- Home
- Entertainment
- 4000 కోట్లకు పైగా ఆస్తులు, స్టార్ హీరోలను మించి సంపాదన, ఇండియాలో రిచ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
4000 కోట్లకు పైగా ఆస్తులు, స్టార్ హీరోలను మించి సంపాదన, ఇండియాలో రిచ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న నటి, 4000 కోట్లకు పైగా ఆస్తి, రకరకాల బిజినెస్ లు, స్టార్ హీరోలను మించి సంపాదిస్తున్న తార ఎవరో తెలుసా?

ఇండియాలోనే రిచ్ హీరోయిన్
ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన జూహీ చావ్లా ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక ఆస్తులున్న నటిగా గుర్తింపు పొందారు. 1984లో మిస్ ఇండియా కిరీటం గెలిచిన జూహీ, సినిమాల్లోకి ప్రవేశించి అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా ఎదిగారు. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా, అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు జూహీ. అంతే కాదు సినిమాల కంటే కూడా రకరకాల బిజినెస్ లలో ఆమె యాక్టీవ్ గా ఉంటున్నారు. రకరకాల పెట్టుబడుల వల్ల చేతినిండా సంపాదిస్తున్నారు.
హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ
మోడల్ గా కొనసాగుతూ.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత జూహీ చావ్లా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. జూహీ 1986లో ధర్మేంద్ర, శ్రీదేవి, సన్నీ డియోల్ నటించిన సుల్తానత్ అనే సినిమాతో బిగ్ స్క్రీన్‌పై అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1988లో అమీర్ ఖాన్‌తో కలిసి నటించిన ఖయామత్ సె ఖయామత్ తక్ సినిమా జూహీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఈసినిమా తరువాత ఆమె బాలీవుడ్‌లో వరుస విజయాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు.
స్టార్ డమ్ తెచ్చిన సినిమా?
సుల్తానత్ తర్వాత రెండేళ్ల వరకూ ఆమెకు అవకాశాలు లేవు, ఈక్రమంలో ఆమీర్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్ మూవీ ఖయామత్ సె ఖయామత్ తక్‌లో జూహీ నటించారు. ఈ సినిమా జూహీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆమీర్ ఖాన్ ను కూడా హీరోగా నిలబెట్టింది ఈ సినిమా. ఇక ఈసినిమా తరువాత జూహీ వరుసగా లూథేరే, ఐనా, దర్, హమ్ హై రాహీ ప్యార్ కే, ఇష్క్, దీవానా మస్తానా, యేస్ బాస్ లాంటి హిట్ సినిమాలెన్నో చేసింది. . హిందీతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా జూహీ నటించారు.
నాగార్జున జోడీగా టాలీవుడ్ సినిమా
బాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది జూహీ చావ్లా. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. మలయాళంలో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ హీరోయిన్, తెలుగులో నాగార్జున సరసన రెండు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో కలియుగ కర్ణుడు సినిమాతో పాటు నాగార్జున జోడీగా విక్కీ దాదా సినిమాలో హీరోయిన్ గా నటించింది జూహీ.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జూహీ చావ్లా
హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత క్యారెక్టర్ రోల్స్ చేయడం స్టార్ట్ చేసింది జూహీ చావ్లా. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేసింది జూహీ. 2000 తర్వాత జూహీ మంచి మంచి కథలతో కూడిన చిత్రాల్లో నటించడానికి మొగ్గు చూపింది. ఝంకార్ బీట్స్ (2003), 3 దీవారిన్ (2003), మై బ్రదర్ నిఖిల్ (2005), ఐ యామ్ (2011), గులాబ్ గ్యాంగ్ (2014) సినిమాల ద్వారా ఆమె నటనకు మంచి పేరు వచ్చింది.
షారుక్ ఖాన్ తో కలిసి బిజినెస్
సినిమాలతో బాగా సంపాదించిన జూహీ చావ్లా, సినిమాల నుంచి వచ్చిన డబ్బుతో కొన్ని వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెట్టిందిు. పెట్టుబడులతో పాటు జూహీ డైరెక్ట్ గా కొన్ని వ్యాపారాలలో కూడా అడుగుపెట్టింది. షారుఖ్ ఖాన్‌తో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీకి కో-ఫౌండర్‌గా ఉన్నారు. అంతేకాకుండా, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్కి కో-ఓనర్ కూడా. రియల్ ఎస్టేట్, రెస్టారెంట్ బిజినెస్‌లలోనూ ఆమె పెట్టుబడులు పెట్టారు.
వేల కోట్ల ఆస్తి, భర్త పిల్లలు
జూహీ చావ్లా భర్త జై మెహతాతో కలిసి ముంబై, పోర్‌బందర్ ప్రాంతాల్లో లగ్జరీ ఇళ్లు కలిగి ఉన్నారు. ముంబైలో గుస్టోసో, డు లిబాన్ వంటి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు కూడా వారి పేరుమీద ఉన్నాయి.కొన్ని నివేదికల ప్రకారం 2024 నాటికి జూహీ చావ్లా ఆస్తుల విలువ సుమారు 4,600 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాల్లో దూసుకెళ్లిన ఆమె ఇప్పుడు బిజినెస్ రంగంలోనూ అగ్రస్థానంలో ఉన్నారు. భర్త పిల్లలను చూసుకుంటూనే ఆమె వ్యాపార రంగంలో రాణిస్తున్నారు, అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ మేరకు ఆమె ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలను మించి సంపాదిస్తోంది.