- Home
- Entertainment
- ఎన్టీఆర్ రొమాన్స్ చేయాలనుకున్న సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా? శ్రీదేవి, సావిత్రి కాదు
ఎన్టీఆర్ రొమాన్స్ చేయాలనుకున్న సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా? శ్రీదేవి, సావిత్రి కాదు
జూ ఎన్టీఆర్ తన మనసులో మాటని వెల్లడించారు. అలనాటి హీరోయిన్లలో ఎవరితో రొమాన్స్ చేయాలని ఉందంటే ఓ క్రేజీ హీరోయిన్ పేరుని చెప్పారు. మరి ఆమె ఎవరంటే?

jr ntr
జూ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు మనవడిగా, నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. బాల నటుడిగానే అదరగొట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తారక్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
Sridevi
ఎన్టీఆర్ తనకు ఇష్టమైన అలనాటి హీరోయిన్ ఎవరో తెలిపారు. అందరిలాగే శ్రీదేవి ఇష్టమని తెలిపారు. ఫేవరేట్ యాక్టర్ తాతగారు ఎన్టీఆర్ అని, హీరోయిన్ శ్రీదేవి అని చెప్పారు. జయప్రదతో గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు జూ ఎన్టీఆర్.
jr ntr
ఈ సందర్భంగా జయప్రద ఒక క్రేజీ ప్రశ్న అడిగింది. అలనాటి హీరోయిన్లలో నటించాల్సి వస్తే ఎవరితో నటిస్తారు అని అడిగారు జయప్రద. ఈ సందర్బంగా వాణిశ్రీ, జయలలిత పేర్లు చెప్పారు. మొదట ఇద్దరితోనూ చేయాలని ఉందని చెప్పిన ఆయన ఆ తర్వాత ఒక పేరునే తీసుకోవాలని చెప్పగా, జయలలితతో రొమాన్స్ చేయాలనుందని చెప్పారు.
jayalalitha movies
జయలలిత నటించిన చాలా సినిమాలు చూశానని, తాతగారితో చేసిన `దేవుడు చేసిన మనుషులు` సినిమాలో ఆమె చాలా అందంగా ఉంటుంది. చాలా బ్యూటీఫుల్‌గా ఉంటుందని చెప్పారు తారక్. మొత్తంగా జయలలితతో రొమాన్స్ కి రెడీ అని చెప్పడం విశేషం.
Junior NTR
ఎన్టీఆర్ చివరగా `దేవర` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. దీనికి `డ్రాగన్` అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీంతోపాటు హిందీలోకి ఎంట్రీ ఇచ్చి `వార్ 2`లో హృతిక్ రోషన్‌తో కలిసి నటించారు. ఈ మూవీ ఆగస్ట్ లో రిలీజ్ కాబోతుంది.