MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Jr NTR: మీరు త్వరగా రావాలి, పవన్ సర్జరీపై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్.. చిరు, బన్నీ, చరణ్ ఏమంటున్నారంటే

Jr NTR: మీరు త్వరగా రావాలి, పవన్ సర్జరీపై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్.. చిరు, బన్నీ, చరణ్ ఏమంటున్నారంటే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సర్జరీ జరగడంతో టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి వారు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు పెట్టారు. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 19 2026, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jr NTR
Image Credit : Asianet News

Jr NTR

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శనివారం రోజు సర్జరీ జరిగింది. కొంత కాలంగా పవన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూ, నటుడిగా సినిమాల్లో సైతం నటిస్తున్నారు. ఇటీవల పవన్ కి అస్వస్థత ఎక్కువ కావడంతో శనివారం రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. సర్జరీ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శ్వాస పరమైన ఇబ్బంది
Image Credit : Asianet News

శ్వాస పరమైన ఇబ్బంది

అయితే అది దేనికి సంబంధించిన ఆపరేషన్ అనే వివరాలని జనసేన పార్టీ కానీ, పవన్ సన్నిహితులు కానీ బయట పెట్టలేదు. దీనితో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అయితే పవన్ సర్జరీకి సంబంధించిన వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి కొంత కాలంగా శ్వాస పరమైన ఇబ్బంది ఉంది. అది సైనసైటిస్ వల్ల తలెత్తిన ఇబ్బంది అని వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేసి నిర్ధారించారు.

35
10 రోజుల పాటు విశ్రాంతి
Image Credit : facebook.com/KChiranjeeviFans

10 రోజుల పాటు విశ్రాంతి

ముక్కుకి సర్జరీ అవసరం అని వైద్యులు చెప్పడంతో పవన్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ అనంతరం పవన్ ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని పవన్ కి వైద్యులు సూచించారు. పవన్ కి సర్జరీ జరగడంతో టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

45
ఆరోగ్యంతో పబ్లిక్ లైఫ్ లోకి తిరిగి రావాలి
Image Credit : Asianet News

ఆరోగ్యంతో పబ్లిక్ లైఫ్ లోకి తిరిగి రావాలి

జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలి అని ప్రార్థిస్తున్నా. వీలైనంత త్వరగా ఆయన ఆరోగ్యంతో పబ్లిక్ లైఫ్ లోకి తిరిగి రావాలి అని పోస్ట్ చేశారు.

చిరంజీవి ట్వీట్ చేస్తూ.. కళ్యాణ్ బాబుకి విజయవంతంగా ఆపరేషన్ పూర్తయింది. ఆరోగ్యం నిలకడగా ఉంది. రికవరీ అవుతున్నాడు. డాక్టర్లు చెప్పిన దానిప్రకారం కళ్యాణ్ బాబు వారంలో పూర్తిగా కోలుకుంటాడు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రేమ అభిమానులకు ధన్యవాదాలు అని అన్నారు.

Wishing Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan garu a speedy recovery. May you return to public service soon with renewed strength and good health.

— Jr NTR (@tarak9999) April 19, 2026

55
 పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని
Image Credit : instagram

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని

అదే విధంగా రాంచరణ్, అల్లు అర్జున్ లు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ లో పోస్ట్ లు పెట్టారు. వీరితో పాటు మరికొందరు సెలెబ్రిటీలు, దర్శకులు, నటులు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు చేస్తున్నారు.

Wishing Hon’ble Deputy CM of Andhra Pradesh, @PawanKalyan Garu, a smooth and speedy recovery.

Looking forward to seeing you back in action, stronger than ever.

— Ram Charan (@AlwaysRamCharan) April 19, 2026

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Related Stories
Recommended image1
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Recommended image2
Nayanthara Controversies: నయనతారతో కలిసి అల్లు అర్జున్ జీవితంలో నటించడా.. ఒకటా రెండా లెక్కలేనన్ని వివాదాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved