MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నోరు జారిన జూనియర్ ఎన్టీఆర్, అనాలోచిత కామెంట్స్ తో విమర్శలపాలు!

నోరు జారిన జూనియర్ ఎన్టీఆర్, అనాలోచిత కామెంట్స్ తో విమర్శలపాలు!

సక్సెస్ కిక్ లో నోరు జారిన జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనాలోచిత కామెంట్స్ తో విమర్శల పాలయ్యాడు. ఇంతకీ ఎన్టీఆర్ ఏమని నోరు జారాడు? 

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 18 2024, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR

NTR

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికి వయసు 18 ఏళ్ళ లోపే. ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని 2001లో విడుదలైంది. అదే ఏడాది స్టూడెంట్ నెంబర్ వన్, సుబ్బు చిత్రాల్లో ఎన్టీఆర్ నటించాడు. రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్. సుబ్బు మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. తన డాన్సులతో ఎన్టీఆర్ ప్రేక్షకుల అటెన్షన్ పొందాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2002లో విడుదలైన ఆది మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇరవై ఏళ్ళు నిండకుండానే ఎన్టీఆర్ మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక సింహాద్రి మూవీతో ఎన్టీఆర్ ఇమేజ్ పీక్స్ కి చేరింది. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ ని స్టార్ హీరోల సరసన చేర్చింది. ఈ మూవీ విడుదల తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వివాదాస్పదం అయ్యింది. 

 

36

లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ని చిరంజీవి గురించి యాంకర్ అడిగారు. టాప్ స్టార్ గా ఉన్న చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏమిటంటే.. చిరంజీవి ఎవరు? నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ మా తాతయ్య మాత్రమే అన్నాడు. అది లైవ్ షో కావడంతో నేరుగా ఎన్టీఆర్ కామెంట్స్ ప్రసారం అయ్యాయి. సక్సెస్ కిక్ లో ఉన్న ఎన్టీఆర్ పొగరుగా మాట్లాడటం వివాదాస్పదం అయ్యింది. 

46

వెంటనే ఎన్టీఆర్ కి నాగార్జున నుండి కాల్ వచ్చిందట. నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? నీ కంటే పెద్దవాళ్ళ గురించి అంతేనా మాట్లాడేది అని నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఆ వయసులో ఎన్టీఆర్ కి తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు. అయితే తర్వాత ఆయన పశ్చాత్తాపానికి గురయ్యాడు. తెలియని ప్రాయంలో చేసిన అనాలోచిత కామెంట్స్ అని ఆయన ఒప్పుకున్నారు. 

సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆంధ్రావాలా డిజాస్టర్ అయ్యింది. సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ... ఒక్క చిత్రం కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు. రంగంలోకి దిగిన రాజమౌళి యమదొంగ మూవీతో ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చాడు. 

56
NTR - Chiranjeevi

NTR - Chiranjeevi

కాలక్రమేణా ఎన్టీఆర్ లో గొప్ప మెచ్యూరిటీ వచ్చింది. ఆయన మాట తీరు మారిపోయింది. ఎన్టీఆర్ మాటలు చాలా పరిపక్వతతో కూడి ఉంటాయి. ఎలాంటి కాంట్రవర్సీకి తావు లేకుండా అర్ధవంతంగా మాట్లాడతారు. సినిమా వేదికల్లో కూడా ఎన్టీఆర్ స్పీచ్ లు అద్భుతంగా ఉంటాయి. తడబడకుండా అనర్గళంగా మాట్లాడతాడు. అనుభవాల నుండి ఎన్టీఆర్ అలా పాఠాలు నేర్చుకున్నాడు.

 

66

అయితే నందమూరి హరికృష్ణ అంటే నాగార్జునకు చాలా ఇష్టమట. ఒకసారి ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు? షోకి గెస్ట్ గా వచ్చాడు. హోస్ట్ గా ఉన్న నాగార్జున ఈ విషయాన్ని ఎన్టీఆర్ తో పంచుకున్నాడు. ఎన్టీఆర్-నాగ్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Recommended image3
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved