MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షాకింగ్.. ఆస్తి వివాదంలో హైకోర్టుకి జూ.ఎన్టీఆర్..ఆ మహిళ దారుణ మోసం బట్టబయలు, ఇవిగో వివరాలు

షాకింగ్.. ఆస్తి వివాదంలో హైకోర్టుకి జూ.ఎన్టీఆర్..ఆ మహిళ దారుణ మోసం బట్టబయలు, ఇవిగో వివరాలు

ఆది చిత్రంలో ఎన్టీఆర్ 2002లోనే స్టార్ హీరో అయ్యాడు. అప్పటి నుంచే ఆస్తులు కొనడం తారక్ ప్రారంభించాడట.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 17 2024, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. వార్ 2 తో తారక్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కావడంతో రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది పక్కన పెడితే ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం చేసే ప్లానింగ్ పక్కాగా ఉంటోంది. ఇప్పటి నుంచే తారక్ ఆస్తులు కొనడం, డబ్బు సేవ్ చేసుకోవడం, పిల్లల కోసం డబ్బు కేటాయించడం లాంటివి చేస్తున్నారు. 

38

ఆ మధ్యన తారక్ హైదరాబాద్ శివారు ప్రాంతం శంకర్ పల్లిలో 6 ఎకరాల విలువైన ఫామ్ హౌస్ కొనుగోలు చేశాడు. ఆది చిత్రంలో ఎన్టీఆర్ 2002లోనే స్టార్ హీరో అయ్యాడు. అప్పటి నుంచే ఆస్తులు కొనడం తారక్ ప్రారంభించాడట. 2003లో ఎన్టీఆర్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. 

48
Jr NTR

Jr NTR

ఇప్పుడు ఆ స్థలం తీవ్ర వివాదం గా మారింది. ఆస్తి వివాదం తలెత్తడంతో ఎన్టీఆర్ హై కోర్టుని ఆశ్రయించాడు. పూర్తి వివరాలని గమనిస్తే.. సంకు గీతా అనే మహిళ నుంచి ఎన్టీఆర్ 680 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. చట్ట ప్రకారం అనుమతి తీసుకుని గత ఏడాది నుంచి తారక్ ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. 

58

అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పలు బ్యాంకులు రంగంలోకి దిగాయి. ఆ మహిళ ఎన్టీఆర్ కి ఫేక్ డాక్యుమెంట్స్ తో స్థలం అమ్మినట్లు తెలుస్తోంది. తాను కేవలం ఒక్క బ్యాంకులోనే రుణం తీసుకుని 1996లో ఈ స్థలాన్ని కొన్నట్లు తారక్ కి చెప్పింది. 

68

కానీ సంచలన విషయం ఏంటంటే ఆమె ఈ స్థలాన్ని షూరిటీ గా పెట్టి బ్యాన్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్,ఎస్బిఐ ఇలా పలు బ్యాంకుల్లో ఆమె రుణాలు తీసుకుందట. ఆ రుణం తీరకపోవడంతో ఈ బ్యాంకులన్నీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించాయి. దీనితో ట్రిబ్యునల్ ఆ స్థలాన్ని బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చు అని అనుమతులు ఇచ్చింది. 

78

ఇప్పుడు బ్యాంకులు రంగంలోకి దిగడంతో ఎన్టీఆర్.. సంకు గీతపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అంతే కాదు బ్యాంకులు తన స్థలాన్ని స్వాధీనం చేసుకోకుండా తారక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం  విచారణ చేపట్టింది.

88

హై కోర్టు కేసు విచారణని జూన్ 6 కి పోస్ట్ పోన్ చేసింది. జూన్ 3 లోగా స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని కోర్టుకి అందజేయాలని జడ్జీలు పేర్కొన్నారు. మొత్తంగా కోట్ల రూపాయలతో కొన్న స్థలం ఎన్టీఆర్ కి ఊహించని సమస్యగా మారింది. అబద్దాలతో, ఫేక్ డాక్యుమెంట్స్ తో తారక్ కి స్థలం అమ్మిన సంకు గీతకి చట్టం బుద్ది చెప్పాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Sushmita Sen House: సముద్రం పక్కనే సుస్మితా సేన్ ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Cocktail 2 Trailer Review: షాహిద్ తో రష్మిక, కృతి సనన్ బోల్డ్ రొమాన్స్.. గ్లామర్ షో తప్ప ఇంకేం లేదా ?
Recommended image3
రీతూ చౌదరి ఎవరో తెలియదు, ఆమె రాగానే పెద్ద హంగామా చేశారు.. గ్లామర్ ని అందుకే వాడుకోలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved