైరెక్టర్ వినాయక్ తారక్ తో చేయాలని ఫిక్స్ అయ్యాడట. కాని ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. చివరికి జయం సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన నితిన్ తో సినిమా చేసి. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నితిన్.
ఇక ఎన్టీఆర్ రిజక్ట్ చేసిన మరో సినిమా కూడా మాస్ మహారాజ్ రవితేజనే చేసి సూపర్ హిట్ కొట్టాడు. రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమా అటు బోయపాటికి.. ఇటు రవితేజకు ఎంత మాస్ ఇమేజ్ తెచ్చిందో తెలిసిందే.. ఇక ఈ సినిమా కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లగా.. ఆయన చేయనని చెప్పాడట.. దాంతో ఈ సినిమా రవితేజ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
నాగార్జున కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఊపిరి. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్కెస్ సాధించిన ఈ సినిమా ను ముందు ఎన్టీఆర్ ను చేయమని అడిగాడట.. ఈ సినిమాలో కార్తీ పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదించారు. కానీ కార్తీ పాత్రలో ఎన్టీఆర్ చేస్తే.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న అనుమానంతో ఈమూవీని తారక్ రిజెక్ట్ చేశాడట. దాంతో ఆఫర్ కార్తీ వద్దకు వెళ్ళింది. ఇలా తారక్ మరికొన్ని సినిమాలు కూడా రిజక్ట్ చేశాడు. తనకు ఆ కథ సూట్ అవ్వదు అనుకుంటే.. ఆ కథకు సూట్ అయ్యే హీరోలను రికమండ్ కూడా చేస్తాడట ఎన్టీఆర్.