ముదిరిన రచ్చ, డాకు మహారాజ్ చిత్రాన్ని బాయ్ కాట్ చేస్తామంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..మధ్యలో నలిగిపోయేది వాళ్ళే
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు డాకు మహారాజ్ పై మంచి బజ్ ఉంది. అయితే అది క్రమంగా నెగిటివిటీగా మారుతోంది. కొన్ని వివాదాల వల్ల డాకు మహారాజ్ చిత్రంపై నెగిటివిటీ పెరుగుతోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు డాకు మహారాజ్ పై మంచి బజ్ ఉంది. అయితే అది క్రమంగా నెగిటివిటీగా మారుతోంది. కొన్ని వివాదాల వల్ల డాకు మహారాజ్ చిత్రంపై నెగిటివిటీ పెరుగుతోంది. టైటిల్ టీజర్ రిలీజ్ చేసినప్పుడే డైరెక్టర్ బాబీ బాలయ్యని కొత్తగా చూపిస్తూ మాస్ తాండవం చేయబోతున్నాడు అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఈ చిత్రం వాల్తేరు వీరయ్య కంటే బెటర్ గా ఉంటుంది.. చిరంజీవి ఫ్యాన్స్ హర్ట్ అయినా పర్వాలేదు అంటూ నాగవంశీ చేసిన కామెంట్స్ తో చిన్నపాటి వివాదాలు మొదలయ్యాయి. ఇటీవల ఈచిత్రంలో దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయింది. మాస్ ఆడియన్స్ కి ఈ సాంగ్ బాగా ఎక్కేసింది. బాలయ్య, ఊర్వశి స్టెప్పులని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొన్ని స్టెప్పులు వల్గర్ గా ఉన్నాయంటూ మరో వివాదం వివాదం సాగింది. ఏది ఏమైనా ఆ సాంగ్ మాత్రం ఊర్వశి గ్లామర్, బాలయ్య డ్యాన్స్ తో కోటి వ్యూస్ ఆల్రెడీ దాటేసింది.
తాజాగా మరో కొత్త వివాదం వచ్చిపడింది. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కి డాకు మహారాజ్ చిత్ర యూనిట్ డైరెక్టర్ బాబీ, తమన్. నాగవంశీ హాజరయ్యారు. ప్రమోషన్స్ లో భాగంగా వీళ్లంతా బాలయ్య షోకి హాజరయ్యారు. ఈ షోలో బాలయ్య డైరెక్టర్ బాబీతో సినిమాలు చేసిన హీరోల అందరి ఫోటోలు ఒక్కొక్కటిగా ప్రదర్శించారు. బాబీ ఆ హీరోల గురించి తన అభిప్రాయం చెబుతూ వచ్చారు.
డైరెక్టర్ బాబీ సినిమాలు చేసిన రవితేజ, పవన్ కళ్యాణ్, వెంకటేష్, చిరంజీవి ఇలా అందరి ఫోటోలు ప్రదర్శించారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తప్ప. జూనియర్ ఎన్టీఆర్ తో బాబీ జైలవకుశ అనే చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కానీ బాలయ్య, బాబీ మధ్య ఎన్టీఆర్ ప్రస్తావనే రాలేదు. కావాలనే ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా చేశారు అంటూ తారక్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. బాలయ్య,జూ ఎన్టీఆర్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవని చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంఘటనతో ఆ రూమర్స్ కి మరింత బలం చేకూరింది.
బాలకృష్ణ స్వయంగా ఆహా టీంకి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఉండకూడదు అని చెప్పి తొలగించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య వివాదాలు ఉంటే మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉండొచ్చు. కానీ ఇలా షోలలో బహిర్గతం చేసుకోవడం ఎందుకు ? జూ ఎన్టీఆర్ పేరు చెప్పడం ఇష్టం లేకపోతే డైరెక్టర్ బాబీతో అలాంటి ఎపిసోడ్ పెట్టకుండా ఉండాల్సింది. బాబీ హీరోల లిస్ట్ మొత్తం చూపించి ఎన్టీఆర్ ని మాత్రం విస్మరించి ఫ్యాన్స్ ని హర్ట్ చేయడం ఎందుకు అని కొందరు మండిపడుతున్నారు.
దీనితో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాలయ్యపై కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ చిత్రాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాయ్ కాట్ చేసేలా చర్చలు జరుగుతున్నట్లు టాక్. దీనితో జరుగుతున్న డ్యామేజ్ ని గ్రహించిన నిర్మాత నాగవంశీ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వటానికి ప్రయత్నిద్దాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. మరి తారక్ ఫ్యాన్స్ శాంతిస్తారా లేక డాకు మహారాజ్ చిత్రాన్ని బాయ్ కాట్ చేస్తారో చూడాలి. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో నలిగిపోయేది మాత్రం దర్శకుడు, నిర్మాత మాత్రమే.