MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్

తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' బిజినెస్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్

లుగు రాష్ట్రాల రైట్స్   సితార ఎంటర్టైన్మెంట్స్  తీసుకుని దాన్ని విడిగా ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఇస్తున్నారు. 

2 Min read
Author : Surya Prakash
Published : Aug 12 2024, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


కల్కి తర్వాత ఇప్పుడు అందరి దృష్టీ దేవరపైనే ఉంది.   'దేవర' మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుండటంతో బిజినెస్ కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషన్ మెటీరియల్ జనాల్లోకి బాగా వెళ్లటంతో అదిరిపోయే రేంజిలో  బిజినెస్ జరుగుతోంది. కోపంతో చూస్తూ ఉన్న ఎన్టీఆర్ లుక్ బిజినెస్ కు కారణమవుతోంది. యాక్షన్ మామూలుగా ఉండదని , అరాచకం అని కొరటాల ఎలాగైనా ఇండస్ట్రీ మారుమ్రోగే స్దాయిలో హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ భారీగా జరిగింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


అందుతున్న సమాచారం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్   సితార ఎంటర్టైన్మెంట్స్  తీసుకుని దాన్ని విడిగా ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఇస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం  బిజినెస్ 115 కోట్లకు రీచ్ అయ్యింది. ఇదే ఎన్టీఆర్ కెరీర్ లో హైయిస్ట్ అని తెలుస్తోంది. ట్రేడ్ సర్కిల్క్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ హిందీ డబ్బింగ్ రైట్స్  45 కోట్లు దాకా  పలికాయని వినికిడి. ఆర్. ఆర్.ఆర్ తో ఎన్టీఆర్ కు వచ్చిన ప్యాన్ ఇండియా క్రేజ్ ..దేవరకు బాగా ప్లస్ కానుంది. దాంతో హిందీ వెర్షన్ పై బాగా అంచనాలు ఉన్నాయి. హిందీ బెల్ట్ లో తన సత్తా ఏమిటో ఎన్టీఆర్ చూపించాల్సిన సమయం ఇది. 

36
devara

devara

రెండు తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ఆయిన సితార ఎంటెర్టైనమెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ రేట్ కు కొనుగోలు చేసాడు. అలాగే రీసెంట్ గా దేవర కర్ణాటక థియేట్రికల్ రైట్స్ కూడా డీల్ క్లోజ్ చేశారు దేవర నిర్మాతలు. కన్నడ  థియేట్రికల్ రైట్స్ ను   రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ కన్నడ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ KVN ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా కొనుగోలు చేసాడు.   

46

 సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నారు. ఆయన తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం బయిటకు రాగానే వంశీకు భారీ గా రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. కేవలం అడ్వాన్స్ ఇచ్చి రైట్స్ పెట్టుకుని వంశీ ...డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దాంతో తన జేబులోంచి పడకుండానే వంశీకు మంచి లాభాలు రాబోతున్నట్లు చెప్తున్నారు.   దసరా సీజన్ లో టెర్రిఫిక్ బజ్ తో ఈ సినిమా రిలీజ్ కానుండటమే అందుకు కారణం. 

56


ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవర టీమ్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ముఖ్యమైన నార్త్ థియేట్రికల్ రిలీజ్‌ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌‌ను రంగంలోకి దింపింది. "ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. ఒక మాస్ తుపాను మనందరినీ ముంచేయడానికి త్వరలోనే రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో బిగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి" అంటూ కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

66
junior ntr movie devara

junior ntr movie devara


కరణ్ జోహార్‌తో పాటు AA ఫిలిమ్స్ సంయుక్తంగా నార్త్‌లో దేవర సినిమాను రిలీజ్ చేయబోతుంది. కరణ్ జోహార్‌ లాంటి నిర్మాత బాలీవుడ్‌లో దేవరను రిలీజ్ చేస్తుండటంతో దేవర మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. దీన్ని బట్టి చూస్తే దేవర సినిమాను నార్త్‌లో వీలైనంత ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith Naidu Remuneration: సంచలన కంటెస్టెంట్‌ రోహిత్‌ బిగ్‌ బాస్‌ పారితోషికం ఎంతో తెలుసా? ఇందులోనూ అన్యాయమేనా
Recommended image2
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image3
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved