MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్కో పాటకి సిల్క్ స్మిత తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? స్టార్‌ హీరోయిన్లు కూడా ఆమె ముందు జుజూబీ

ఒక్కో పాటకి సిల్క్ స్మిత తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? స్టార్‌ హీరోయిన్లు కూడా ఆమె ముందు జుజూబీ

Silk Smitha: 80వ దశకంలోనే నటి సిల్క్ స్మిత ఐటమ్ డ్యాన్స్ చేయడానికి భారీ పారితోషికం తీసుకునేదట. అది స్టార్‌ హీరోయిన్ల రెమ్యూనరేషన్‌ కంటే ఎక్కువగా ఉండేదట. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 05 2025, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Silk Smitha

Silk Smitha

Silk Smitha: ఆంధ్రలో పుట్టి పెరిగిన నటి సిల్క్ స్మిత. ఈమె అసలు పేరు వడలపట్టి విజయలక్ష్మి. సినిమా ఆమెకు సిల్క్ స్మిత అనే గుర్తింపును ఇచ్చింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ

ఇలా చాలా భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించారు. కుటుంబ పరిస్థితి వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత భర్త, అత్తగారి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Silk Smitha

Silk Smitha

నటి అపర్ణకు టచ్ అప్ ఆర్టిస్ట్ గా తన సినిమా జీవితాన్ని ప్రారంభించిన సిల్క్ స్మితకు 'ఇనయే తేడి' అనే మలయాళ చిత్రం సినిమా అవకాశాన్ని ఇచ్చింది. మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్ సిల్క్ స్మితకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అంతేకాదు ఈస్ట్‌మన్ ఆమెకు స్మిత అని పేరు పెట్టారు.

37
Silk Smitha

Silk Smitha

అయితే, అంతకుముందు తమిళ చిత్ర పరిశ్రమలో విను చక్రవర్తి సిల్క్ స్మితకు మంచి గుర్తింపు ఇచ్చారు.  'వండిచక్కరం' చిత్రంలో నటించడం ద్వారా ఆమెకి మంచి పేరు వచ్చింది.

అంతేకాదు ఈ చిత్రంలో సిల్క్ పాత్రలో నటించిన నేపథ్యంలో ఆ దర్శకుడు ఇచ్చిన  స్మిత  పేరుని యాడ్‌ చేసి తర్వాత సిల్క్ స్మితగా అటు ఇండస్ట్రీ, ఇటు అభిమానులు పిలుచుకున్నారు. అదే ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 

47
Silk Smitha

Silk Smitha

తొలుత వ్యాంపు రోల్స్ చేయడంతో వాటికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన రావడంతో సిల్క్ స్మితకి ఆఫర్లు పెరిగాయి. వరుసగా మేకర్స్ ఆమెని తీసుకునేందుకు క్యూ కడుతున్నారు.

ఈ క్రమంలో ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించింది. ఓ వైపు హీరోయిన్‌గా మూవీస్‌, మరోవైపు వ్యాంపు రోల్స్, ఇంకోవైపు ఐటెమ్‌ సాంగ్స్ తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత.  

57
Silk Smitha

Silk Smitha

1980, 1990 దశకాల్లో సిల్క్ స్మిత దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర తారగా వెలుగొందారు. 80వ దశకంలో కలల రాణిగా కూడా మెరిసింది. ఆమె కళ్లకు చాలామంది అభిమానులు దాసోహం అయ్యారు. అంత శక్తి ఆమె కళ్లలో ఉంది. మలయాళం, తమిళ హీరోలు తమ చిత్రాల్లో సిల్క్ స్మిత పాటలు ఉండాలని కోరుకునేవారు. తెలుగులోనూ ఆ డిమాండ్‌ పెరిగింది. 

67
Silk Smitha

Silk Smitha

సిల్క్ ఒక్క ఐటమ్ డ్యాన్స్ చేయడానికి 50 వేల వరకు పారితోషికం తీసుకునేదట. ఇది ఇప్పటి కాలంలో 5 కోట్లకు సమానమని చెబుతారు. అంటే హీరోయిన్ కంటే 10-5 నిమిషాల పాటకి ఎక్కువ పారితోషికం తీసుకునేది. ఇప్పటి లెక్క ప్రకారం సమంత, రష్మికలు కూడా ఆమె ముందు నిలబడరని చెప్పొచ్చు.

సిల్క్ డ్యాన్సర్, విలన్ పాత్రల్లోనూ నటించారు. ఒక దశలో సినిమా అవకాశాలు తగ్గినప్పుడు సినిమా నిర్మాణం చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆమెకు 2 కోట్ల వరకు నష్టం వచ్చి మద్యపానానికి బానిస అయ్యారని సమాచారం. 

77
Silk Smitha

Silk Smitha

దీంతో తరచూ వివాదాల్లో చిక్కుకునేది. చివరికి మానసిక ఒత్తిడి, దుఃఖం తట్టుకోలేక సిల్క్ స్మిత 35 ఏళ్ల వయసులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతారు. కానీ, ఆమె మరణించినా ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ ఇంక వీడలేదు. మిస్టరీగానే ఉండిపోయింది.

అయినా సిల్క్ స్మిత క్రేజ్‌ తగ్గలేదు. ఇప్పటికీ ఆమె క్రేజ్‌ కొనసాగుతుంది. ఆమె బయోగ్రపీపై ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో మూవీ రూపొందుతుండటం విశేషం. 

read  more: కృష్ణ `దేవదాసు` ఫ్లాప్‌ కి కారణమేంటో తెలుసా? ఏఎన్నార్‌ అంత దెబ్బ కొట్టాడా?.. సూపర్‌ స్టార్‌ బయటపెట్టిన నిజాలు

also read: రాజశేఖర్‌ హీరోగా పనికిరాడు అని మొహం మీదే చెప్పిన నిర్మాత.. కట్‌ చేస్తే ఆయన బ్యానర్‌లోనే బ్లాక్‌ బస్టర్స్

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image2
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Recommended image3
Oh Na Siddayya Song: భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పే పాట.. సోనూసూద్‌ ఆవిష్కరించిన ఓ నా సిద్ధయ్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved