- Home
- Entertainment
- ఓజీలో అకీరా, బాంబు పేల్చబోతున్న సుజీత్ ? రాంచరణ్ ఇన్వాల్వ్‌మెంట్ పై రేణు దేశాయ్ ఏమన్నారంటే
ఓజీలో అకీరా, బాంబు పేల్చబోతున్న సుజీత్ ? రాంచరణ్ ఇన్వాల్వ్‌మెంట్ పై రేణు దేశాయ్ ఏమన్నారంటే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. దీనితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని రూమర్స్ ఓజీ మూవీపై మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి.

ఓజీ మ్యానియాతో రికార్డులు బద్దలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ ఫీవర్ తో ఊగిపోతున్నారు. మరికొన్ని గంటల్లో ఓజీ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ టైంలో ఓజీ మూవీ గురించి కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కానీ ఆ రూమర్స్ ఫ్యాన్స్ లో హైప్ ని ఇంకా పెంచేస్తున్నాయి.
ఓజీలో అకీరా నందన్ ?
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లుగా ఉంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ విధ్వంసం సృష్టించే ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ యంగ్ గా ఉన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు అకీరా నందన్ కనిపిస్తారని ఒక ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరికొందరైతే ఓజీ పార్ట్ 2 అకీరాతో అని సుజీత్ క్లైమాక్స్ లో బాంబు పేల్చబోతున్నాడు అంటూ రూమర్స్ వస్తున్నాయి. దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు.
రేణు దేశాయ్ రియాక్షన్ ఇదే
అయితే దీనిపై రేణు దేశాయ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఓజీ మూవీలో అకీరా నటిస్తున్నాడనేది పూర్తిగా అవాస్తవం. ఇప్పటిలో అకీరా ఎంట్రీ ఉండదు. అకీరాకి సినిమాల్లో నటించాలనే ఆలోచన వచ్చిన మరు క్షణమే నేనే స్వయంగా నా సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు అకీరా గురించి వస్తున్న ఎలాంటి వార్తలు నమ్మకండి అని రేణుదేశాయ్ ఫ్యాన్స్ ని కోరారు. మరోవైపు అకీరాని లాంచ్ చేయడానికి రాంచరణ్ ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అది కూడా అబద్దమే అని రేణు దేశాయ్ తేల్చి చెప్పేశారు.
సుజీత్ సినిమాటిక్ యూనివర్స్
ఓజీ గురించి మరో రూమర్ కూడా వైరల్ అవుతోంది. సాహో, ఓజీ చిత్రాలతో సుజీత్ తన సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నారు అని.. ఓజీ మూవీలో సాహో కనెక్షన్ ఉండబోతోందని అంటున్నారు. దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఇది నిజమో కాదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
ఓజీ ప్రీమియర్ షో చూడబోతున్న అకీరా
ఇదిలా ఉండగా అకీరా నందన్.. డైరెక్టర్ సుజీత్, మరికొందరు సెలెబ్రిటీల తో కలిసి హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో ఓజీ ప్రీ ప్రీమియర్ షో చూడబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచి, ఏపీలో రాత్రి 10 గంటల నుంచి పైడ్ ప్రీమియర్ షోలు పడనున్నాయి.