MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Adhurs 2: `అదుర్స్ 2` చేయకపోవడానికి కారణం ఏంటో బయటపెట్టిన ఎన్టీఆర్‌.. ఇంత పెద్ద కథ ఉందా?

Adhurs 2: `అదుర్స్ 2` చేయకపోవడానికి కారణం ఏంటో బయటపెట్టిన ఎన్టీఆర్‌.. ఇంత పెద్ద కథ ఉందా?

Jr Ntr: ఎన్టీఆర్‌, వివి వినాయక్‌ కాంబినేషన్‌లో `అదుర్స్` చిత్రం వచ్చి పెద్ద హిట్‌ అయ్యింది. అయితే దీనికి సీక్వెల్‌ని ఎందుకు చేయడం లేదో తాజాగా ఎన్టీఆర్‌ వెల్లడించారు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 05 2025, 06:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
jr ntr, ntr

jr ntr, ntr

Jr Ntr: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గతేడాది `దేవర`తో ఆకట్టుకున్నాడు. త్వరలో `వార్‌ 2`తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. అలాగే ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో మూవీ చేస్తున్నారు.

`దేవర` జపాన్‌లో రిలీజ్‌ అయిన నేపథ్యంలో మొన్నటి వరకు అక్కడ ప్రమోషన్స్ లో పాల్గొని హైదరాబాద్‌ కి వచ్చారు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్‌ మీడియా ముందుకు వచ్చారు. `మ్యాడ్‌ 2` సక్సెస్‌ మీట్‌కి గెస్ట్ గా వచ్చారు. ఇందులో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
adhurs

adhurs

ఎన్టీఆర్‌ చేసిన `అదుర్స్` (2010) సినిమా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. వి వి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తారక్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి కామెడీ రోల్‌, మరోటి సీరియస్‌ రోల్‌. చారిగా ఆయన చేసిన రచ్చ వేరే లెవల్‌. ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా విశేష ఆదరణ పొందింది.

పెద్ద హిట్‌ అయ్యింది. అయితే ఆ మధ్య మళ్లీ `అదుర్స్ 2`సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అప్‌ డేట్‌ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై స్పందించారు ఎన్టీఆర్‌. `అదుర్స్ 2` లేదనే విషయాన్ని స్పష్టం చేశాడు. ఎందుకు చేయడం లేదో తెలిపారు. 
 

35
jr ntr, ntr

jr ntr, ntr

కెమెరా ముందు కామెడీ చేయడం చాలా కష్టమని తెలిపారు ఎన్టీఆర్‌. `మ్యాడ్‌`లో సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్ చేసిన కామెడీని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. రామ్‌ నితిన్‌ని చూస్తుంటే ఒకప్పుడు తనని తాను చూసుకున్నట్టు అనిపిస్తుందన్నారు. ఈ క్రమంలోనే అసలు విషయాన్ని బయటపెట్టారు.

కెమెరా ముందు నిల్చోవడం అంత తేలిక కాదు, మ్యాడ్‌లో రామ్‌ నితిన్‌ అద్బుతంగా నటించాడు. కామెడీ పలికించడం ఒక యాక్టర్‌కి చాలా కష్టం. అందుకే నేను `అదుర్స్ 2` చేయడానికి ఆలోచిస్తున్నాను` అని తెలిపారు ఎన్టీఆర్‌. కామెడీ చేయడానికి భయపడి ఈ మూవీ చేయడం లేదని ఆయన వెల్లడించారు. 
 

45
jr ntr, ntr

jr ntr, ntr

ఈ సందర్భంగా సునీల్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు బ్రహ్మానందం కామెడీ అంటే చాలా ఇష్టమని, ఆ తర్వాత ఎమ్మెస్‌ నారాయాణ, ధర్మవరపు సుబ్రమణ్యంల కామెడీని బాగా ఇష్టపడతానని, వారి తర్వాత సునీల్‌ కామెడీనే ఇష్టమని చెప్పారు.

`భాష మీద పట్టు ఉంది. అలాగే కింద స్థాయి నుంచి ఎదుగుకుంటూ ఇక్కడికి వచ్చాడు. చాలా కాలం తర్వాత సునీల్ కామెడీ చూసి మళ్ళీ నవ్వుకున్నాను. సునీల్ విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. కానీ, నవ్వించడానికే అతను పుట్టాడని నేను నమ్ముతాన`ని చెప్పారు ఎన్టీఆర్‌. 
 

55
Mad Square

Mad Square

`మ్యాడ్‌ 2` సినిమా సక్సెస్‌ గురించి మాట్లాడుతూ, నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు.

ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడు ఇక్కడ. మ్యాడ్ 2 తో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ కి కంగ్రాచులేషన్స్. ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్ గా అంతకంటే గొప్పగా ప్రేక్షకులను రంజింపజేయడం చాలా కష్టం. అది చేసి నిరూపించారు.

ఇందులో లడ్డుగా విష్ణు లేకుంటే ఈసినిమా ఇంత పెద్ద విజయం సాధించేది కాదు. అలాగే సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, నార్నే నితిన్‌, రాజేష్‌, సునీల్‌, మురళీధర్‌ గౌడ్‌ల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఎన్టీఆర్‌. నిర్మాత నాగవంశీని చింటూ ర్యాగింగ్‌ చేశాడు. 

read  more: స్టార్‌ హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్.. సిల్క్ స్మిత పారితోషికం ఎంతో తెలుసా? సమంత, రష్మిక దిగదుడుపే

also read: రాజశేఖర్‌ హీరోగా పనికిరాడు అని మొహం మీదే చెప్పిన నిర్మాత.. కట్‌ చేస్తే ఆయన బ్యానర్‌లోనే బ్లాక్‌ బస్టర్స్
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
JVR: బాలల 'దాన వీర శూర కర్ణ' చిత్ర నిర్మాత మృతి.. టికెట్ బుకింగ్ క్లర్క్ నుంచి ప్రొడ్యూసర్ వరకు ప్రయాణం
Recommended image2
Mahesh Babu: అది వల్గర్ సినిమా అంటున్నారు, అసలు మహేష్ బాబు త్రివిక్రమ్ కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారో తెలుసా ?
Recommended image3
Trivikram Srinivas: హీరోయిన్ కాళ్లపై పడబోయిన త్రివిక్రమ్.. షాక్‌లో శ్రీనిధి.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved