MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..

Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..

దర్శకధీరుడు రాజమౌళి పేరు చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ ఆట ఆడేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జక్కన్నతో పని అంత ఈజీ కాదంటూ హింట్లు కూడా ఇచ్చాడు. ఇంతకీ మహేష్ తో ఎన్టీఆర్ ఏం చెప్పాడంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 17 2026, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ హీరోల మధ్య స్నేహం..
Image Credit : IBTimes

టాలీవుడ్ హీరోల మధ్య స్నేహం..

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య మంచి స్నేహం ఉంది. కొంత మంది తప్పించి.. దాదాపు అందరు చాలా ఆప్యాయంగా ఉంటారు. టాలీవుడ్ యంగ్ హీరోలు, సీనియర్ హీరోలయితే.. కలిసినప్పుడల్లా సరదాగా పంచ్ లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుంతం స్టార్ హీరోలు గా ఉన్న ప్రభాస్ రామ్ చరణ్, రానా, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఫ్రెండ్స్ గా ఉన్న కొంత మంది హీరోలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి రాజమౌళిని ఆటపట్టిస్తుంటారు. రానా రామ్ చరణ్, రానా నాగచైతన్య, ప్రభాస్ గోపీచంద్, అల్లు అర్జున్ ఎన్టీఆర్, ఇలా ఇండస్ట్రీలో అల్లరి చేసే హీరోలు ఎందరో.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సైలెంట్ గా పంచ్ లు వేసే హీరో..
Image Credit : Asianet News

సైలెంట్ గా పంచ్ లు వేసే హీరో..

ఇక టాలీవుడ్ హీరోలలో చాలా సైలెంట్ గా, కామ్ గా కనిపించే మహేష్ బాబులో కూడా కొంటెతనం దాగుందని చాలామందికి తెలియదు. ఆయన వేసే రివర్స్ పంచ్ లు మామూలుగా ఉండవు. సందర్భాన్ని బట్టి ఆయనలో ఓ రైటర్, కమెడియన్, బయటకు వస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో మహేష్ తో మాట్లాడలేక స్టార్స్ కూడా చేతులెత్తేసిన సందర్భాలు ఉన్నాయి. ఈక్రమంలోనే ఓ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మహేష్ బాబును ఓ ఆట ఆడుకున్నాడు. రాజమౌళి పేరు చెప్పి భయపెట్టాడు. మహేష్ బాబు కూడా ఏమాత్రం తగ్గకుండా తారక్ పై పంచ్ ల వర్షం కురిపించాడు.

Related Articles

Related image1
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Related image2
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
35
మహేష్ బాబును ఓ ఆట ఆడేసుకున్న తారక్..
Image Credit : Asianet News

మహేష్ బాబును ఓ ఆట ఆడేసుకున్న తారక్..

గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని తారక్ హోస్ట్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ కు చాలామంది సెలబ్రిటీలు గెస్ట్ లు గా వచ్చారు. ఈక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ ఎపిసోడ్ కు అతిధిగా వచ్చి అలరించారు. ఈక్రమంలో మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య పంచ్ ల ప్రవాహం ఆడియన్స్ ను అలరించింది. మహేష్ బాబు ఫారెన్ టూర్ల గురించి చెపుతూ మహేష్ ను ఓ ఆట ఆడేసుకున్నాడు ఎన్టీఆర్. ఈక్రమంలో క్రికెట్ గురించి ప్రస్తావిస్తూ.. "మనం కూడా ఓ ఆట ఆడుదాం అన్నా'' అంటూ మహేష్ కు ఆఫర్ ఇచ్చాడు తారక్. "ఆడదాం కానీ కార్క్ బాల్ తో వద్దు.. టెన్నిస్ బాల్ తోనో. రబ్బరు బాల్ తోనో ఆడుదాం" అని మహేష్ బాబు అన్నారు.

45
రాజమౌళి పేరు చెప్పి భయపెట్టిన ఎన్టీఆర్..
Image Credit : Asianet News

రాజమౌళి పేరు చెప్పి భయపెట్టిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. జక్కన్నతో సినిమా చేస్తున్నారు కదా.. ఇక అన్ని ఆటలు ఆడేస్తారు లే.. అలవాటు అవుతుంది చిన్నగా.. అంటూ రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టే ప్రయత్నం చేశాడు ఎన్టీఆర్. జక్కన్నతో 4 సినిమాలు చేసిన అనుభవంతో చెపుతున్నా మీకు ఉంటది ఇక నుంచి అని ఎన్టీఆర్ సరదాగా అన్నారు. మీ హార్డ్ వర్క్, రాజమౌళి సినిమాకు బాగా ఉపయోగపడుతుంది. మీరు జక్కన్నతో అద్భుతమైన సినిమా చేయగలరు అని సూపర్ స్టార్ కు కితాబిచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.

55
భారీ అంచనాలతో వారణాసి..
Image Credit : others

భారీ అంచనాలతో వారణాసి..

మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారనాసి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈమూవీ తెరకెక్కుతోంది. మహేష్ బాబును రాజమౌళి సూపర్ హిరోగా చూపించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీని 2027 సమ్మర్ బరిలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాపై అప్ డేట్ రాక చాలా రోజులు అవుతోంది. త్వరలో వారణాసికి సబంధించి విషయాలను రాజమౌళి వెళ్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం. జక్కన్నతో సినిమా అంటే టార్చర్ ఉంటుందని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో వెల్లడించారు. సీన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం ఎన్ని టేకులైనా తీసుకుంటాడు రాజమౌళి. ఈ విషయంలోనే మహేష్ బాబుకు గతంలోనే హింట్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Related Stories
Recommended image1
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Recommended image2
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved