- Home
- Entertainment
- సిగ్గుండాలి మనకు .. ఎన్టీఆర్ నోటి నుంచి దుమారం రేపే మాటలు.. అస్సలు ఊహించలేం.. ఏం జరిగిందంటే?
సిగ్గుండాలి మనకు .. ఎన్టీఆర్ నోటి నుంచి దుమారం రేపే మాటలు.. అస్సలు ఊహించలేం.. ఏం జరిగిందంటే?
ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్. అదే సమయంలో సిస్టమాటిక్ లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. వివాదాలకు దూరంగా ఉండే ఆయన `సిగ్గుండాలి మనకు` అని కామెంట్ చేయడం దుమారం రేపుతుంది.

జూ ఎన్టీఆర్ ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ప్రమేయం లేకుండానే అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమా రంగంలోనూ ఆయన ప్రస్తావన వస్తుంది. తాత సీనియర్ ఎన్టీఆర్ విషయంలోగానీ, తన విసయంలోగానీ ఎప్పుడూ ఏదో ఒక విషయం చర్చకు వస్తుంది. వైరల్ అవుతుంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫలితాల రోజు ట్వీట్ చేయకపోవడంతో తారక్ స్పందిస్తాడా లేడా అనేది ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు తారక్ స్పందించాడు. చంద్రబాబు, పవన్, లోకేష్, మోడీలకు విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.
ఈ నేపథ్యంలో యూట్యూబ్‌లో, ట్విట్టర్లో ఓ వీడియో క్లిప్ చక్కర్లు కొడుతుంది. ఇది ఎన్టీఆర్.. `మీలో ఎవరు కోటీశ్వరులు` షోకి సంబంధించిన వీడియో క్లిప్. ఇందులో ఎన్టీఆర్ షోకి హోస్ట్ చేస్తున్నారు. గుర్రం జాషువాపై ఓ ప్రశ్న వచ్చింది. ఓ ప్రశ్నకి సమాధానం గుర్రం జాషువా. అయితే హాట్ సీట్‌లో ఉన్న కంటెస్టెంట్ సమాధానం చెప్పలేదు. ఎన్టీఆర్‌కి కూడా తెలియదు. దీంతో ఆడియెన్స్ లో ఉన్న ఓ పాప గుర్రం జాషువా అని చెప్పింది. నీకు ఆ సమాధానం తెలుసా అంటే అవును అంది, దానికి సిగ్గుండాలి మనకు అంటూ ఎన్టీఆర్ తలదించుకున్నారు. అవమానకరంగా నవ్వాడు.
ఎనిమిదో తరగతిలో గుర్రం జాషువాపై లెసన్స్ ఉంటాయని, శతక సుధ అని పొయెమ్స్ ఉంటాయని, తెలుగు టీచర్స్ బాగా వివరించి చెబుతారని తెలిపింది ఓ అమ్మాయి. దీనికి తాము సిగ్గుపడాలి అని ఎన్టీఆర్ చెప్పడం షాకిచ్చింది. ఇదిప్పుడు వైరల్ అవుతుంది. తనని తాను తిట్టుకుంటూ, కంటెస్టెంట్‌ని తిడుతూ ఈ కామెంట్ చేశాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఇది నెట్టింట దుమారం రేపుతుంది. రాజకీయ వేడి నెలకొన్న నేపథ్యంలో ఈ వీడియోని రకరకాలుగా వాడుకుంటున్నారు నెటిజన్లు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్ 2` చిత్రం చేస్తున్నారు తారక్. అంతేకాదు ఆగస్ట్ నుంచి ప్రశాంత్ నీల్‌తో చేయాల్సిన మూవీని ప్రారంభించబోతున్నారు తారక్.