ఇద్దరూ బాగా కావలసిన వారే, అయినా సూపర్ హిట్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణం అదొక్కటేనా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ చిత్రాలని రిజెక్ట్ చేశారు. అవి మరొక హీరోకి వరంలా మారాయి. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎప్పుడూ సాఫ్ట్ రోల్స్ చేయలేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో చాలా సూపర్ హిట్ చిత్రాలని రిజెక్ట్ చేశారు. అవి మరొక హీరోకి వరంలా మారాయి. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎప్పుడూ సాఫ్ట్ రోల్స్ చేయలేదు. ఎలాంటి చిత్రం చేసినా అందులో మాస్ యాక్షన్ ఉండేలా చూసుకున్నారు.
ఒకసారి మాత్రం ఎన్టీఆర్ కి ఒక సాఫ్ట్, హార్ట్ టచింగ్ మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ కూడా ఆ చిత్రాన్ని చేయడానికి ఎగ్జైట్ అయ్యాడు. అది మల్టీస్టారర్ చిత్రం. ఆ మూవీ మరేదో కాదు ఊపిరి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది.
నాగార్జున, కార్తీ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇది. ఈ చిత్రంలో కార్తీ పాత్రకి ముందుగా వంశీపైడిపల్లి ఎన్టీఆర్ ని అనుకున్నారు. వంశి పైడిపల్లి ఎన్టీఆర్ కి బృందావనం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ చిత్రంలో నటించే నాగార్జున కూడా తారక్ కి బాగా క్లోజ్. నాగార్జున ఎన్టీఆర్ ని తన పెద్ద అబ్బాయి అని ఆప్యాయంగా పిలుస్తారు. హరికృష్ణని నాగార్జున సొంత అన్నయ్యగా భావిస్తారు. వీరిద్దరూ సీతారామరాజు చిత్రంలో నటించారు.
ఊపిరి చిత్రం అంతా ఎన్టీఆర్ కి నచ్చింది కానీ.. నాగార్జున కాళ్ళకి సాక్సులు తొడిగే సీన్ ఉంటుంది. తన ఫ్యాన్స్ అంగీకరిస్తారా లేదా అనే అనుమానంతో ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని చివరి నిమిషంలో రిజెక్ట్ చేశారట. ఆ విధంగా ఈ మూవీ కార్తీ చేతుల్లోకి వెళ్ళింది. కార్తీ కూడా తన పాత్రకి న్యాయం చేస్తూ అద్భుతంగా నటించాడు.
ఒక వేళ ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించి ఉంటే ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోయేది. తండ్రి కొడుకులు హరికృష్ణ, ఎన్టీఆర్ లతో నటించిన అనుభూతి నాగార్జునకి ఉండేది. కానీ అది జరగలేదు.